బహుజనుల బిడ్డను కాపాడుకుందాం
మొగులపల్లి నేటి ధాత్రి
ఆంధ్రోళ్ల ఉచ్చులో తెలంగాణ ప్రజలు పడొద్దని..తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పౌరులుగా మన అందరిపై ఉందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు బండి రఘుపతి గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ఉన్న కొందరు సంకరజాతి..కచరాగాళ్ల అండతో అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మపై ఆంధ్రోళ్లు చేస్తున్న దాడిని తెలంగాణ వాదులుగా ప్రతి ఒక్కరు ఖండించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడాన్ని కూల్చివేయడంతో పగ సాధింపు చర్యల్లో భాగంగా ఆంధ్ర వలసవాదులు తెలంగాణ బహుజనుల ఆడబిడ్డయినటువంటి కొండా సురేఖమ్మపై ఆంధ్ర సినీ హీరోలాంత ముకుమ్మడిగా దాడి చేయడం వెనుక తెలంగాణలో చిల్లర బొల్లర గాళ్లు ఉన్నారని మండిపడ్డారు. ఆంధ్రలో మాజీ సీఎం చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా నీచంగా తిట్టుకున్నప్పుడు ఈ ఆంధ్ర హీరోలంతా ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. సురేఖమ్మ ఎవరి భావాలనైనా నొప్పించినట్లయితే అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన కూడా ఈ దాడి ఆగట్లేదు అంటే.. ఈ చిత్ర విచిత్రమైన పరిశ్రమతోటి తెలంగాణకు నష్టమే కానీ..అనా పైసా కూడా లాభం లేదని..అలాగే ఆ చిత్ర పరిశ్రమలో చెప్పుకో తగ్గట్లు ఎదిగిన హీరో తెలంగాణలో లేడని, ఈ అక్రమ మూకలు తెలంగాణ అస్తిత్వంపై చేస్తున్న దాడిని తీవ్రంగా వ్యతిరేకించి, ఈ ఆంధ్ర నటులకు బుద్ధి వచ్చేలా తెలంగాణ సమాజమంతా ఒకటవ్వాలని, వీళ్ళ చర్యలను తిప్పి కొట్టాలని, బడుగు, బలహీన వర్గాల ఆడపడుచుకు అండగా నిలవాలని, తెలంగాణ వాదాన్ని గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.