ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిచరించాలని జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ అన్నారు.. మహబూబ్ నగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత ఎస్ఐ మరియు సిఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు నిర్భయంగా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలియజేశారు.
ప్రజావాణిలో తమకు అందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని నవాబుపేట ఎంపీడీవో జయరాం నాయక్ తెలిపారు. ఎంపీడీవో పర్యవేక్షణ లో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. ఈ సందర్భంగా జయరాం నాయక్ మాట్లాడుతూ. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం చెప్పట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సంబంధిత విభాగాలతో తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నవాబుపేట మండల పరిధిలోని , గ్రామాలలో స్థానికంగా నెలకొన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంగళవారం జరగబోయే మండల స్థాయి ఆటల పోటీలు మండల పరిషత్ ప్రాంగణంలో ప్రారంభమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల్ లెవెల్ ఆఫీసర్స్, తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ తూర్పు 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి గారి అమ్మ, బస్వరాజు సరోజన (69) గారు సోమవారం సాయంత్రం సంరక్ష హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. మూడు రోజుల క్రితం గుండె సమస్య రావడంతో సంరక్ష హాస్పటల్లో చేర్పించారు కుటుంబ సభ్యులు. చికిత్స చేసిన హాస్పిటల్ వైద్యులు సోమవారం ఉదయం స్టంట్ వేసినట్లు సమాచారం. గత మూడు రోజులుగా హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ పొందుతు సోమవారం సాయంత్రం మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ లో ఉన్న మంత్రి కొండా సురేఖ ఫోన్ ద్వారా పరామర్శించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కార్పొరేటర్ నివాసంకు చేరుకొని పరామర్శించారు. మంగళవారం మద్యాహ్నం అంతక్రియలు కొత్తవాడ లోని స్మశాన వాటికలో జరగున్నట్లు బంధువులు తెలిపారు. మృతురాలికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కలదు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ఉదయం 10:50 నిమిషములకు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద విజయ్ దివస్ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మరియు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమం గురించి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఉద్యమంలో ఎందరో జైలు జీవితం కూడా గడిపారని తెలంగాణ ఉద్యమాన్ని ఒంటి చేత్తో గెలిపించి మన బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్.తెలంగాణ సాధించారని అలాంటిది తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చడం కరెక్ట్ కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సెస్ చైర్మన్ చిక్కాలరామారావు మాజీ ఎంపీపీ పడిగల మానస రాజు మండల అధ్యక్షులు గజ బీంకర్ రాజన్న. పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మహిళ మాజీ చైర్మన్లు మహిళా నాయకురాలు కార్యకర్తలు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్ విద్యార్థులను సోమవారం రోజున మందమర్రి లోని సింగరేణి పార్క్ కు విద్యార్థులను పిక్నిక్ తీసుకపోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బత్తిని దేవన్న మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు విద్యతో పాటు జ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా ప్రతి సంవత్సరం విద్యార్థులను వివిధ ప్రాంతాలను చూపెడతామని అన్నారు. అలాగే విద్యార్థులు సింగరేణి పార్క్ మందమర్రి ని సందర్శించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ భాగంగా చెట్లను మనం రక్షిస్తే చెట్లు మనల్ని రక్షిస్తాయని వివరించారు.ఫ్రీ ప్రైమరీ విద్యార్థులతో గుడ్ మేనర్ ఆక్టివిటీ కాన్సెప్ట్ లు వివరించారు.మరియు విద్యార్థులతో ఆటలు పాటలు కల్చరల్ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు,సిబ్బంది పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రతి ఏటా జరిగే సీతా రామచంద్ర స్వామి కళ్యాణ మండపం చుట్టూ గల ఆవరణకు రేకుల షెడ్డు కొరకు సోమవారం గణపురం వాస్తవ్యులైన సూర్యదేవర స్రవంతి కార్తీక్ దంపతులు చెక్కు అందజేశారు. అనంతరం శ్రీపట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో సూర్యదేవర స్రవంతి కార్తీక్ దంపతులు ప్రత్యేక పూజ నిర్వహించారు. సూర్యదేవర కార్తీక్ వారి తండ్రిగారైన కీర్తిశేషులు సూర్యదేవర ప్రకాశం గుప్తా జ్ఞాపకార్థం రూ. 51,000 రూపాయలు గల చెక్కును ఆలయం కమిటీ కి అందజేయటం జరిగింది. దాతలకు అర్చకులు ముసునూరి నరేష్ తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన గౌడ్, రౌతు వెంకన్న, పోశాల కిషోర్, మార్క రమేష్ పాల్గొన్నారు
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోనియా గాంధీ 79 వ జన్మదిన వేడుకలు సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు సోషల్ మీడియా వారియర్స్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. జైపూర్ మండలం సోషల్ మీడియా కోఆర్డినేటర్ కే సతీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ కృషితో వచ్చిందని,60 సంవత్సరాల తరబడి ప్రజలు, యువకులు,నిరుద్యోగులు యువత బలిదానాలతో చలించిపోయిన సోనియా గాంధీ ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యాన్ని వారి దోపిడిని తెలుసుకున్న సోనియా గాంధీ నాటి యూపీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని తెలియజేశారు.
