సిసి కెమెరాలపై గ్రామస్తులకు అవగాహన

గ్రామ రక్షణకై 40 సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తుల సహకారం

చిట్యాల సిఐ మల్లేష్

మొగుళ్లపల్లి నేటి ధాత్రి :
మండలంలో కమ్యూనిటీ పోలీస్ లో భాగంగా. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై బొరగల అశోక్ ఆధ్వర్యంలో. నేను సైతం సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమంపై అవగాహన సదస్సును గ్రామస్తులకు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధిగా చిట్యాల సీఐ మల్లేష్ పాల్గొని మాట్లాడుతూ. నేనుసైతం సీసీ కెమెరాల ఏర్పాటు అవగాహన కార్యక్రమానికి గ్రామస్తులు రావడం ఆనందంగా ఉందని, మన గ్రామంలో ఎలాంటి నేరాలు జరుగకుండా ఉండేందుకు గాను సిసి కెమెరాల ఏర్పాటు ఎంతగానో దోహదపడుతుందని, నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం కాబట్టి, గ్రామంలో సీసీ కెమెరా ఏర్పాటు చేశామంటే నేరలను నిరోదించినట్టేనని 24/7 సీసీ కెమెరాలు వాటిపని నిర్వర్తిస్తూనే ఉంటాయని. నేరం చేసిన వారిని తక్కువ సమయంలో గుర్తించి నేరస్తున్ని పట్టుకోవడంలో సీసీ కెమెరాల పనితిరు అమోగమని. మొగుళ్లపల్లి గ్రామానికి నిఘా నేత్రాలను ఏర్పాటు చేసేందుకు మీ అందరి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని గ్రామస్తులకు సూచించారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ. కట్టుదిట్టమైన భద్రత సీసీ కెమెరాల ద్వారానే అని అవగాహన సదస్సులో సీఐ మాటల ద్వారా గ్రహించిన గ్రామస్తులు, 40 సీసీ కెమెరాలు గ్రామ రక్షణకు ఏర్పాటు చేసేందుకు మేము సైతం సహాయం అందిస్తామని చిట్యాల సీఐ మల్లేశ్, మొగుళ్లపల్లి ఎస్సై బి అశోక్ కు గ్రామస్తులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో. పిఏసిఎస్ చైర్మన్. సంపెల్లి నర్సింగారావు, మాజీ సర్పంచ్ మోటె ధర్మారావు, ఏలేటి శివారెడ్డి, నడిగోటి రాము, క్యాతరాజు రమేష్, మహ్మద్ రఫీ, ఏలేటి ప్రభురెడ్డి వ్యాపారస్థులు, వాహన యూనియన్ నాయకులు, వివిధ రంగాలలో పనిచేస్తున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు

నిజాంపేట: నేటి ధాత్రి

నిజాంపేట మండల కేంద్రము లో గురువారం రోజున ముస్లిం మైనార్టీ కమిటీ సోదరులంతా కలిసి ఈద్ మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మిలాద్ ఉన్ నబీ పండగ జరుపుకుంటామని మండల మైనారిటీ సభ్యులు మహమ్మద్ అజ్గార్ అన్నారు. మసీద్ లో భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసి ముస్లిం సోదరులంతా మండల కేంద్రము లో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మసీదు ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంత కరుణామయుడైన అల్లాహ్ సర్వమానవాళి శ్రేయస్సు కొరకు శాంతిని నెలకోల్పవడం కోసం ఆఖరి ప్రవక్త మహమ్మద్ ను ఎన్నుకున్నట్లు అంతిమ(దైవ గ్రంథం)పవిత్ర ఖురాన్ లో చెప్పబడిందని పేర్కొన్నారు.
మహమ్మద్ ప్రవక్త చూపిన అడుగుజాడల్లో ప్రతి ముస్లిం సోదరులు నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మమ్మద్ గౌస్, షాదుల్,అబ్దుల్ షాషా,ఫిరోజ్,షబ్బీర్,షానవాజ్, యువకులు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మున్నురుకాపుల ఐక్యత వర్ధిల్లాలి


