భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యనారాయణ
వర్దన్నపేట (నేటిధాత్రి ):
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు వర్ధన్నపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.చిన్న పిల్లలను బయటకు వెళ్లకుండా చూడాలి. రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. లోతట్టు ప్రాంతాలు, శిథిలావస్థ ఇళ్లలోని వారిని సురక్షిత ప్రాంతాలకుగానీ, పునరా వాస కేంద్రాలకుగానీ అధికారులు తరలించి వారికి భోజన సదుపాయం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ళ నుండి బయటకు రావొద్దు. సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు ఎద్దు సత్యనారాయణ వర్ధన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు