అవినీతి రహిత సమ సమాజ స్థాపనకు నడుం బిగించాలి

మంచిర్యాల,నేటి ధాత్రి:

అవినీతి రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజిలెన్స్, యాంటి కరప్షన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజలింగు మోతే అన్నారు.సోమవారం అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం సందర్భంగా విజిలెన్స్ యాంటీ కరప్షన్ కౌన్సిల్ విభాగం సోషల్ డిటెక్టివ్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆడెపు సురెంధర్ అధ్యక్షతన స్టాప్ కరప్షన్ వాల్ పోస్టర్ ను జిల్లా కేంద్రంలో కౌన్సిల్ చైర్మన్ విడుదల చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. అవినీతిని పూర్తిస్థాయిలో నిర్మూలించడం సాధ్యమేనని,టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో కొన్ని రంగాల్లో లంచగొండితనం తగ్గింది అని అన్నారు. మరికొన్ని రంగాల్లో అవినీతి కొనసాగుతుందన్నారు.పూర్తిస్థాయిలో టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, లంచగొండితనం తగ్గుతుందన్నారు.కొన్ని శాఖల్లో డబ్బులు ఇవ్వకుండా పనులు కావడం లేదని,దీన్ని రూపుమాపాలంటే ఆలోచించి సరైన పద్ధతులను ప్రభుత్వాలు ప్రవేశపెట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు కాగితవు సునీల్, నడిపెల్లి సునీల్ రావు, ఎగుడ తిరుపతి, హనుమండ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీల కంటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ 78 వ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమా నాయకురాలు సోనియా గాంధీ కుటుంబ ప్రాణ త్యాగాలు చేశారని రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా అవకాశం వచ్చిన వదులుకొని మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేసిన పుణ్యమూర్తి అని అలాగే తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మహాతల్లి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ నాయకులు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్, కోవ జంగూ , నర్సయ్య యాదవ్, పలిగిరి కనకరాజు,పెరుగు తిరుపతి, రాజేశం గౌడ్,శ్రీనివాస్ గౌడ్, కటకం నాగరాజు,ఓదెలు,గడ్డం శ్రీనివాస్ గౌడ్,వెంకటేష్ , మనోజ్, సంఖ్య రవి మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గోన్నారు.

విద్యార్థుల జీవితాలు బంగారు భవిష్యతిగా మారుతుంది

జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2024

ప్రతి విద్యార్థికి ఒక కల ఉంటుందని కలను నిజం అవుతుంది

అద్భుతాలు సృష్టించేది విద్యార్థులే

గణపురం ప్రొఫైల్ మోడల్ స్కూల్ యజమాన్యం

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా
గణపురం మండల కేంద్రంలోని ఫ్రోబెల్ మోడల్ హై స్కూల్ విద్యార్థినిలు సిహెచ్ శ్రీనిధి అండ్ ఎన్ అక్షయ జిల్లా స్థాయి సెకండ్ ప్రైస్ వెస్ట్ మేనేజ్మెంట్ మేకింగ్ బ్రిక్స్ విత్ ప్లాస్టిక్ వేస్టేజ్ అవార్డు డిఈ ఓ రాజేందర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో రెండవ ఉత్తమ ప్రైస్ అవార్డ్ గ్రహీతలుగా ఎంపికయ్యారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్ కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో మంచి ఎక్స్పరిమెంట్స్ చేస్తే విద్యార్థుల యొక్క జీవితాలు బంగారు భవిష్యత్తుగా మారుతుందని విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క కళా నైపుణ్యాన్ని ఉపయోగించి వివిధ రకాల ఎక్స్పరిమెంట్స్ చేస్తూ వాళ్ళ యొక్క కలల్ని నిజం చేసుకోవాలని వాళ్ళు అలా చేసుకుంటే వాళ్లకి అద్భుతమైన ఫలితాలు వస్తాయని ప్రతి విద్యార్థికి ఒక కల ఉంటుందని ఆ కలను నిజం చేసుకోవాలని వివిధ రకాల ప్రయోగాల వల్ల ఇలాంటి సత్ఫలితాలు పొందుతారని విద్యార్థులకు సూచించారు ఇప్పటినుంచి ఇలాంటి కృత్యాలు చేయడం వల్ల అబ్దుల్ కలాం లాంటి ఎందరో శాస్త్రవేత్తలుగా మీరు కూడా ఒకరిగా అవుతారని విద్యార్థు లను ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చారు అద్భుతాలు సృష్టించేది విద్యార్థులేనని రేపటి భవిష్యత్తు తీర్చిదిద్దేది విద్యార్థి లేనని ఉపన్యాసించారు ఈ కార్యక్రమంలో గణపురం ఎంఈఓ ఉప్పలయ్య పాఠశాల కరస్పాండెంట్ డైరెక్టర్స్ ఉపాధ్యాయులు ఎల్ యాదగిరి పి శివ శంకర్ జగన్ పాల్గొన్నారు