ములుగులో అక్టోబర్ 26న మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మీటింగ్
Date 19/09/2024


—————————————-
మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశం అక్టోబర్ 26వతేదీన ములుగు (గజ్వేల్) మల్లక్కపేటలోని వీపీజే ఫంక్షన్ హాలులో జరుగుతుంది

మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ జిల్లా బాధ్యులు, జిల్లా అధ్యక్షులు గురువారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది

హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని రాజ్యసభ సభ్యులు,సంఘం గౌరవాధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో గురువారం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తమ రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా, కౌన్సిల్ సభ్యులు వీరమళ్ల ప్రకాష్,సీ.విఠల్,మీసాల చంద్రయ్య ఎర్రా నాగేంద్ర బాబు తదితర ప్రముఖులు హాజరయ్యారు

ఈ సందర్భంగా సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు

మున్నూరుకాపు ప్రముఖుల సమక్షంలో సంఘం రాజ్యాంగం మాదిరిగా రూపొందించుకున్న నియమావళి (బైలా)ని అనుసరించి క్రమశిక్షణ, అంకితభావంతో ముందుకు సాగుదామని… రాజకీయాలకు అతీతంగా మున్నూరుకాపులందరం మరింత ఐకమత్యతను చాటి చెప్పాలని సమావేశం నిర్ణయించింది

కాగా,సంఘం సంస్థాగత ఎన్నికలు వచ్చే ఏడాది మే మాసంలో ఉన్నందున,దాని కంటే ముందు వచ్చే నెల అక్టోబర్ 26న ములుగు (గజ్వేల్)లో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది

దీనిని దిగ్విజయం చేసేందుకు గాను జిల్లా బాధ్యులను అపెక్స్ కౌన్సిల్ నియమించి, ఇందుకు సంబంధించిన పత్రాలను వారికి అందజేసింది

బాధ్యులుగా నియమితులైన వాళ్లు ఆ యా జిల్లాలలో క్షేత్ర స్థాయిలో విస్త్రతంగా పర్యటించాల్సి ఉంటుంది

సంఘం జిల్లా కార్యవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాల,మండల కో-ఆర్డినేటర్ లేదా మండల శాఖల అధ్యక్షులు, కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ మున్నూరుకాపు కులానికి చెందిన ఏంపీలు, ఏమ్మెల్సీలు,ఏమ్మెల్యేలు,మాజీ ఏంపీలు,మాజీ ఏమ్మెల్సీలు,మాజీ ఏమ్మెల్యేలు, స్థానిక మాజీ ప్రజాప్రతినిధులందరూ ములుగులో జరిగే స్టేట్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే విధంగా ముందుకు సాగాలని బాధ్యులుగా నియమితులైన వారికి అపెక్స్ కౌన్సిల్ పలు సూచనలు చేసింది,సలహాలిచ్చింది

స్టేట్ కౌన్సిల్ మీటింగులో అపెక్స్ కౌన్సిల్ కు సేవలందించిన గంగుల కమలాకర్,అపెక్స్ కౌన్సిల్ గౌరవ ఛైర్మన్ గా నియమితులైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా నియమితులైన వద్దిరాజు రవిచంద్రలతో పాటు ఎంపీలు, ఏమ్మెల్సీలు, ఏమ్మెల్యేలను సన్మానిస్తారు

అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సంఘం ప్రముఖులు బత్తుల సిద్ధేశ్వర్,ఆకుల గాంధీ,చల్లా హరిశంకర్, జుట్టు అశోక్,కూసం శ్రీనివాస్,కొత్తా లక్ష్మణ్,ఆవుల రామారావు,పుట్ట కిషోర్, గాజుల మహేందర్ ,వాసుదేవుల వెంకటేశ్వర్లు,బండి పద్మ,ఆర్వీ మహేందర్, వేల్పుల శ్రీనివాస్,ఉప్పు రవీందర్,పర్వతం సతీష్ తదితరులు పాల్గొన్నారు

పెండింగ్ డిఏ లను విడుదల చేయాలి

317 జిఓ ను రద్దు చేయాలి

పరకాల నేటిధాత్రి
20 సెప్టెంబర్ రోజున జరుగబోయే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పెండింగ్ డిఏ లను విడుదల చేయాలని,317 జిఓను రద్దు చేయాలని సీపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ విధానాన్ని కొనసాగించాలని దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఓపిఎస్ విధానాన్ని కొనసాగిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని తెలంగాణ రాష్ట్రంలో కూడా సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని కొనసాగించాలని తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టిఈఏ) హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు నవీన్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు.

