గుడుంబా స్థావరంపై పోలీసుల మెరుపు దాడి…

గుడుంబా స్థావరంపై పోలీసుల మెరుపు దాడి.

480 లీటర్ల పానకం, సారాయిబట్టి, డ్రమ్ములు పరికరాల ధ్వంసం. 10 లీటర్ల నాటుసారా స్వాధీనం

వ్యక్తిపై కేసు నమోదు..పరారీలో నిందితుడు,

ఇటుక బట్టీల వద్ద గుడుంబా తయారీ పట్ల పలు అనుమానాలు

నర్సంపేట, నేటిధాత్రి:

 

భారీ ఎత్తున గుడుంబా తయారు చేస్తున్న గుడుంబా స్థావరంపై దుగ్గొండి పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ప్రజలు నివ్వరపోయే భారీ ఎత్తున డ్రమ్ములు, పెద్దపెద్ద కట్టెలవాములు, గుడుంబా బట్టి వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన దుగ్గొండి మండలంలోని ముద్దునూరు గ్రామ శివారు ఇటుక బట్టీల వద్ద గుడుంబా తయారీ కేంద్రం తెలుగులోకి రావడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ గుడుంబాబట్టి వ్యవహారం గత కొన్ని ఏళ్లుగా అక్కడే నిర్వహించడం హలో అనుమానాలకు తావితీస్తున్నాయి. గుడుంబా తయారుదారుడు నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామానికి చెందిన వ్యక్తి కావడం ఆ వ్యక్తి ప్రతిరోజు ముద్దునూరు గ్రామంతో పాటు వివిధ ప్రాంతాలకు నాటుసారాను విక్రయించడం గమనార్హం. ఈ నేపథ్యంలో గుడుంబా తయారు చేసే వ్యక్తి గ్రామంలో ఉన్న ప్రజలకు తెలవడం ఒకింతైతే.. గుడుంబా తయారు చేసే బట్టి పక్కనే గల ఇటుక బట్టీల యాజమానులు గుడుంబా బట్టి ఎవరిదో అని మాట్లాడడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

గుడుంబా తయారీ కేంద్రంపై పోలీసుల మెరుపుదాడి..

దుగ్గొండి మండలంలో మద్దునూరు గ్రామ పరిధిలోని జక్కుల స్వామికి చెందిన ఇటుక బట్టీల ప్రక్కనే భారీ గుడుంబా తయారీ బట్టీల కేంద్రాన్ని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డి గుర్తించారు. ముద్దునూరు.. గుడ్డేల్గులపల్లె గ్రామాల మధ్య నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామానికి చెందిన రసపుత్ర బాలు నాటసారాయితో అనుమానాస్పదంగా వెళుతున్న క్రమంలో ఎస్ఐ రణధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వెంబడించారు. ఈ క్రమంలో ఇటుక బట్టీల లోపల వైపుకు వెళ్లడంతో అనుమానంతో ఇటుక బట్టీల చుట్టుపక్కల పరిశీలించగా ఇటుక బట్టి పక్కనే భారీ ఎత్తున గుడుంబా తయారీ కేంద్రాన్ని గుర్తించారు.

దీంతో స్థానిక సర్పంచ్ సహకారంతో గుడుంబా తయారు కేంద్రం చుట్టుపక్కల శోధించగా భారీ ఎత్తున గుడుంబా పానకాన్ని భూమిలో పాతిపెట్టగా వాటిని గుర్తించారు. గడ్డపారల సహాయంతో పానకం డ్రమ్ములను బయటకు తీయగా నాలుగు డ్రమ్ములలో 480 లీటర్లు పానకం ఉన్నట్లు గుర్తించి వాటిని ధ్వంసం చేసినట్లు ఎస్సై తెలిపారు. అలాగే గుడుంబా తయారీకి సంబంధించిన బట్టి వాటి పరికరాలు డ్రమ్ములను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. నాటుసార తయారీదారుడు నల్లబెల్లి మండలం రేలకుంట గ్రామానికి చెందిన రసపుత్ర బాలు

పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రణధీర్ రెడ్డి తెలిపారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

నాటసారా తయారు చేసిన అమ్మిన కఠిన చర్యలు తప్పవు.

నిషేధిత అక్రమ గుడుంబా ను తయారుచేసిన.. విక్రయించిన.. అందుకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని
దుగ్గొండి ఎస్ఐ రావుల రణధీర్ రెడ్డి హెచ్చరించారు. నాటసార తాగడం వలన అతి తక్కువ సమయంలోనే అనారోగ్యానికి గురవుతారని ఈ సందర్భంగా ఎస్సై పేర్కొన్నారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ , రాజ్ కుమార్,మానుపాటి రవీందర్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version