కలుషితమవుతున్న దామెరా చెరువు

ప్లాస్టిక్ మరియు మాంసపు వ్యర్థలతో పరిసరాలు

వర్షం పడితే భరించలేని దుర్వసన

పరకాల నేటిధాత్రి


హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో గల దామెర చెరువు పూర్తిగా కలుషితమైపోతుంది.గత ప్రభుత్వంలో 380 లక్షల తో పునరుద్దరణ మరియు మినీ ట్యాంక్ బండుగా పనులు ప్రారంభమాయ్యాయే తప్ప పునరుద్దరరికణ విషయంలో మాత్రం వెనకబడి పోయింది.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభ దిశలోనే ఉన్నాయే గాని ముందుకు సాగడం లేదని చెప్పవచ్చు.

ప్లాస్టిక్,మాంసపు వ్యర్దాలతో పరిసరాలు

దామెరా చెరువు ప్లాస్టిక్ మరియు మాంసపు వ్యర్థలతో పరిసరాలు దర్శనమిస్తున్నాయి.బేకరీలు,ఫంక్షన్ హాలులలో కూల్ డ్రింక్ షాపులలో వివిధ వ్యాపార అవసరాలకు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు,గ్లాసులు,ప్లేట్స్, వాడిపడేసిన వాటర్ బాటిల్లు కుప్పలు తెప్పులుగా కనిపిస్తున్నాయి.చికెన్,చేపల షాపులలో మిగిలిన పనికిరాని కలేబరాల వ్యర్థలను చెరువు పరిసరాల సమీపంలోకి తీసుకువచ్చి వ్యాపారస్థులు పాడవేసి వెళ్తున్నారు.పండ్ల దుఖనాలలో తాగిపడేసిన కొబ్బరిబోండాలకైతే కొడవేలేదు నీళ్లలో చెరువు గట్టుమీద ఎక్కడ చూసిన అవే దర్శనమిస్తున్నాయి.హాస్పిటల్లో,మెడికల్ షాపులలో గడువు దాటినా మందులను,పాతపడిన దుస్తులను కూడా చెరువు నీళ్లలో విచ్చల విడిగా పారవేస్తున్నారు.

వర్షం పడితే భరించలేని దుర్వసన

చినుకు పడితే చాలు చెరువు కట్ట పరిసరాలు అనేక రకాల వ్యర్థలతో భరించలేని దుర్వసన వస్తుందని గత వర్షాకాలం సమయంలో రోజు నరకం అనుభవించామని పండగ వస్తే తప్ప పాలకులు ఇతర సమయాలో చెరువును గాని పరిసరాలను గాని పట్టించుకునే పరిస్థితి లేదని చెరువును పునరుద్దరికరణ చేయించి దుర్వసన నుండి రోగాలు తెచ్చిపెట్టే దోమలనుండి వచ్చే రోగాల బారినపడకుండా తమను విముక్తిలుగా చేయాలనీ పునరుద్దికరణ పనులు వీలైనంత తొందరగా చేపట్టి పూర్తి చేయాలనీ చెరువు పరిసరాలలో విచ్చలవిడిగా వ్యర్థలను,ప్లాస్టిక్ సంబంధిత వస్తువులను పడవేయకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులను,అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు.