స్వశక్తి మహిళలకు కోడిపిల్లలు పంపిణీ

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం లోని స్వశక్తి మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడీ చెప్పినట్టు మహిళలకు ఇందిరా మహిళా శక్తి లో భాగంగా కోడిపిల్ల లను సభ్యులకు బ్యాంక్ లింకేజీ,స్త్రీనిది ఋణం,గ్రామ సంఘo నుండి, సంఘము అప్పు ల ద్వారా పెరటి కోల్లు కోడిపిల్ల లను పెంచడానికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఏపిఎం లతా మంగేశ్వరి,సీసీ లు మారెళ్ళ శ్రీనివాస్,మల్లయ్య,కొమురయ్య,విజయ,రాజకుమారి అకౌంటెంట్ భవాని ఆపరేటర్ పవన్ కుమార్,విఓఏ లు,మహిళలు పాల్గొన్నారు.

మహిళా చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం పట్టణ ఎస్సై విజయలక్ష్మి

సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాగిన మహిళా సంఘం ర్యాలీ
మహిళల కోసం ఏర్పడ్డ చట్టాలను అధ్యయనం చేసి సద్వినియోగం చేసుకోవాలని పట్టణ ఎస్సై విజయలక్ష్మి కోరారు. ఐద్వా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడో మహాసభ సందర్భంగా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ప్రదర్శన ర్యాలీని ఎస్సై విజయలక్ష్మి ప్రారంభించగా ర్యాలీ అగ్రభాగాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఉపాధ్యక్షురాలు బుగ్గ వీటి సరళతో పాటు జిల్లా ప్రధాన నాయకత్వం నిలిచిన ఈ ర్యాలీని ప్రారంభిస్తూ పట్టణ ఎస్ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలందరూ ఐక్యంగా తమ హక్కుల కోసం నినదించటం అభినందనీయమని అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్నిట్లో సమానంగా నిలుస్తున్నారని అదే ఈ దేశ అభివృద్ధికి మూలమని అభిప్రాయపడ్డారు. మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖలో అనేక విభాగాలను ఏర్పాటు చేయడం జరిగిందని షీ టీమ్ లతో పాటు సఖి సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళల రక్షణ కోసం 24 గంటల పాటు పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. మహాసభల సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీలో ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ రేలా నృత్యంతో పాటు కోలాటాలు నిర్వహిస్తూ హక్కుల కోసం నినదిస్తూ పట్టణంలో పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సభను నిర్వహించారు.

జమిలి ఎన్నికల విధానాన్నికేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు: సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి:
జమిలీ ఎన్నికల విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం సరైన విధానం కాదు అని సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిఅన్నారు. గట్టుప్పల మండల కేంద్రంలో గట్టుపల టౌన్ శాఖ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,2029 నుంచి ఒకే దేశం- ఓకే ఎన్నిక విధానాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో ప్రవేశపెట్టడం ఫెడరల్ స్ఫూర్తికివిరుద్ధమన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలి ఎన్నికల పద్ధతి అనుకూలం కాదు అని చెప్తు వస్తున్నప్పటికీ బిజెపి ప్రభుత్వం . మొండిగా వ్వహరిస్తుందని ఆయన విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని, వాళ్ల ప్రయోజనాల కోసం పాటుపడుతున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటికరన చేయడానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. గత ఎన్నికల ముందు బిజెపి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాననిహామీ ఇచ్చి,హామీని తుంగలో తొక్కారన్నారు. రానున్న రోజుల్లో బిజెపిని గెలవకుండా అందరము శాయశక్తుల కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో బిజెపి ప్రభుత్వం రాముడు పేరుతో రాజకీయం చేస్తున్నారనిఆయన అన్నారు..గత ఎన్నికల ముందుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుప్రజలకు ఇచ్చినహామీలనువెంటనే అమలు చేయాలన్నారు.ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం6 గ్యారంటీలనుఅమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంఇచ్చిన హామీలలోరైతు భరోసా,రుణమాఫీకొంతమంది మాత్రమే రుణమాఫీ చేశారని, మిగిలిన రైతులందరికీ కూడారుణమాఫీని వర్తింపజేయాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ దేశంలోబిజెపి అనుసరిస్తున్నప్రజా వ్యతిరేక విధానాల ను తిప్పి కొట్టాలని అయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోసిపిఎంజిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, సిపిఎం గట్టుపల్ మండల కార్యదర్శి కర్నాటి మల్లేశం, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులుచాపల మారయ్య.సిపిఎం సీనియర్ నాయకులు ఎండి. రబ్బాని,సిపిఎం మండల కమిటీ సభ్యులుకర్నాటి సుధాకర్,కర్నాటి వెంకటేశం,కుకునూరు నగేష్,సిపిఎం నాయకులుఖమ్మం రాములు,పెదగాని నరసింహ,ముసుకు బుచ్చిరెడ్డి,నల్లవెల్లి బిక్షం,పసుపుల చెన్నయ్య,కె. నరసింహ, జ్ఞానేశ్వరి, ఉష, రాములమ్మ, అంశమ్మ, సావిత్రమ్మ, యాదమ్మ, లక్ష్మమ్మతదితరులు పాల్గొన్నారు. అనంతరం గట్టుపల్ టౌన్ శాఖ కార్యదర్శిగాకర్నాటి సుధాకర్,కర్నాటి వెంకటేశం, పెద్దగాని నరసింహ ఏకగ్రీవంగాఎన్నికయ్యారు.

గల్ఫ్ కార్మికుల ఆత్మ బంధువుకు సన్మానం 

ప్రెస్ నోట్: 

తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సెల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ శ్ఇ. చిట్టి బాబును బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్  వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం సెక్రెటేరియట్ లోని మంత్రి కార్యాలయంలో సన్మానించారు. 

టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి, గల్ఫ్ జెఏసి నాయకులు చెన్నమనేని శ్రీనివాస రావు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

బీఆర్ఎస్ ఉనికి కోసం ప్రాకులాడుతున్న మాజీ ఎమ్మెల్యే

తప్పు చేస్తున్న వాళ్లను సమర్థించడం సిగ్గుచేటు

అధికార బలంతో ఎంతో వేధించారు

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట, నేటిధాత్రి:

బీఆర్ఎస్ పార్టీలో రాజకీయం గా తన ఉనికిని చాటుకోవ డానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి పాకు లాడుతున్నారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఎద్దేవా చేశారు. మండలంలోని ప్రగతింగారంలో ఇటీవల గణేశుడి శోభాయాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య జరిగిన ఘర్షణపై బుధవారం హనుమకొండలో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రంలో నిరసన తెలిపారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ నిమజ్జనంలో జరిగిన చిన్న ఘటనను రాద్ధాంతం చేసి, గొడవలు సృష్టించారని, దీనిపై పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారని అన్నారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో పనిచేస్తే కాంగ్రెస్ నాయకుల పై కేసులు ఎందుకు నమోదు అవుతాయో గుర్తించాలని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉండగా మైలారం గ్రామంలో గ్రామ పంచాయతీలో వినాయకుడిని ప్రతిష్టిస్తే అధికార బలంతో పోలీసులతో లాఠీచార్జి చేయించి, నవరాత్రులు పూర్తికాకుండానే నిమజ్జనం చేయించి, పోలీసులు మిమ్మల్ని సంతృప్తిపరిచారా అని ప్రశ్నించారు. మండలంలో దళిత బంధు పథకం ఇప్పిస్తామని దళితుల వద్ద తాజా మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి లక్షల్లో వసూళ్లకు పాల్పడ్డాడని, ఈ క్రమంలో ఓ దళితుడి వద్ద లక్ష తీసుకొని అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీపీని సమర్థిస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. మాజీ ఎంపీపీ పెద్దకోడేపాక, ప్రగతి సింగారం, కొత్తగట్టు సింగారం గ్రామాలలో పనులు చేయకుండా ఇంజనీరింగ్ అధికారులను బెదిరించి అవినీతికి పాల్పడ్డాడని, ఎంపీటీసీలు అప్పటి జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డికి ఫిర్యాదు చేస్తే తప్పు చేయని వారు ఎవరు ఉన్నారు అని వ్యాఖ్యానించిన మీరు నేడు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, పోలీసులపై నిందలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్, మాజీ చైర్మన్ పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, నాయకులు చిందం రవి, వైనాల కుమారస్వామి, బోనపల్లి రఘుపతి రెడ్డి, దుబాసి కృష్ణమూర్తి, నిమ్మల రమేష్, వైద్యుల వెంకటరాజు రెడ్డి, శానం కుమారస్వామి, చిట్టి రెడ్డి జంగారెడ్డి, నిమ్మల రమేష్, మోరే శ్రీను, కందగట్ల రవి, లడే రాజ్ కుమార్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

మనఇంటి పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకుందాం

గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్

మొగుళ్లపల్లి నేటి ధాత్రిన్యూస్
స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా. స్వచ్ఛ గ్రామలే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీ సేవ తడి చెత్త -పొడి చెత్త నిర్వహణపై గ్రామ పంచాయతీ కార్యదర్శి నరేష్ మొగుళ్లపల్లి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జిపి సెక్రెటరీ నరేష్ మాట్లాడుతూ. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో. నాయకులు, విద్యార్థులు, అధికారులు, గ్రామస్తులు అందరూ భాగస్వాములు కావాలని మన ఇంటి పరిసరాలను, వీదులను మనమే శుభ్రంగా ఉంచుకుందామని ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించుకునేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో ఏలేటి మధుకర్ రెడ్డి,ఎలకంటి రమేష్,దొమ్మటి కుమార్,తిప్పారపు బుచ్చారావు, సూర్నేని మణికర్ మదవి,మహిళా సంఘం సభ్యురాళ్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి లో వినాయకుడి నిమజ్జనానికి అయ్యగారి ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి పట్టణ బిజెపి అధ్యక్షు లు బచ్చు రాం సాయి రాజు మనీ కాలనీవాసులు తాడిపర్తి శ్రీను పాల్గొన్నారు

విద్యుత్ శాఖ పై రైతులకు అవగాహన సదస్సు

ఏడిఈ శ్రీనివాస్ యాదవ్

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్ర విద్యుత్ శాఖ సిఎండి వరుణ్ రెడ్డి ప్రవేశ పెట్టిన పొలం బాట ప్రోగ్రాం ను భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి లోని కాసిం పల్లె గ్రామం చల్లూరి పల్లి శివారు లో భూపాలపల్లి ఏడిఈ శ్రీనివాసు యాదవ్ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా రెండు 100 కెవిఏ ట్రాన్స్ఫార్మర్ లకి చెడిపోయిన AB SWITCH, HG FUSE SET అండ్ LT FUSE SET లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది వదులుగా ఉన్న లైన్ లో 9 మధ్య స్థంబాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడిఈ శ్రీనివాసు యాదవ్ మాట్లాడుతూ రైతుల సమస్యల పై ఆరా తియ్యడం జరిగింది. అలాగే విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్త లపై అవగాహన కల్పించడం జరిగింది. విద్యుత్ మోటర్లకు కెపాసిటర్ పెట్టుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను రైతుల కు వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏడిఈ శ్రీనివాసు యాదవ్, భూపాలపల్లి టౌన్ సబ్ ఇంజనీర్ రణధీర్, కాసింపల్లె లైన్ మెన్ బాబా సాదిక్ హైదర్, కాశింపల్లె జెఎల్ ఎం హరిచంద్ర రైతులు రాయ కొమురు కొత్త సతీష్, దుర్గం మల్లయ్య, సుంకరి ఓదెలు, కొత్త చంద్రయ్య, నలిగేటి సతీష్, కొత్త మల్లయ్య, చిత్తరి చంద్రయ్య , చిత్తారి తారయ్య మరియు బౌత్ లింగయ్య పాల్గొన్నారు.

ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి

తొర్రూర్ ( డివిజన్) నేటి ధాత్రి:

లింగ నిర్ధారణ చేయకూడదు

తొర్రూరు పట్టణం లోని స్కానింగ్ సెంటర్లు ఆసుపత్రు లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని మాతా శిశు సంక్షేమ ప్రోగ్రాం అధికారి డాక్టర్ సారంగం అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు గురువారం పట్టణంలో ఆక స్మిక తనిఖీలు నిర్వహిం చామన్నారు. అనంతరం అయ న మాట్లాడు తూ ఆసుపత్రికి వచ్చిన వారి వివరాలు, స్కా నింగ్ నిర్వహించిన వారి వివ రాలు, పూర్తి ఇంటి పేరు, ఇంటి నేo, చిరునామా, ఖచ్చి తంగా నమోదు చేయాలన్నా రు.అ లాగే ప్రైవేట్ ఆసుపత్రుల వారు అందించే సేవలకు తీసు కునే రుసుమును ధరల పట్టిక రూపం లో అందరికీ కనిపించే విధముగా ఆసుపత్రి ఆవరణ లో ప్రదర్శించాలన్నారు.16 ఫామ్ –ఎఫ్ రికార్డులు సక్రమం గా ఉండాలని,ప్రతి నెల 5 వ తేదీ లోపల జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంకు ఖచ్చితం గా పంపించాలని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిలో లింగ నిర్ధారణ చేయకూడదని, ఎం‌టి‌పి నియమాలకు వ్యతి రేకంగా అబార్ష న్ లు చేయ కూడదని అలాగే సాధారణ ప్రసవాల రేటు పెంచాలన్నారు. ఆసుపత్రు లలో పిల్లల మరణా లు, మాతృ మరణాలు సంభ వించి నట్లైతే వివరాలను కార్యాలయంలో అందించాల న్నారు. ఆసుపత్రికి వచ్చిన వారికి సాదారణ ప్రసవం గూర్చి ముందు నుండే సలహాలు, కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఈ తనిఖీ లో ప్రోగ్రాం అధికారి డాక్ట ర్ సారంగం, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్ ప్రసా ద్, అరుణ్ లు పాల్గొన్నారు

స్థానికులకే ఉపాధి అవకాశాలు దక్కేలా చూడండి

ఎమ్మెల్యేకు కారల్ మార్క్స్ నగర్ వాసుల విజ్ఞప్తి

కాశిబుగ్గ నేటిధాత్రి

గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని కారల్ మార్క్స్ నగర్ సమీపంలో నిర్మిస్తున్న ఆదిత్య కోల్డ్ స్టోరేజ్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలు కలిగేలా చూడాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కారల్ మర్క్స్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాంగరపు బాబు ఆధ్వర్యంలో కాలనీవాసులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీవాసులకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళుతున్నారని కాబట్టి తమ కాలనీ పక్కన నిర్మిస్తున్న ఆదిత్య కోల్డ్ స్టోరేజీలో తమకు అవకాశాలు కల్పించేలా చూడాలని ఎమ్మెల్యేని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరెపల్లి లింగస్వామి, ఎలికట్టె బాబు, ఎస్.కె అఫ్సల్, చుక్క ఏసు, ఎర్ర యాకయ్య, హమాలీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్ లను ఖండించిన మాజీమంత్రి హరీశ్ రావు..

హైదరాబాద్ /నర్సంపేట,నేటిధాత్రి :

వరంగల్ జిల్లా నర్సంపేటలో మెడికల్ కాలేజీ,జిల్లా జనరల్ ఆసుపత్రిని మంత్రులు ప్రారంభిస్తున్నారన్న కారణంతో నర్సంపేట బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో సహా బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలను హౌజ్ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ మంజూరు చేసి జిల్లా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది కేసీఆర్,బిఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఆ ఘనతను తమ ఖతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుటిలయత్నానికి పాల్పడుతున్నదని ఆరోపించారు.ప్రజా పాలన అంటూ ప్రతిపక్ష నాయకులను అరెస్టులు, అష్టదిగ్బంధనాలు చేయడం అప్రజాస్వామికమైన చర్య. హౌజ్ అరెస్ట్ చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సహా, బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు మాజీ మంత్రి,ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు @CongressFailedTelangana అనే ట్విట్టర్ ఎక్స్ ఖాతాకు సందేశం పంపారు.

మాతృశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారుడు రఘుకు ఆర్థిక సహాయం సన్మానం

భూపాలపల్లి నేటిధాత్రి

తెలంగాణ పారా (దివ్యాంగుల ) స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 1న హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జాతీయస్థాయికి ఎంపికైన టేకుమట్ల మండలం అంకుశ పూర్ గ్రామానికి చెందిన సాద రఘు, పలిమెల మండలం ముకునూరు గ్రామానికి చెందిన మట్టి సాగర్, ట్రూ బల్ క్రీడలో జాతీయస్థాయికి ఎంపికయ్యారు వారు ఈనెల 21 నుంచి 23 వరకు జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కావున వారిని మాతృశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలోమాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతల శ్రీనివాస్ మాట్లాడుతూ వీరిద్దరూ జాతీయస్థాయిలో జాతీయ స్థాయి క్రీడలలో ఆడటానికి ఎన్నికైనందుకు అభినందనలు తెలుపుతూ రానున్న రోజులలో యువతకు క్రీడలలో ముందుకు సాగడానికి మార్గదర్శకంగా నిలవాలని కోరుకున్నారు భవిష్యత్తులో పేద క్రీడాకారులకు మాతృశ్రీ ఫౌండేషన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నడికుడ మండలం ఎక్స్ జెడ్పిటిసి కోడెపాక సుమలత కరుణాకర్ మాతృశ్రీ ఫౌండేషన్ ముఖ్య సలహాదారులు ఇనగల రవీందర్ కో ఆర్డినేటర్ దాసారపు వర్ధన్ పాల్గొన్నారు.

ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్చుకోవాలి

జమ్మికుంట: నేటి ధాత్రి
ఆత్మ రక్షణ కోసం విద్యార్థినీ విద్యార్థులు కరాటే నేర్చుకోవాలని జమ్మికుంట పట్టణ సీఐ రవి అన్నారు.ఈ నెల 15 ఆదివారం కరీంనగర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియం లో జరిగిన జాతీయ కరాటే పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభను కనబరిచి బంగారు పతకం సాధించి తెలంగాణ కరాటే అసోసియేషన్ చైర్మన్ వసంత్ కుమార్ చేతుల మీదుగా అందుకున్న సంధర్భంగా గురువారం జమ్మికుంట పట్టణ సీఐ రవి జాతీయ కరాటే పోటీలలో బంగారు పతకం సాధించిన కావ్య మెడలో బంగారు పతకాన్ని వేసి శాలువాతో ఘనంగాసన్మానించారు.ఈ సందర్భంగా పట్టణ సీఐ రవి మాట్లాడుతూనేటి సమాజంలో ఆడపిల్లలను బయటికి పంపించలేని తల్లిదండ్రులు ఉన్నప్పటికీ జమ్మికుంట పట్టణ పరిధిలోని మారుతి నగర్ లో నివాసముంటున్న జన్ను రమేష్ మాత్రం తన బిడ్డ కావ్యను నిర్భయంగా గత 8 నెలలుగా హుజురాబాద్ గ్లోబల్ షోటోకాన్ కరాటే డు ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ మాస్టర్ జలీల్ వద్ద ప్రత్యేక కరాటే శిక్షణ ఇప్పించడం అభినందనీయం అని కొనియాడారు.
కావ్య జాతీయ కరాటే పోటీలలోనే కాకుండా అంతర్ జాతీయ పోటీలలో పతకాలు తెరుకువచ్చి దేశం గర్వ పడే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు.అదేవిధంగా విద్యార్థినీ, విద్యార్థులు.
యువతి యువకులు ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా తమ తల్లిదడ్రులు ఎంతో నమ్మకంతో స్కూల్స్, కాలేజీలకు పంపుతున్నప్పటికి కొంత మంది పిల్లలు జల్సాలు అలవాటు పడి వారి బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని ఆన్నారు..
చదువుతో పాటు క్రమశిక్షణతో కూడిన స్పోర్ట్స్, గేమ్స్, కరాటే లాంటి నేర్చుకొనిజిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీలలో పాల్గొని తమ తల్లదండ్రులకే కాకుండా ప్రాంతానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.అనంతరం కరాటే మాస్టర్ జలీల్ కావ్య తండ్రి జన్ను రమేష్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అంబాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం

మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్

జమ్మికుంట: నేటి ధాత్రి
జమ్మికుంట మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహిత సమాజంగా నిర్మింద్దామని మున్సిపల్ కమీషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. గురువారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని నాయిని చెరువు పరిసర ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ యండి ఆయాజ్ ఆధ్యర్యంలో ఇటీవల జరిగినటువంటి గణపతి నిమజ్జనం పరిసర ప్రాంతాలలో పరవేయబడినటువంటి ప్లాస్టిక్ మరియు ఇతర చెత్త, చెదారం కమీషనర్ అయాజ్ తో పాటు మున్సిపల్ సిబ్బంది నాయిని చెరువు లో చెత్త తొలగించారు. ప్లాస్టిక్ కవర్లు,పువ్వుల దండలు, కొబ్బరి చిప్పలు మరియు ఇతర చెత్తను తొలగించడంజరిగింది.మున్సిపల్ కమిషనర్ యండి ఆయాజ్ మాట్లాడుతూ నాయిని చెరువు బహిరంగ ప్రదేశాలలో మాల మూత్ర విసర్జన చేసినట్లయితే జరిమానాతో చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుందని అయన తెలిపారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు మట్టిలో కలిసిపోవని ఎప్పటికి బయటే ఉంటాయని అయన అన్నారు. కూరగాయలు, కిరాణ సామాన్లు కొనేటప్పుడు జ్యూట్ బ్యాగ్ లను వాడాలని అయన మున్సిపాలిటీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులతో పాటు పట్టణ ప్రజలు పలువురు పాల్గొన్నారు.

ఆదివాసి మహిళ పై అత్యాచారం హత్యాయత్నం కు పాల్పడిన దుండగుని వెంటనే ఉరితీయాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
ఆదివాసి సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు పత్రిక విలేకరులతో మాట్లాడుతూ
జైనూరులో ఆదివాసి మహిళపై అత్యాచారం హత్యాయత్నానికి పాల్పడిన మూర్ఖుడు దుండగుని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారించి 20,30 రోజుల్లో ఉరితియాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు.
జైనురు ఘటనలో ఆదివాసీలపై ఎదురుదాడి చేసిన మైనార్టీ ముస్లింలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మరియు హత్యాయత్నం కేసులు పెట్టాలన్నారు.
ఆదివాసి మహిళను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఖర్చులతో కార్పొరేట్ వైద్యాన్ని అందించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు అన్నారు.

అమ్మ కోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి- డాక్టర్ నవత

నేటి ధాత్రి మొగుళ్ళపల్లి
రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీల కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అమ్మ కోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారిణి డాక్టర్ నవత సూచించారు. అమ్మ కోసం కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె గర్భిణీ స్త్రీలతో పాటు ఓపి పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మెడిసిన్స్ అందజేశారు. అనంతరం ఆమె గర్భిణీ స్త్రీలనుద్దేశించి మాట్లాడారు. స్త్రీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి గురువారం గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మెడిసిన్స్ అందజేయడం జరుగుతుందన్నారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలకు పలు సూచనలు చేసి మెడిసిన్స్ అందజేయడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

error: Content is protected !!
Exit mobile version