లోతట్టు ప్రాంతాల ప్రజలు, మానేరు నది పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
లో లెవెల్ బ్రిడ్జిలను ఓర్రెలు దాటే ప్రయత్నం చేయవద్దు..ఎస్సై దీకొండ రమేష్
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం లో నిన్నటి నిండి కురుస్తున్న వర్షాలు వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రం లో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినందున మండలంలోని లోతట్టు ప్రాంతాలలో మరియు మానేరు నది పరివాహక ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలియజేశారు.భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, జలాశయాలు,చెరువులు, కుంటలను చూడడానికి వెళ్లకూడదని అన్నారు. శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, గ్రామాలలో చేపల వేటకు ఎవరు వెళ్ళవద్దని, రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలని, నీరు నిల్వ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్లరాదని, వాటర్ ఫాల్స్ లాంటి ప్రాంతాలను సందర్శించవద్దని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు బయట రావద్దని, వరద ప్రవాహల వద్ద బందోబస్త్ ఉన్న పోలీస్ సిబ్బంది సూచనలు పాటించి పోలీసు వారికి సహకరించాలని సూచించారు.మండలంలో ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా పోలీసు వారు చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఎస్సై గారు విజ్ఞప్తి చేశారు.