జాతీయస్థాయి కరాటే పోటీలకు క్రీడాకారుల ఎంపిక

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీ చైత్ర,జోష్మిత అనే విద్యార్థులు పంజాబ్ రాష్ట్రంలోని లూదీయానాలో జరిగే జాతీయస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 14 కరాటే పోటీలకు ఎంపిక అయినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ ఫణి రాజా,కరాటే మాస్టర్ వెంకటేష్ తెలిపారు. రాష్ట్రస్థాయి కరాటే పోటీలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపిక అయినట్లు వెల్లడించారు.ఈ క్రీడాకారులను పలువురు అభినందించారు.

నూతన వధూవరుల ను ఆశీర్వదించిన మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్

మరిపెడ నేటిధాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామ వాస్తవ్యులు చిందా హేమంత శ్రీనివాసరాజు నందిని తనయుడు త్రినాథ్ కుమార్ వర్మ వెడ్స్ తన్వి ల, వివాహ రిసెప్షన్ వేడుక,టిసివి రెడ్డి,కళ్యాణ మండపం ఖమ్మం యందు జరిగినది ఇట్టి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి,డిఎస్ రెడ్యా నాయక్, హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు వారి దాంపత్య జీవితం నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని దీవించారు, ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, రాంపురం మాజీ సర్పంచ్ రాంపల్లి అబ్బయ్య గౌడ్, ఎల్లంపేట మాజీ సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,నల్లెల మాజీ ఎంపీటీసీ చంద్రారెడ్డి, గంటల మహిపాల్ రెడ్డి, రాంపల్లి చిన్న వెంకన్న,పట్ల మల్లయ్య, యాకుబుపాష తదితరులు పాల్గొన్నారు.

దళిత జర్నలిస్టుల ఫోరమ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ ఆధ్వర్యంలో వేడుకలు

దళిత జర్నలిస్టుల ఫోరమ్ ఆద్వర్యం లో పలువురికి సన్మానం

దళితులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చట్టం అమలు చేయాలి

అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షలు దళిత జర్నలిస్టులకు అందజేయాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి

భద్రాద్రి కొత్తగూడెంలో 09 డిసెంబర్ దళిత జర్నలిస్టుల ఫోరమ్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కాషాపోగు జాన్ ఆదేశాల మేరకు దళిత జర్నలిస్టు ఫోరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్న కుమార్ ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టుల ఫోరమ్ 10 వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు కొత్తగూడెం ఎస్సీ ఎస్టీ పిసి మైనార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా కేకులు కట్ చేసి అంగరంగ వైభవంగా సంబరాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న దళిత నాయకులను నాయకురాళ్లను పలువురిని దళిత జర్నలిస్టు పోరం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ మాట్లాడుతూ దళిత జర్నలిస్టు ఫోరం ద్వారా దళిత జర్నలిస్టుల సమస్యల కొరకు గత పది సంవత్సరములుగా అలుపెరుగని పోరాటం చేస్తూ దళిత జర్నలిస్టులను చైతన్యం పరుస్తూ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దళితులు అంటేనే చులకనగా చేసే ఈ సమాజంలో దళిత జర్నలిస్టు సమస్యలను నిరంతరం పోరాటం చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జాన్ సెక్రటరీ డేవిడ్ రాష్ట్రప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లడం జరిగింది. దళిత జర్నలిస్టులపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక చట్టం అమలు చేయాలని దళిత బంధు లాగా అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షలు దళిత జర్నలిస్టులకు మొదటి విడతగా అందజేయాలని. డబల్ బెడ్ రూములు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో దళిత జర్నలిస్టులకు మొదటి విడుదల అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి యువజన మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ , అంబేద్కర్ జాతీయ ఫెలోషిప్ అవార్డు గ్రహీత, జర్నలిస్ట్ బరిగెల భూపేష్ కుమార్. మేదిని లక్ష్మి రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి మహిళా సమైక్య నాయకురాలు కరిష రత్నకుమారి నక్క సృజన కూరపాటి రవీందర్ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు బరిగెల సంపూర్ణ . దళిత జర్నలిస్టు ఫోరం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ శెట్టి గోపి రవీందర్ బుపేష్ నాగయ్య వినోద్ వికాస్ తదితర నాయకులు పాల్గొన్నారు దళిత జర్నలిస్ట్ ఫోరం సభ్యులు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలోతెలంగాణ ప్రదాత సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో డిజె సప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గ్రామంలో వాడవాడల తిరుగుతూ ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాల ముందర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు పుట్టినరోజు వేడుకల్లోమండల జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఘనంగా సోనియా గాంధి జన్మదిన వేడుకలు

