ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా నేటిధాత్రి 07:
భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేసిన
జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆర్గనైజషర్, సభ్యులు
దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ పరిధిలోని ఎంఆర్ఆర్ కాలనీ లో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జై దుర్గా భవాని యూత్ అసోసియేషన్ ఆర్గనైజర్ విజయ్ కుమార్, సభ్యులు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన దుర్గామాత అమ్మవారి పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ దన్ పాల్ రెడ్డి, పలు కాలనీల పెద్దలు, సభ్యులు, మహిళలు పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు. అనంతరం భారీగా అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు నేమూరు మహేష్ గౌడ్, నాయకులు, జై దుర్గ భవాని యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.