ఫోటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్లాంటిది…

ఫోటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్లాంటిది

జర్నలిజం మహావృక్షంలో ఫోటో జర్నలిస్టులు ప్రాణంలాంటివారు

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌లో 23వ ఉత్తమ ఫోటో జర్నలిస్ట్ అవార్డుల ప్రధానోత్సవం

హైదరాబాద్,నేటిధాత్రి:

ఫోటో జర్నలిజం ప్రజాస్వామ్యానికి కళ్లాంటిదని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. జర్నలిజం ఒక మహావృక్షమైతే అందులో ఫోటో జర్నలిస్టులు ప్రాణం లాంటి వారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎస్పీజేఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘23వ ఉత్తమ ఫోటో జర్నలిస్ట్–2025 అవార్డుల ప్రధానోత్సవం’ హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆడిటోరియంలో ఆదివారం జరిగింది.ఈ కార్యక్రమానికి టీఎస్పీజేఏ రాష్ట్ర అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఐఎన్‌టీయూసీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు మొగుళ్ళ రాజిరెడ్డి, ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఫోటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఫోటో జర్నలిస్టులకు అవార్డులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి ఇందు శ్రీనివాస్ (ఈనాడు, నిజామాబాద్), ద్వితీయ బహుమతి ఎ. క్రిష్ణ (హాన్స్ ఇండియా, హైదరాబాద్), తృతీయ బహుమతి జి. బాలస్వామి (సాక్షి, హైదరాబాద్) అందుకున్నారు.అలాగే మరో పది మంది ఫోటో జర్నలిస్టులు ఎన్.రాజేష్ (సాక్షి,హైదరాబాద్),జి.శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ, హైదరాబాద్), ఎ.జాన్

(సాక్షి,హైదరాబాద్),ఆర్.రాజు(సాక్షి,ఖమ్మం),పి.వాసప్రసాద్(సాక్షి,వరంగల్), ఎం.శ్రీనివాస్(ది హన్స్ ఇండియా,నల్లగొండ), జి.వేణుగోపాల్(సాక్షి,జనగాం),ఎం.అనిల్ కుమార్ (ఆంధజ్యోతి, హైదరాబాద్), వీరగోని.రాజనికాంత్ గౌడ్(నమస్తే తెలంగాణ,హైదరాబాద్), ఎ.జ్వల కోటేశ్వర్ రావు (ఆంద్రజ్యోతి, హైదరాబాద్), జర్నలిస్టులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రిపోర్టర్ కలం పెడితే, ఫోటో జర్నలిస్టు క్షణాన్ని బంధిస్తారని అన్నారు. ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నా భాషతో సంబంధం లేకుండా అర్థమయ్యేది ఫోటోగ్రఫీ మాత్రమేనని చెప్పారు. వంద మాటలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెబుతుందని అభివర్ణించారు.మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత జర్నలిజంలో ఎన్నో మార్పులు వచ్చాయని, ముఖ్యంగా ఎఐ టెక్నాలజీ అన్ని రంగాలకు ఉపయోగకరంగా మారిందన్నారు. ఫోటో జర్నలిస్టులు కూడా ఎఐ రంగంలో ఎలా ముందుకు వెళ్లాలో చర్చించుకోవాలని సూచించారు.మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ అక్షర సత్యానికి ఊపిరి పోసే సాధనమే ఫోటో జర్నలిజం అని అన్నారు. ఐజెయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ నేరుగా తీసిన ఫోటోలోని సహజతత్వం, కృత్రిమంగా చిత్రీకరించిన చిత్రాలకు ఉండబోదన్నారు. ఈ కార్యక్రమంలో టి.ఎస్.పి.జె.ఏ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె.నరహారి, ఉపాధ్యక్షులు పి. రామ్ మూర్తి, కోశాధికారి కె.అనిల్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి. వసంత్ కుమార్, ఏం. ఏ. సర్వర్, పి. మోహన చారి, అలీముద్దీన్, పి. హరి కృష్ణ, ఏ. మహేష్ కుమార్, నేతలు బషీరుద్దీన్, టి. వి. రమణ, రాజ్ కుమార్, పి. వెంకటేష్, గోపి, జి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version