విద్యార్థులు ఇంటివద్ద చదువుకునే విధంగా బాధ్యతలు తీసుకోవాలి
కళాశాల ప్రిన్సిపాల్ కే.సంపత్ కుమార్
పరకాల నేటిధాత్రి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ కే.సంపత్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రతిరోజు ఇంటి వద్ద చదువుకునే విధంగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని అదేవిధంగా అధ్యాపకులు చెప్పే ప్రతి విషయాన్ని తరగతి గదికి విద్యార్థులు పరిమితం చేస్తున్నారని,ఇంటికి వెళ్ళాక చదివించే బాధ్యత తల్లిదండ్రులది అని కళాశాలలో ఉన్నంతవరకు అధ్యాపకులు బాధ్యతతీసుకుంటారని,ఇంటికి వెళ్లాక తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా చదివిస్తే వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.అదేవిధంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు ప్రాథమిక అవసరమైన పోషకాహారం అందిస్తేనే పిల్లలు చదువులపై దృష్టి కేంద్రీకరిస్తారని అన్నారు.ఈ కార్యక్రమలో విద్యార్థులతల్లిదండ్రులు,విద్యార్థులు,అధ్యాపకులు పాల్గొన్నారు.