గంగాధర నేటి ధాత్రి :

గంగాధర మండలంలోని మధురానగర్ ఎక్స్ రోడ్ నందు గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పురుమళ్ళ మనోహర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఉచిత వైద్య శిబిరం

గ్రామ ప్రజలు సద్విని యోగం చేసుకోవాలి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం పత్తిపా క గ్రామంలో ఉచిత వైద్య సేవలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 9 గంటల నుండి రెండు గంటల వరకు గ్రామపంచాయతీ నందు ప్రజలు హాజరు కావాలి ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అపోలో రిచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ కొత్తపేట క్రాస్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తు న్నారు.పత్తిపాక గ్రామంలో నివసించే ఉచిత వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరు బీపీ,షుగర్ ,ఈసీజీ తీయబ డును అన్ని రకాల వ్యాధులకు చూడబడును దానికి సరిపడా మందులు ఉచితంగా ఇవ్వబ డును కావున గ్రామంలో నివసి స్తున్న ప్రజలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.

ఆధార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూల్ ప్రారంభం

వలస ఆదివాసి విద్యార్థులకు ఆధార్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలు మరువలేనివి ఎంఈఓ గడ్డం మంజుల

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…

కరకగూడెం మండల పరిధిలోని వలస ఆదివాసి గ్రామమైన అశ్వపూరంపాడు గ్రామంలో ఆధార్ స్వచ్ఛంద సంస్థ అధ్వర్యంలో నిర్మించిన ప్రైమరీ పాఠశాల ను సోమావారం ఎంఈఓ గడ్డం మంజుల,ఏడూళ్ళ బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్ఐ రాజేందర్ ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చెసి ప్రారంబించారు. అనంతరం విద్యార్థులకు కాటన్ బ్యాగ్స్,పలకలు,నోట్ బుక్స్,పెన్నులు,పెన్సిల్ తదితర వస్తువులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.. ఈ కార్యక్రమంలో రామన్ శక్తి పౌండేషన్ ప్రతినిధులు హేమలత, దినేష్ ,ఆధార్ స్వచ్చంద సంస్థ సభ్యులు బట్టా.బిక్షపతి వాలెంటిర్స్ కుంజ రాము,పోడియం.సునీతా ఈసం రాజబాబు పోలీస్ సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

ఆదివాసులకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలి.

అది రాజ్యాంగం కల్పించిన హక్కు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్

భద్రాచలం నేటిదాత్రి

చర్ల మండలం ఆదివాసి గ్రామాలలో ఆదివాసీలకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న ఆదివాసీలకు ఏజెన్సీ ప్రాంతంలోని కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన వాళ్ళ విద్య మధ్యలోనే ఆగిపోతుందని దీనితో వారు చదువు లేని వారిగా సమాజంలో సృష్టించబడుతున్నారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎస్టీ సామాజిక వర్గానికి అది ఏవరైనా సరే వారందరికీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని వారిని విద్య సాంస్కృతిక పరంగా అభివృద్ధి పరచాలని తెలియజేశారు అయిన నేడు చర్ల మండలంలో పూర్తిగా ఆదివాసీలే ఉన్నప్పటికీ ఆ ఆదివాసీలకు ఇక్కడ కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని అభివృద్ధికి దూరానికి నెట్టివేస్తున్నారని వారు అన్నారు. వారు ఆదివాసీలమని నిరూపించుకోవడానికి అడవే మూలాధారమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున తక్షణమే ఆదివాసులకు కుల సర్టిఫికెట్లు ఆదయ సర్టిఫికెట్లు ఇవ్వాలని వారిని విద్య వైద్య సాంస్కృతిక పరంగా అభివృద్ధి పరచాలని చైతన్య పరచాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకుడు ఇర్ఫా రాజేష్ పి వై ఎల్ నాయకుడు స్వరూప్ ఆదివాసి ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వారాజు కుమారస్వామి

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ తూర్పులోని పోచమ్మ మైదాన్ కూడలి వద్ద కొండా దంపతుల ఆదేశాల మేరకు, డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ పుట్టినరోజు సందర్బంగా గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న స్థానిక 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వారాజు కుమారస్వామి. తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకల సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్పొరేటర్ వెంట స్థానిక నాయకులు దయాకర్, ప్రమోద్, వరంగల్ తూర్పు యూత్ కాంగ్రెస్ నాయకులు సిలివేరు రాజేష్, గుజ్జుల రాకేష్ రెడ్డి, గడ్డమీది వినయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

AITUC. పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

భద్రాచలం నేటి ధాత్రి

అధ్యక్షులుగా. పాగా .ఆదినారాయణ.
ప్రధాన కార్యదర్శిగా ఇరుప సాంబశివరావులు ఏగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా గుంజి మాల్యాద్రి.

చర్ల. చర్ల మండల కేంద్రంలోని స్థానిక సిపిఐ కార్యాలయం ప్రాంగణంలో పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ మహాసభ పాగా .ఆదినారాయణ .మామిడి . ప్రశాంత్.ల అధ్యక్షతన జరిగింది ఈ మహాసభకు ఏఐటియు సి గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరీ .వెంకటేశ్వరరావు జిల్లా సమితి సభ్యులు అడ్డగర్ల తాతాజీ ఏఐటియు సి మండల కార్యదర్శి గుంజి మాల్యాద్రి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సాయిల తిరుపతి గోసంగి నాగేంద్ర నంబూరి నాగేశ్వరరావు వెంకట్రావు రాజేష్ అనిల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాసభలో కల్లూరీ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ మహాసభ అత్యంత ఘనంగా జరుపుకుంటున్న కార్మిక సోదరులకు విప్లవ అభినందనలు తెలిపారు కార్మికులు పెయింటర్స్ ఐక్యతతో తమ తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కార్మిక చట్టాలను హక్కులను సాధించుకోవాలన్నారు. ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులుగా భాడిస. జ్యోతి ష్.తోట మల్ల .సందీప్ సహాయ కార్యదర్శులుగా కర్రీ .నరసింహమూర్తి. చింతల. ఆనంద్ సలహాదారులుగా. తడికల. నరేష్. పలక .రంగారావులు .ఎన్నికైన ఈ కార్యక్రమంలో .సో యం. వీరేందర్ .సోడి .నారాయణ. మామిడి. భూషణం. పసుపులేటి .సంతోష్ .చింతల. సంటి సోయం. రవి .తోటమల్ల. వినయ్ .మదర్ .శ్యాంప్రసాద్ .భోగల .రఘునాధ బాబు కొరస .శివప్రసాద్ .నక్క .సాగర్. తోకల ఠాగూర్ .సరెమ్ .నాగేశ్వరరావు వెంకటేశ్వర్లు. వినోదు .సుధాకర్ .అభిషేక్ దావీద్. బాబి .శేఖర్ .కొండ. సాయి .భూపతి .రాజా .నవీన్ .పెద్దిరాజు .తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ కళాశాలలో ఉపాధ్యాయులు,తల్లిదండ్రుల సమావేశం

విద్యార్థులు ఇంటివద్ద చదువుకునే విధంగా బాధ్యతలు తీసుకోవాలి

కళాశాల ప్రిన్సిపాల్ కే.సంపత్ కుమార్

పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ కే.సంపత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రతిరోజు ఇంటి వద్ద చదువుకునే విధంగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అదేవిధంగా అధ్యాపకులు చెప్పే ప్రతి విషయాన్ని తరగతి గదికి విద్యార్థులు పరిమితం చేస్తున్నారని,ఇంటికి వెళ్ళాక చదివించే బాధ్యత తల్లిదండ్రులది అని కళాశాలలో ఉన్నంతవరకు అధ్యాపకులు బాధ్యతతీసుకుంటారని,ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా చదివిస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.అదేవిధంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రాథమిక అవసరమైన పోషకాహారం అందిస్తేనే పిల్లలు చదువులపై దృష్టి కేంద్రీకరిస్తారని అన్నారు.ఈ కార్యక్రమలో విద్యార్థులతల్లిదండ్రులు,విద్యార్థులు,అధ్యాపకులు పాల్గొన్నారు.

హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది

భద్రాచలం నేటి ధాత్రి

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు
అలాగే ఖమ్మం ఎమ్మెల్సీ తాత మధు కి కరపత్రం ఇచ్చిన గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకులు ఏర్పా ప్రకాష్ దొర ఈరోజు నుండి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల ఏర్పాటుకు ముఖ్యంగా భద్రాచలం ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు
ఏజెన్సీకి నడిబొడ్డున ఉన్న భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటారని ఆశా భావం వ్యక్తం చేశారు.

రైతుల వరి ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడిని అరికట్టాలి

కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు

జాప్యాని నివారించి త్వరితగతిన కొనుగోలు చేపట్టాలి

ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన ఎంసిపిఐ(యు), ఏఐకేఎఫ్ ప్రతినిధి బృందం

నర్సంపేట,నేటిధాత్రి :

రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారించి మిల్లర్ల దోపిడిని అరికట్టి సకాలంలో రైతులకు బోనసుతో కలిపి డబ్బులను అకౌంట్లో జమ చేయాలని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.
సోమవారం ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఖానాపురం మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు కేంద్రంలో రైతుల ఇబ్బందులు కొనుగోలు పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి అనేక ఒడుదుడుకులను తట్టుకొని వరి ధాన్యాన్ని పండిస్తే మార్కెట్ సౌకర్యం సరిగా లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అయినా సరైన మద్దతు ధర బోనస్ లభిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని కానీ కొనుగోలు కేంద్రాల్లో సరైన కనీస ఏర్పాటు లేకపోవడం వల్ల మిల్లర్ల చేతిలో బందీలైతున్నారని కుంటి సాకులతో బస్తాకు రెండు కేజీల నుంచి 5 కేజీల వరకు కోత విధిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తూ దోచుకుంటున్నారని అదేమని రైతులు ప్రశ్నిస్తే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యంలో మాకు బియ్యం రావడంలేదని చెబుతున్నారని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో ప్యాడి క్లీనర్లు, పరదాలు, తేమ యంత్రాలు అందుబాటులో లేవన్నారు. రోజుల తరబడి కొనుగోలు సెంటర్లలో, రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పచేసి కొనుగోలు కోసం ఎదురుచూస్తున్నారని ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ కొరబడిందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పోసిన ధాన్యంలో 10% కూడా కాంటాలు కాని వైనం నెలకొన్నదని జిల్లాలోని అన్ని పీఏసీఎస్, ఐకేపీ కొనుగోలు సెంటర్లలో ఇదే తంతు కొనసాగుతోందన్నారు.
ధాన్యం కాంటాలు అయినా లారీల కోసం రైతులు వేచి చూడాల్సిన దుస్థితి దాపురించిందని
వాతావరణ మార్పు, వర్ష సూచనతో రైతుల్లో పెరుగుతున్న ఆందోళన చెందుతున్నారని
త్వరిత గతిన ధాన్యం కాంటాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కలకొట్ల యాదగిరి, సంఘ నాయకులు గొర్రె సామ్యేల్, వీరన్న, నరేష్ ,మల్లయ్య ,వివేక్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ తూర్పులో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో పోచంమైదాన్ కూడలిలో అంబరాన్నంటిన సంబరాలు

కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించిన తూర్పు కాంగ్రెస్ శ్రేణులు

పెద్ద ఎత్తున హాజరైన కొండా అభిమానులు, తూర్పు కార్పొరేటర్లు,యూత్ కార్యకర్తలు, మహిళలు

