అది రాజ్యాంగం కల్పించిన హక్కు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ డిమాండ్
భద్రాచలం నేటిదాత్రి
చర్ల మండలం ఆదివాసి గ్రామాలలో ఆదివాసీలకు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ డిమాండ్ చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న ఆదివాసీలకు ఏజెన్సీ ప్రాంతంలోని కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వలన వాళ్ళ విద్య మధ్యలోనే ఆగిపోతుందని దీనితో వారు చదువు లేని వారిగా సమాజంలో సృష్టించబడుతున్నారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఎస్టీ సామాజిక వర్గానికి అది ఏవరైనా సరే వారందరికీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలని వారిని విద్య సాంస్కృతిక పరంగా అభివృద్ధి పరచాలని తెలియజేశారు అయిన నేడు చర్ల మండలంలో పూర్తిగా ఆదివాసీలే ఉన్నప్పటికీ ఆ ఆదివాసీలకు ఇక్కడ కుల ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారిని అభివృద్ధికి దూరానికి నెట్టివేస్తున్నారని వారు అన్నారు. వారు ఆదివాసీలమని నిరూపించుకోవడానికి అడవే మూలాధారమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావున తక్షణమే ఆదివాసులకు కుల సర్టిఫికెట్లు ఆదయ సర్టిఫికెట్లు ఇవ్వాలని వారిని విద్య వైద్య సాంస్కృతిక పరంగా అభివృద్ధి పరచాలని చైతన్య పరచాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకుడు ఇర్ఫా రాజేష్ పి వై ఎల్ నాయకుడు స్వరూప్ ఆదివాసి ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు