బ్యాంకింగ్ పరిశోధనలో పీహెచ్‌డీ గౌరవం

ప్రభుత్వ ప్రైవేటు రంగాల తులనాత్మక అధ్యయనంపై పరిశోధనలు గర్వకారణం

• డాక్టర్ సీహెచ్. వి. పురుషోత్తం రెడ్డి

నేటిధాత్రి, మొయినాబాద్ :

 

మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్‌ చైతన్య డీమ్డ్ టూ బి యూనివర్సిటీ లో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగంలో వి.స్వప్నకు పరిశోధనలో ఉత్తమ ప్రతిభకు పీహెచ్‌డి డిగ్రీ అందించడం జరిగింది. వారు లిక్విడిటీ అండ్ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ అఫ్ కమర్షియల్ బ్యాంక్స్ ఏ కంపరేటివ్ స్టడీ అఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఇన్ ఇండియా అనే అంశంపై పరిశోధనను ఆచార్య జి. ఉషశ్రీ పర్యవేక్షణలో పూర్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక పీహెచ్‌డి డిగ్రీని విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు అండ్ చాన్సలర్ డాక్టర్ సిహెచ్. వి. పురుషోత్తం రెడ్డి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ రంగంలో పరిశోధనలు రాష్ట్రం, దేశ అభివృద్ధికి కీలకమని, వాణిజ్య బ్యాంకుల ద్రవ్యత్వం లాభదాయకత విశ్లేషణ, భారతదేశంలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల తులనాత్మక అధ్యయనంపై పరిశోధన చేయడం గర్వకారణమన్నారు. భవిష్యత్ పరిశోధనల అభివృద్ధికి బలమైన పునాది ఏర్పరుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ సెక్రటరీ కమ్ కరెస్పాండంట్ సిహెచ్ . సువర్ణ దేవి , డైరెక్టర్ అండ్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్. సాత్విక రెడ్డి, వైస్ ఛాన్సలర్ ఆచార్య జి. శంకర్ లింగం, రిజిస్ట్రార్ ఆచార్య యం. రవీందర్, డీన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆచార్య క్రిస్టోఫర్, డీన్ అడ్మినిస్ట్రేషన్ ఆచార్య ఏ. రాజు, డీన్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ డాక్టర్ పి. సుగంధ దేవి, పరీక్షల కంట్రోలర్ ఆచార్య బి. రాజేందర్ రెడ్డి, డిప్యూటీ కంట్రోలర్ (పరీక్షల ) డాక్టర్ ఈ . జగదీశ్ కుమార్ , కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (విభాగాధిపతి) డాక్టర్ టి.వి.జి. శాస్త్రి, ఆచార్య జి. ఉషశ్రీ , అసిస్టెంట్ రిజిస్ట్రార్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version