లింగయ్య స్వచ్ఛంద సంస్థ సేవ ఆధ్వర్యంలో పెన్నులు బుక్కులు పంపిణీ
మందమర్రి నేటి ధాత్రి
విద్యార్థులకు లింగయ్య స్వచ్ఛంద సంస్థ సేవలు ఆదర్శం. సీఐ శశిధర్ రెడ్డి ఎంఈఓ దత్తు ప్రసాద్. విద్యార్థుల విద్యాభివృద్ధికి దివంగత అసోసియేట్ లింగయ్య స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమని సిఐ శశిధర్ రెడ్డి మండల విద్యాధికారి దత్తు ప్రసాద్ లు పేర్కొన్నారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ ఓర్రగడ్డ ప్రభుత్వ పాఠశాలలో లింగయ్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్కులు పెన్నులు పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రణాళిక అబద్దాలు ముందుకు వెళుతుందని తెలిపారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నుండి మొదలుకొని నోటుబుక్కులు కూడా ఉచితంగా అందజేయడమే కాకుండా మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు కన్న కలలను సహకారం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. గత మూడు దశాబ్దాల క్రితం చదివించడానికి తల్లిదండ్రులు చాలా కష్టపడేవారని కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయని పాఠ్యపుస్తకాలు నుండి మొదలుకొని మధ్యాహ్నం భోజనం వరకు ప్రభుత్వ పాఠశాలలోనే సమ కోరుతున్నాయని చెప్పారు. అంతేకాకుండా లింగయ్య లాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా విద్యార్థులకు చేయూతగా విద్యాసామాగ్రిని అందజేయడం గొప్ప విషయం అన్నారు. తాము కూడా కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. విద్యార్థి దశలో చెడలవాట్లకు ఎవరు కూడా బానిసలు కావద్దని వాటి జోలికి వెళ్ళవద్దని చెప్పారు.
మహిళా విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫోన్ చేయాలని లేదా తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందించాలని చెప్పారు. తన సోదరుని జ్ఞాపకార్థం విద్యాసామాగ్రిని అందజేస్తున్న సోదరుడు ప్రశంసనీయమని చెప్పారు. దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉందని విషయాన్ని విస్మరించవద్దని చెప్పారు. మంచి ఫలితాలు సాధించి పాఠశాల తో పాటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు నోటుబుక్కులతో పాటు పెన్నులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్ పాఠశాల హెచ్ఎం పద్మజ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రామ్ వెంకటేశ్వర్లు చిలుముల శ్రీనివాస్ జి రమేష్ బీమ్ పుత్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు