ప్రతిఒక్కరు కారోన నుండి క్షేమంగా బయటపడలి

హైదరాబాద్ శ్రీనిధి కళాశాల రిజిస్టర్
చందా సాంబయ్య
వరంగల్ అర్బన్ :-
ప్రతిఒక్కరు కారోన వైరస్ ఎదుర్కొని క్షమంగా ఉండాలంటే తమ ఇండ్లలో ఉండటమే సురక్షితమని హైదరాబాద్ శ్రీనిధి ఇనిస్టుట్ సైన్స్ టెక్నోలజీ కళాశాల రిజిస్టర్ చందా సాంబయ్య పిలుపునిచ్చారు వరంగల్ గ్రేటర్ పరిధిలోని 5 వ డివిసన్ బొల్లికుంటా కీ.శే.శ్రీమతి పోగు రామక్క జ్ఞాపకార్ధం నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగినది కరోనలాంటి మహామర్రిని పరదోలి పేదలకు పేదలను అందుకోడానికి దాతలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు కేంద్రరాష్ట్ర ప్రభుత్వంలు కారోన నివారణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారను తెలిపారు సామాజిక దూరం పాటించడమే కరోనను ఎదుర్కొనే లక్ష్యం అన్నారు కారోన వైరస్ వ్యాప్తి నేపధ్యం లో కూలీలు ఇబంధులు ఎదుర్కొంటున్నారాని సాంబయ్య ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ఒక్కరు ఈ విపక్తరా సమయం లో ప్రతీ ఒక్కరు వ్యక్తీగత పరిశుభ్రత పాటించి ప్రతి 6 గంటలకు ఒకసారి సబ్బుతో చేతులు శుభ్రం చేస్కుకోవలన్నారు అత్యవసర పనులైన మధులు,నిత్యావసర సరుకులకోసం మాత్రమే ఇండ్లనుడి బయటకు రావాలని సాంబయ్య కోరారు ఈ కార్యక్రమంలో 150 మంది గ్రామస్థులకు 8 రకాల నిత్యావసర సరుకులు చొప్పున పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో 5వ డీవిసన్ పసునుటి స్వర్ణలత వజ్రయా N R I వెల్లుదండి సునీత ,వద్దనాల అనిత,రామ సరిత చందా ప్రశాంత్ కాళోజి హేల్త్ యూనివర్సిటీ డిప్యూటీ రిజిస్ట్రార్ పోగు సత్యనారాయణ చందా లలిత పద్మశాలి కులపెద్ద మనుషులు ఆడ్లగట్టా భిక్షపతి ,మార్గం ఎల్లయ్య , మార్గం రాంచేదర్ , గుండు శ్రీనివాస్,చిగురాల కోటేశ్వర్ ,మార్గం సారగం గణపురాపు రమేష్ వేలుదాడి సునీత తదితరులు పాల్గొన్నారు

వరంగల్ అజాంజాహి మిల్ గ్రౌండ్ లో అగ్ని ప్రమాదం

ఘటనాస్థలికి చేరుకుని పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

 

నేటిధాత్రి డేస్క్:అజాంజాహి మిల్ గ్రౌండ్ లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మార్కెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న స్థానిక శాసన సభ్యులు నన్నపునేని నరేందర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ఘటనపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంది హనుమంతుతో ఫోన్ లో మాట్లాడి ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు.. అగ్నిమాపక అధికారులు, సిబ్బందితో మరియు ఎలక్ట్రిక్ సిబ్బందితో ఎమ్మెల్యే మాట్లాడారు.. మంటలు ఎలా వ్యాపించాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.. మంటలు అదుపులోకి వచ్చాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలని,ఏమరపాటు వద్దని ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం అయినందున పూర్తి స్థాయిలో నిర్ధారణ జరిగే వరకు సహాయక చర్యలు కొనసాగించాలని ఎమ్మెల్యే అదికారులకు సూచించారు…స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ అదికారులకు సూచనలు చేసారు..

ఈ సందర్బంగా ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పోరేటర్ సోమిశెట్టి శ్రీలత ప్రవీణ్,నాయకులు,స్థానికులు ఉన్నారు.

కర్ఫ్యూ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు

పోలీస్ కమిషనర్ డా రవీందర్
కరోనా వ్యాప్తిని ఆడ్డుకోవడానికి ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీసు కమిషనర్ విశ్వనాథ్ రవీందర్ హెచ్చరించారు.

గురువారం లాక్ డౌన్ నేపథ్యంలో రాత్రి కర్ఫ్య్ సమయంలో యంజియం పోలీస్ చేకింగ్ పాయింట్ వద్ద అనవసరంగా రోడ్ల మీదకు వస్తున్న వాహనాదారులపై పోలీస్ కమిషనర్ అగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రోడ్ల మీదకు వచ్చిన వాహనాలను తక్షణమే సీజ్ చేసి కేసులను నమోదు చేయాల్సిందిగా కమిషనర్ అధికారులను అధేశించారు.

 

 

ఇండ్లే పేకాట కేంద్రంగా నడుపుతున్న యాజమానులు

మద్యం సేవిస్తూ పేకాట ఆడుతూ ఎంజాయ్

లీడర్లు, ఫైనాన్స్, మద్యం వ్యాపారులదే హవా

ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు

*వరంగల్ సిటి నేటిధాత్రి*

వరంగల్ నగరంలో పేకాట కేంద్రాలు మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తున్నాయి ఇందుకు ఇంటి యజమానులే ఒక సెటప్ ఏర్పాటు చేసుకొని గ్యాంగ్ గా ఏర్పాటై గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్నట్టు సమాచారం అండర్ రైల్వే గేటు ప్రాంతంలో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు నడుపుతున్నారు కరిమాబాద్,ఎస్ ఆర్ ఆర్ తోట గుండుబావులు, జన్మభూమి జంక్షన్ ,నానామియాతోట,చెట్లోల్ల గడ్డ, 60 ఫీట్ల రోడ్డు ప్రాంతంలో ఇండ్లలోనే కేంద్రాలు ఏర్పాటు చేసుకుని వేలకు వేలు నగదు పెట్టి నడుపుతూ పబ్బం గడుపుతున్నారు ఇందులో బడాబాబుల చేతులు కూడా ఉన్నట్టు సమాచారం పోలీసులు దాడులు చేసినప్పటికీ ఈ తతంగం మాత్రం కొనసాగుతూనే ఉంది పొలిటికల్ లీడర్లు, ఫైనాన్స్ వ్యాపారులు, మద్యం వ్యాపారులు, దండిగా డబ్బులు పోసి ఆడుతూ కాలం వెల్లదీస్తున్నారు ఇంట్లోనే ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని పేకాట తో పాటు మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కరోనా నేపథ్యంలో పోలీస్ సిబ్బంది లాక్ డౌన్ అతిక్రమించకుండా కట్టడి చేస్తుంటే గుంపులుగా చేరి మద్యం సేవిస్తూ పేకాట ఆడటం పై చుట్టు పక్కల ప్రాంతాల వాసులు తప్పు పడుతున్నారు ఇలా పేకాట ఆడుతూ మనస్పర్థలు పెంచుకుంటూ శత్రుత్వం తో గొడవలకు దారి తీస్తున్నట్టు తెలుస్తుంది అసలే కరిమాబాద్ సిరంగిరాజారామ్ తోట ప్రాంతాల్లో గత కొన్ని రోజుల నుండి ఆకతాయిలు హాల్ చేస్తూ రోడ్ల పై నిలిచి ఉన్న కారు ద్విచక్రవాహనాలను ధ్వంసం చేశారు మరో సంఘటనలో కర్రలతో కత్తులతో దాడులు చేసుకున్న ఘటనలు ఉన్నాయి ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పేకాట కేంద్రాలను నడిపిస్తూ శత్రుత్వాలు పెంచుకుంటున్నారు అని చెప్పొచ్చు ఏది ఏమైనప్పటికి లాక్ డౌన్ నేపథ్యంలో రోడ్లపై కారణాలు లేకుండా తిరిగే వారిని ఇటు సాయంత్రం 7 గంటల తరువాత కర్ఫ్యూ నేపథ్యంలో తెరచి ఉన్న దుకాణాలను నివారిస్తూ విచ్చల విడిగా తిరిగే గ్యాంగులను కట్టడి చేస్తున్న పోలీసులకు ఇది ఒక సవాల్ గా మారింది ఏది ఏమైనప్పటికి ఇలాంటి సంఘటనలను ఛేదించటంలో మిల్స్ కాలనీ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పేకాట నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోటానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్టు సమాచారం

నిబంధనలు పాటించలేదని పెండ్లి పెద్దలపై కేసు నమోదు

బుగ్గారం, (నేటి ధాత్రి):

కరోనా నిబంధనలు పాటించలేదని,పెళ్ళికి 20 మందికి మించి హాజరయ్యారని వధూవరుల తండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి కథనం ప్రకారం పూర్తి వివరాల్లోకి వెళితే….. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని కొత్త ఎస్సీ కాలనీలో బుధవారం వివాహం జరిగింది. అట్టి వివాహానికి అధికారుల అనుమతి ప్రకారం 20మంది మాత్రమే హాజరు కావాలి. కాని పెండ్లికి 20మందికి మించి హాజరయ్యారని, భౌతిక దూరం పాటించలేదని, మాస్కులు ధరించలేదని స్థానిక విఆర్వో గోపాల్ పోలీసులకు పిర్యాదు చేశారు. అతని పిర్యాదు మేరకు బుగ్గారం ఎస్సై మంద చిరంజీవి వివాహం నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

 

ఎక్కడా కూడా జనాలు మాస్కులు లేకుండా ఉండకూడదని, భౌతిక దూరం తప్పకుండా పాటించాలని, అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని ఎస్సై హెచ్చరించారు. ప్రతి వివాహానికి 20మందికి మించి అనుమతి లేదని, అది కూడా భౌతిక దూరం పాటిస్తూ, ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరి ధరించాలని ఎస్సై చిరంజీవి తెలిపారు. మహారాష్ర్ట, ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరూ 28 రోజులు హోమ్ క్వారెంటైన్ పాటించాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరంగా, కోవిడ్ -19 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్సై చిరంజీవి హెచ్చరించారు.

బీదలను ఆదుకునేందుకు ముందుకు రావాలి

రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ సుధారాణి

వరంగల్ అర్బన్,నేటిధాత్రి: ప్రస్తుత లాక్ డౌన్ వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్ 24 వ డివిజన్లోని 70 పేద కుటుంబాలకు ది వరంగల్ ఐరన్ మరియు హార్డ్ వేర్ మర్చంట్స్ అసోసియేషన్ ఆద్వర్యములో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్పర్సన్, మాజీ పార్లమెంటు సభ్యురాలు గుండు సుధారాణి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు కోడం రాజేందర్, ప్రధానకార్యదర్శి గుల్లపెల్లి రాజ్ కుమార్, ముఖ్యసలహాదారులు వెయ్యిగండ్ల రమేశ్ మరియు అసోసియేషన్ ప్రతినిధులు, TRS పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమాధుల స్థలం కబ్జా గృహ నిర్మాణం, నివాసం

ధారాదత్తం చేసిన భూములు కబ్జా

సమాధుల స్మశాన వాటిక గా వాడకం

సమాధులపై ఇంటిని నిర్మించుకున్న *బాలాజీ* నివాసం..

పిర్యాదు చేసినా పట్టింపులేని అధికారులు

మా స్థలాన్ని మాకివ్వండి *గట్టు* పట్టుదల

 

వరంగల్ సిటి నేటిధాత్రి

అదొక సమాధులు నిర్మాణం చేసుకున్న స్థలం పవిత్రంగా భావించే ఆ స్థలంలో సమాధులు నిర్మించుకొని ఆలయంగా భావించే సమాధుల పై ఓ ఘనుడు కన్నేసి ఏకంగా గృహ నిర్మాణమే చేపట్టాడు వివరాల్లోకి వెలితే గత 70 సంవత్సరాల క్రితం ఇపుడున్న 21 వ డివిజన్ కరిమాబాద్ నానామియా తోటలోని (దాదాబాయి బావి) ప్రాంతంలో తుల్జాబాయి వంశస్తులు కొందరు నిరుపేదలకు వారి భూమిని ధారాదత్తం గా అనుభవించటానికి ఇస్తారు అందులో కొంత మంది గృహ నిర్మాణాలు చేసుకొని నివాసం ఉంటున్నారు అదే విధంగా గట్టు (గౌడ) వంశస్తులకు కేటాయించిన 400 గజాల స్థలంలో గత 70 సంవత్సరాల క్రితం గట్టు వంశస్తుడైన గట్టు రామస్వామికి ఆ స్థలాన్ని కేటాయించి అట్టి స్థలాన్ని గట్టు వంశస్తులు మాత్రమే అనుభవింవించాలని మాట తీసుకుంటారు కొన్ని సంవత్సరాల తరువాత గట్టు రామస్వామి అనే వ్యక్తి మరణిస్తే వారి మృతదేహాన్ని తుల్జాబాయి పెద్దలు కేటాయించిన 400 గజాల స్థలంలోనే సమాధి ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చి అందులో నిర్మించి గట్టు వంశస్తులు ఆ స్థలాన్ని కేవలం గట్టు (గౌడ) వంశస్తుల సమాధులు నిర్మించికోటానికి ఉపయోగించుకునే విధంగా నిర్ణయానికి వస్తారు నాటి నుండి నేటి వరకు దాదాపు 16 మంది రామస్వామి, నారాయణ, సాయన్న, రాజమౌళి, రంగం, వెంకటాచలం, లింగమూర్తి, తిరుపతయ్య, శ్రీనివాస్ ఇలా గట్టు వంశస్తుల సమాధులు అందులో నిర్మించుకుంటారు ఇలా నిర్మించుకున్న స్థలం పై కన్నేసిన సదరు కబ్జా దారులు ఎలాగోలా స్థలాన్ని సొంతం చేసుకోవాలని దురుద్దేశంతో అధికారులతో చేతులు కలిపి ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని గట్టు వంశస్తులు ఆరోపిస్తున్నారు గతంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా అలా వచ్చి బెదిరించినట్టు చేసి ఆ తరువాత వాళ్ళు ఇచ్చింది పుచ్చుకొని అటు వైపు కన్నెత్తైన చూడలేదని గట్టు వంశస్తులు చెపుతున్నారు.

 

 

*కరిమాబాద్ లో పేరున్న వ్యక్తులు*

అధికారుల కన్నుగప్పి సమాధుల పై ఇంటిని నిర్మించుకున్న వ్యక్తి పై గతంలో పలు రకాల కేసులు ఉన్నట్టు సమాచారం కరిమాబాద్ లో డాక్యుమెంట్ రైటర్లు గా పేరున్న వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు గట్టు(గౌడ) వంశస్తులు ఆరోపిస్తున్నారు అయినా సమాధులపై ఇంటి నిర్మాణం చేపట్టి ఎలా నివాసం ఉంటారని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు

*పట్టించుకోని అధికారులు*

ప్రస్తుతం తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గతంలో మేయర్ గా ఉన్న తరుణంలో పిర్యాదు చేయటం తో అధికారులను పురమాయించి అట్టి విషయం పై దృష్టి సారించాలని వారిపై చర్యలు తీసుకోవాలని కోరగా అధికారులు పట్టించుకోక పోవటం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎటువంటి చర్యలు తీసుకోక పోవటం పై గట్టు వంశస్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి వంశ పారంపర్యంగా సమాధులు ఏర్పాటు చేసుకున్నామని సమాధుల స్థలాన్ని ఎవరు కబ్జా చేస్తారులే అనుకున్న మాకు తగు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

*మళ్లీ తెర పైకి వస్తున్న కబ్జాదారులు*

వరంగల్ అండర్ రైల్వేగేటు కరిమాబాద్ ప్రాంతంలో మళ్లీ కబ్జా లకు పాల్పడుతున్న వ్యక్తులు తెరపైకి వస్తున్నట్టు సమాచారం కరోనా కారణంగా లాక్ డౌన్ మూలాన ఈ 40 రోజులు ఎటువంటి అలజడి లేకుండా ఉన్న కబ్జాదారులు మళ్ళీ కబ్జాలకు పాల్పడుతున్నట్టు సమాచారం స్థలం ఖాళీగా కనపడితే చాలు ఆ స్థలం ఎవరిది ఎక్కడ నుండి వారు కొనుగోలు చేశారు అసలు కొన్నారా లేక ధారాదత్తం గా వచ్చిందా అనే వివరాలు సేకరించి అందుకు సంబందించిన పత్రాలు సృష్టించి అమ్మకాలు జరుపుతూ నిర్మాణాలు సాగిస్తున్నారు ఇటువంటి వారి పై దృష్టి సారించి చట్టపరమైన చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు

ఎర్రబెల్లి సొంత గ్రామంలో ధాన్యం తగులబెట్టిన రైతులు

కొనుగోలులో జాప్యం,కాంటాలో అక్రమాలే కారణం

 

వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు వరి ధాన్యాన్ని తగలబెట్టారు. తమ ఇబ్బందులను సంబంధిత ఆఫీసర్లు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల రోజుల నుంచి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 500 మందికి టోకెన్ ఇప్పటికీ 120 మందికి మాత్రమే కాంటాలు నిర్వహించారని ఇక్కడ బస్తా కు నలభై రెండు కేజీలు తూకం నిర్వహించి తామె వాహనాలలో తమకు కేటాయించిన మిల్లు వద్దకు తీసుకెళితే తీరా అక్కడ మిల్లర్లు నలభై నాలుగు కేజీలు ఉంటేనే దిగుమతి చేసుకుంటామని తేల్చి చెబుతున్నారు అని ఆరోపించారు ఈ విషయమై స్థానిక రెవెన్యూ ఆఫీసర్లకు చెప్పిన ఫలితం లేకుండా ఉందని ఆరోపించారు మేము మిల్లర్ల తో మాట్లాడదాం చేస్తాం అని చెబుతున్నారే తప్ప ఏమాత్రం పట్టించుకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ
ధాన్యం తగుల బెట్టి నిరసన వ్యక్తం చేసిన రైతులు,

స్థానిక ఆఫీసర్లు జిల్లా ఆఫీసర్లు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని అని రైతులు దేవేందర్ రావు సుధాకర్ ధరావత్ బాలు ఆడెపు విజయ్ నరిశెట్టి రాజు భానోత్ ఎరుక చింతకుంట్ల రాజు సుమారు 40 మంది రైతులు వేడుకుంటున్నారు

కమర్షియల్ నిర్మాణాల్లో ‘గోల్ మాల్’

*నగరంలో 60 శాతం పైగా అక్రమ కట్టడాలే*
*అనుమతుల్లో జిడబ్ల్యుఎంసి అధికారుల చేతివాటం*
*ప్లానింగ్ కు సంబంధం లేకుండా నిర్మాణాలు*
*అక్రమ కట్టడాల్లో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లే అధికం*
*తిమ్మిని బమ్మి చేసి ప్రభుత్వానికి పంగనామం పెడుతున్న అధికారులు* *కళ్యాణ లక్ష్మి ఘటనలో అదుపులోకి రాని పరిస్థితులు*
*కొనసాగుతున్న అధికారుల ప్రయత్నాలు*

నేటి ధాత్రి డెస్క్:నగరాన్ని అభివృద్ధి చేయడంలో నిధుల ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉంటుందో అధికారుల పనితీరు కూడా అంతకు మించి ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి సార్యమౌతుండి. అధికారులు నిర్వహిస్తు విధులకు ప్రభుత్వం చెల్లిస్తున్న జీతాలను మించి ఆరించి అవినీతికి పాల్పడితే నగరం అభివృద్ధి కాగితాలకే తప్ప ప్రత్యక్షంగా జరగడం అసాధ్యమౌతుంది. ఇదే పరిస్థితి ఇప్పుడు వరంగల్ నగరాన్ని మెంటాడుతుం ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి మొదలుకొని ప్రభుత్వ పెద్దల వరకు. రానున్న రోజుల్లో వరంగల్‌కు పెద్దసంఖ్యలో పరిశ్రమలు అభివృద్ధి సంస్థలు తరలో అమాశం ఉందని గంటాపథంగా చెబుతున్నప్పటికి ఆ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, చర్యలు తీసుకోలేక పోతున్నారు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న కొన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కేవలం అక్రమ మార్గంలో ధనార్జనే లక్ష్యంగా అక్రమాలకు పాల్పడుతూ నగర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు.

 

*నగరంలో 60 శాతం పైగా అక్రమ కట్టడాలు*

గ్రేటర్ వరంగల్ నగరంలో ఇప్పటి వరకు 3 లక్షల పైగా నిర్మాణాలు ఉండగా అందులో 2 లక్షల నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం అయినదని నను ఉత్పల భవిష్యత్తును కాక్షించే కార్పోరేషన్ పెద్దలే చెబుతున్నారు. అంటే నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు జారీ చేసే విషయంలో కీలకంగా పని చేసే అధికారులు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో అర్ధమౌతున్నది. ఈ అక్రమ నిర్మాణాలు నగర అభివృద్ధికి పెను ప్రమాదంగా మారుతున్నాయి. కేవలం తమ స్వార్థ కొరకు అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోకుండా తమ జేబులు నింపుకోవడానికి దిగజారుతున్న అధికారుల వలన వేల కోట్ల రూపాయల ప్రభుత్వం నష్టపోతున్నది. అంతేకాకుండా పన్నుల ఆదాయాన్ని కోల్పోయి నగర అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగక కుంటుపడుతుంది.ఈ విషయం ప్రజలకంటే ప్రజా ప్రతినిధుల కంటే పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న అధికారులే ఈ అక్రమాలకు పాల్పడుతుండడం గమనార్హం

 

*ప్లానింగ్ కు సంబంధం లేని కట్టడాలు*

నగరంలో ప్రధానంగా కమర్షియల్ కట్టడాలకు సంబంధించి ఎలాంటి మునిసిపల్ నిబంధలనలు పాటించకుండా కట్టడాలు జరుగుతున్నారు. కేవలం నిర్మాణానికి సంబంధించిన మరుతలు రావడానికి కాగితాలను ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా తయారు చేయిస్తూ కట్టడాలు మాత్రం యజమానులు తమకు లాభదాయకంగా ఉండే విధంగా నిర్మించుకుంటున్నారు.

*పూర్తి కథనం ఈ రోజు మీ నేటిధాత్రిలో*

 

 

వైద్యం వికటించి పసికందు మృతి

వరంగల్ సిటి నేటిధాత్రి

వరంగల్ సికెఎం ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది గత మూడు రోజుల క్రితం నర్సంపేట మండలం బుదరవుపేట గ్రామం నుండి వరంగల్ ప్రసూతి ఆసుపత్రికి వచ్చిన శ్రీలోజు సరిత అనే మహిళ పండంటి పాపకి జన్మనిస్తుంది సోమవారం పాప కు వైద్యులు టీకా వేశారని దానితో పసికందు నీలిరంగులోకి మారిందని వైద్యులకు చెప్పినా పట్టించుకోకపోవటం తో పాప మరణించిందని సరిత కుటుంబ సభ్యులు వాపోయారు వైద్యుల నిర్లక్ష్యం వల్లనే పసికందు మరణించినట్టు వారు ఆరోపించారు ఈ సంఘటన తో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన బంధువులతో మాట్లాడిన ఇంతేజార్ గంజ్ సిఐ రాయల వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ : నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది.

జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ పి కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.

పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాధితుడిని తరుముతూ కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు.. మృతిచెందిన వ్యక్తి ఎవరు?, అతనిని ఎందుకు చంపారు?, పాత కక్ష్యలు లేక ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారి తీసిందా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.

చైతన్య కార్యక్రమాల్లో జోగినపల్లి మరో ప్రత్యేకత

కరోనా నియంత్రణకు సరికొత్త సందేశం
ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోష్ మరో కార్యక్రమం
హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ మరో వినూత్న ప్రయత్నం చేశారు. ఓ భారీ టేకు ఆకుపై కరోనా నియంత్రణ చిత్రాలను, సందేశాన్ని పెట్టి ప్రచారంలోకి తెచ్చారు.