వరంగల్ తూర్పు, నేటిధాత్రి

వరంగల్ తూర్పులోని పోచమ్మ మైదాన్ కూడలి వద్ద కొండా దంపతుల ఆదేశాల మేరకు, డిసెంబర్ 9వ తేదీ సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్బంగా, కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకులు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకల సందర్బంగా ముఖ్య అతిధిగా హాజరైన గోపాల నవీన్ రాజ్ కేక్ కట్ చేసి, 500మందికి అన్నదానం చేశారు. కొండా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినందుకు, తెలంగాణ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఆరుగ్యారంటీల హామీ అమలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతుందని తెలిపారు. అనంతరం సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామీ, తూర్పు కార్పొరేటర్లు చింతాకుల అనిల్, ఎండి ఫుర్ఖాన్, ఓని భాస్కర్, కావేటి కవిత, కేడల పద్మ, గుండు చందన, ఉమా దామోదర్ యాదవ్, భోగి సువర్ణ, పోషలా పద్మ, వస్కుల బాబు, బాలినే సురేష్, మరియు తూర్పు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోట వేణు, బస్వారాజ్ రాజ్ కుమార్, మీసలా ప్రకాష్, ఎలుగం సత్యనారాయణ, వసీమ్, సయ్యద్ మోసిన్, మబ్బు ప్రవీణ్, ఖుర్షిద్, జక్కం ప్రవీణ్, గడ్డమీది రాజేష్ గౌడ్, జన్ను రవి, కొల్లూరి మల్లేశం, నరిగే శ్రీను మరియు యూత్ నాయకులు సిలివేరు రాజు, రాజేష్, రాకేష్ రెడ్డి, అజార్, వినయ్ సోషల్ మీడియా విభాగం పల్లంకొండ హరి శ్రీరామ్, మహిళా నాయకురాళ్లు స్వప్న గౌడ్, స్రవంతి, తోట రాణి తదితరులు పాల్గొన్నారు.


మరోసారి బయటపడ్డ తూర్పు కాంగ్రెస్ వర్గ విబేధాలు

సోనియాగాంధీ జన్మదిన వేడుకల సందర్బంగా మరోసారి బయటపడ్డ తూర్పు కాంగ్రెస్ వర్గ విబేదాలు. అయేమయంలో కార్యకర్తలు? ఉదయం జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ ఆధ్వర్యములో కేక్ కట్ చేసిన ఎర్రబెల్లి స్వర్ణ, బస్వారాజు సారయ్య వర్గం. అదే ప్లేస్ లో మధ్యాహ్నం నవీన్ రాజ్ ఆధ్వర్యంలో కేకు కటింగ్ చేసి అన్నదానం చేసిన కొండా వర్గం.

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా కుమ్మరి రేణుక

వరంగల్, నేటిధాత్రి

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన కార్యవర్గంను హైదరాబాదు లోని అశోక హోటల్లో ఎన్నుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా కుమ్మరి రేణుక, నాయబ్ తహసీల్దార్, నర్సంపేట్ ను, అలాగే గౌరవ అధ్యక్షులుగా లచ్చిరెడ్డి, అదేవిధంగా తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా షేక్ ఇమామ్ బాబా, డిప్యూటీ తహసిల్దార్ భూపాలపల్లి. అలాగే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సయ్యద్ అజరుద్దీన్, సెక్రటరీగా సూర్య ప్రకాష్, మరియు సురేష్ ఈసీ మెంబెర్ గా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు తెలిపారు.


అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏర్పాటు

హైదరాబాద్ లో రెవెన్యూ అధికారులు సిబ్బంది సమక్షంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అంగరంగ వైభవంగా ఏర్పాటు కావడం జరిగింది. ఈసమావేశమునకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ఆఫీసు సబార్డినేట్స్, జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్, డిప్యూటీ తాసిల్దార్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, వందల సంఖ్యలో హాజరు అయి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ ఏర్పాటు ఆవశ్యకతను మరియు భవిష్యత్తులో రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమానికి వారు తీసుకోబోతున్న చర్యల గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు లచ్చిరెడ్డి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణ, తహసీల్దార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాములు, జనరల్ సెక్రటరీ రమేష్ పాక, సెక్రటరీ జనరల్ ఫుల్ సింగ్, మహిళా అధ్యక్షులు రాధ, ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి స్టేట్ యూనియన్లో మా అందరికీ ఈ పోస్టులు రావడానికి కృషి చేసిన అసోసియేట్ ప్రెసిడెంట్ తహసిల్దార్ ఎండీ ఇక్బాల్, విక్రమ్, నాగేశ్వర్ రావు మరియు విశ్వప్రసాద్ లకు కృతజ్ఞతలు తెలియచేశారు నూతన కార్యవర్గం.

ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి

తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని రామకృష్ణాపూర్ పట్టణ కాంగ్రెస్ నాయకులు అన్నారు. రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను పార్టీ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజారంజక పాలననే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలైన 6 గ్యారెంటీలను ప్రభుత్వం అమలుపరుస్తుందని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్య స్థాపనకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version