ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీలో మాస్టర్స్ పట్టా పొందిన పెద్దారపు ప్రజ్వల
న్యూ జెర్సీ సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో ప్రజ్వల ప్రతిభ
ఆనందం వ్యక్తం చేసిన ప్రజ్వల తల్లిదండ్రులు
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట పట్టణానికి చెందిన పెద్దారపు ప్రజ్వల అమెరికాలోని న్యూ జెర్సీలో గల ప్రఖ్యాత సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ విభాగంలో ప్రతిభ కనబరిచి మాస్టర్స్ పట్టా సాధించింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పట్టా ఇచ్చి ఘనంగా సత్కరించారు. దీంతో ప్రజ్వల తల్లిదండ్రులు పెద్దారపు రమేష్, రాధ ఇతర కుటుంబ సభ్యులు హర్షాన్ని వ్యక్తం చేస్తూ సంతోషాన్ని పంచుకున్నారు.విదేశాల్లో ఫోరెన్సిక్ సైన్స్ లో మాస్టర్స్ పట్టా సాధించిన అది కొద్ది మందిలో ప్రజ్వల ఒకరు.
ప్రజ్వల ఏడవ తరగతి వరకు నర్సంపేటలో, ఇంటర్ వరకు వరంగల్ లో, ఫోరెన్సిక్ గ్రాడ్యుయేషన్ మధుర ఉత్తర ప్రదేశ్ లో అభ్యసించింది అనంతరం ఫోరెన్సిక్ లో ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికాలోని న్యూ జెర్సీ లో గల సెయింట్ పీటర్స్ యూనివర్సిటీ అడ్మిషన్ ఇవ్వగ ప్రతిభ కనబరిచి మాస్టర్స్ పట్టా పొందడం గర్వించదగింది.