ఈ కొత్త తరహా ప్రయత్నంలో భాగంగా ఒక టేకు ఆకుపై తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రం, అలాగే తప్పని సరిగా మాస్క్‌ను ధరించండి అనే నినాదాన్ని జత చేశారు.ప్రకృతి సిద్దమైన టేకు ఆకుపై అత్యంత ఆకర్షణీయంగా ఈ సందేశాన్ని తయారు చేయడం దీని ప్రత్యేకత. కోవిడ్‌-19నియంత్రణ కోసం అందరూ కలిసి రావాలని, ముప్పు ఇంకా పొంచి ఉన్నందున ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మాస్క్‌ ధరించడంతో పాటు బయటి కి వెళ్లినప్పుడు భౌతిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు.
ఈ నియంత్ర చర్యల ద్వారానే కరోనాను నివారించగలమని చెప్పారు. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఈ సందేశంతో కూడిన ఫోటోలతో పాటు ఒక వీడియో చిత్రాన్ని కూడా ఆయన తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. సంతోష్‌కుమార్‌ చేసిన ఈ వినూత్న ప్రయత్నం సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యింది

మావోయిస్టు పార్టీ దళ సభ్యుడి లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నేటిధాత్రి: చర్ల మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు పెట్టి అయితు అలియాస్ అయితడు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2014 ఆగస్టు నెలలో భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు పార్టీ దళం సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై దళ కమాండర్ సంతోష్ ఆదేశాల మేరకు దళ సభ్యుడిగా చేరి అజ్ఞాతవాసం లోకి వెళ్లినట్లు తెలిపారు. ఆరోగ్యం సహకరించని కారణంగా తన చిన్నాన్న సహాయంతో పోలీసులకు లొంగి పోయినట్లు ఎస్పీ వెల్లడించారు.

కళ్యాణలక్ష్మిలో చెలరేగుతున్న మంటలు అదుపుచేసేందుకు రంగంలోకి స్కై లిఫ్ట్

వరంగల్ అర్బన్(హన్మకొండ),నేటిధాత్రి:జిల్లాలో ప్రముఖ వస్త్ర దుకాణం కళ్యాణలక్ష్మిలో ఆదివారం మొదలైన అగ్నిప్రమాదం వలన ఏర్పడిన పొగ,మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.ఆదివారమే ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి అగ్నిమాపక సిబ్బంది,గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ కు సంబంధించిన డిఆర్ ఏఫ్ రంగంలోకి దిగి తీవ్రంగా ప్రయత్నించినప్పటికి అగ్నిప్రమాదం చోటుచేసుకున్న నాలుగో ఫ్లోర్ కు వెళ్ళడానికి ఎలాంటి అత్యవసర దారులు గాని లేకపోవడం పొగలు దట్టంగా రావడంతో బిల్డింగ్ పై కప్పుకు రంద్రాలు చేసి అదుపు చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి ఫలితం రాలేదు.దీంతో ఈ రోజు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు హైదరాబాద్ నుండి అగ్నిమాపక శాఖ అధికారులు స్కై లిఫ్ట్ రప్పించి ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ప్రమాదం సంభవించి రోజు గడిచిన క్రమంలో మంటలు అన్ని ఫ్లోర్లకు వ్యాపించి దట్టమైన పొగ, అగ్ని ఎగిసిపడుతుంది.

 


 

11కేవి తీగలు తగిలి టాటాఏసి దగ్ధం

 వరంగల్ రూరల్ జిల్లా (రాయపర్తి),నేటిధాత్రి:వరి గడ్డి తరలిస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి వాహనం దగ్ధం అయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం మండలంలోని ఏకే తండాకు చెందిన హలవత్ సుధాకర్ కు చెందిన టాటా ఏసీ వాహనం ను సోమవారం తెల్లవారుజామున హలవత్ వాసు అనే వ్యక్తి వరిగడ్డిని తరలించదానికి కిరాయికి తీసుకొని వెళ్ళాడు.గడ్డిని తీసుకుని పెరికెడు గ్రామం నుంచి కొత్తూరు గ్రామ శివారు చేరుకొనే క్రమంలో 11కేవి విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదవశాత్తు గడ్డితో పాటు టాటా ఏసీ వాహనం దగ్దం అయింది.విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.విద్యుత్ వైర్లు క్రిందకు ఉండడంవల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది అని రైతులు ఆరోపిస్తున్నారు.

error: Content is protected !!
Exit mobile version