ఓదెల మల్లన్న హుండీ ఆదాయం రూ. 32 లక్షల పై చిలుకు..
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ ఎంతో ప్రసిద్ధిగాంచింది. స్వామి వారి పెద్ద పట్నాలు అగ్నిగుండం ఘనంగా నిర్వహించారు. నాలుగు నేలల హుండీ లెక్కింపు జరగ్గా హుండీ ఆదాయం రూ.ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు వచ్చినట్టు ఆలయ కార్య నిర్వహణ, పర్యవేక్షణ అధికారి సత్యనారాయణ తెలిపారు. అర్చకులు, దేవాలయ సిబ్బంది, బ్యాంకు ఉద్యోగులు, పోలీసులు, శ్రీవల్లి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.