సీనియర్ నాయకులు జన్మదిన వేడుకలకు దూరం
గత నాలుగు నెలల నుండి జైపూర్ మండలంలోని అనేక గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకరి మీద ఒకరు వ్యతిరేకంగా ప్రచారం చేసుకుంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ,సొంత ప్రయోజనాల కోసం పార్టీకి గ్రామాలలో చెడ్డపేరు తీసుకవచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని అనేకమంది బయట ప్రచారం చేస్తున్నారు.జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ గ్రూపులుగా విడిపోయి ఒకరి మీద ఒకరు స్థానిక శాసనసభ్యుడు వివేక్ దృష్టికి తీసుకవెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.కష్టపడి పనిచేసి గ్రామస్థాయిలో కాంగ్రెస్ బలాన్ని పెంచే విధంగా నాయకులు ఏమాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని అనేక వాదనలు వినబడుతున్నావి.స్థానిక శాసనసభ్యుడు వివేక్ వెంకటస్వామి,స్థానిక పెద్దపెల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మండల పర్యటనలో ఉన్నప్పుడు గంటల గంటలు ఎదురుచూసే మండల సీనియర్ నాయకులు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనక పోవడం చాలా బాధాకరమని మండలంలోని ప్రజలు నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో జైపూర్ మండలం యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరుణ్,చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ సృజన్,మండలంలోని వివిధ గ్రామాల సోషల్ మీడియా వారియర్స్,ప్రేమ్ యాదవ్,సాయి,రవి గౌడ్,తిరుమల వాసు,వెంకటేష్,శివ తదితరులు పాల్గొన్నారు.
నడికూడ,నేటిధాత్రి: స్టేట్ కమిటీ మెంబర్ పెండ్యాల సుమన్ ఈరోజు నడికూడ మండల లోని మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా ముఖ్య నాయకుల కమిటీ జిల్లా కార్యదర్శి కోడెపాక భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.దీనికి మాదిగ జర్నలిస్టు ఫోరం స్టేట్ కమిటీ మెంబర్ పెండ్యాల సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మాదిగ జర్నలిస్ట్ ఫోరం ఏ పార్టీకి అనుబంధం కాదని స్వాతంత్ర్య ప్రాతిపత్తి కలిగిన సంఘమని ఇది మాదిగ మాదిగ ఉపకులాల జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడుతుందని అన్నారు అలాగే జర్నలిస్టులందరికీ జర్నలిస్ట్ బందు పేరుతో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ సంఘం డిమాండ్ చేస్తుంది.అలాగే అర్హులైన మాదిగ మాదిగ ఉపకులాల జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తుంది.అలాగే చిన్న పెద్ద పత్రికల తేడా లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకి ప్రభుత్వం కల్పించే అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల పంచాయతీ కార్యదర్శులు గ్రామస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని సోమవారం రోజున ఎంపీడీవో మరియు ఎంపీవో కి వినతి పత్రం అందజేశారు. పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే టార్గెట్లు పెట్టడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని అలాగే ఇతర శాఖల పనులు కూడా తమతో చేపించడం వలన పని భారం పెరిగి పని ఒత్తిడి కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించాలని పై అధికారులకు విన్నవించుకున్నారు.
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలోతెలంగాణ ప్రదాత సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలో డిజె సప్పులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి గ్రామంలో వాడవాడల తిరుగుతూ ప్రముఖుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాల ముందర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు పుట్టినరోజు వేడుకల్లోమండల జిల్లా మహిళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
# వైభవంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పంబా ఆరాట్టు ,జలక్రీడలు
# పంభాఆరట్ మహా అన్నదానదాతగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
# వేలాదిమంది భక్తులు హాజరు..
# అయ్యప్ప శరణుఘోషతో మారుమ్రోగిన నర్సంపేట పరిసర ప్రాంతం
# కేరళ సాంప్రదాయ పద్ధతిలో పంబ ఆరాట్ మహోత్సవం..
#మంగళ నీరాజనాలతో అయ్యప్పస్వామికి మహిళల స్వాగతాలు.
# నర్సంపేట పట్టణం పురవీధుల్లో ఊరేగింపు వేడుక..
#గరుడపక్షి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం.
#మాదన్నపేట సరస్సులో జలక్రీడలు..
# సన్మార్గంలో అయ్యప్పదీక్షా : మాజీ ఎమ్మెల్యే.
నర్సంపేట, నేటిధాత్రి :
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మ శాస్తా అయ్యప్ప స్వామి దేవాలయంలోని మణికంఠుడు ,శ్రీ ధర్మశాస్త అయ్యప్పకు చేసిన పంభాఆరట్,జలక్రీడ వేడుకలు అంబరాన్నంటాయి. కేరళ రాష్ట్రంలోని శబరిమలైలో నిర్వహించే విధంగా అయ్యప్పస్వామికి జలక్రీడలు ఆడించారు.అనంతరం అష్టాభిషేకాలు కన్నుల పండుగగా జరిగాయి. అష్టాభిషేకాలైనా నీరు,తేనె,నెయ్యి, పంచదార, పంచామృతం,జీడిపప్పు ,బాదం, పిస్తా, పాలు, పెరుగు ,విభూది,కుంకుమ,పసుపు చందనం లతోపాటు 24 రకాల అభిషేకాలను వేద పండితులు తాంత్రిక పూజారులు శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకటే శర్మ గురుస్వామి మంత్రోచ్ఛారణలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 24 వ మండల పూజల మహోత్సవాలలో భాగంగా శనివారం మాధన్నపేట సరస్సులో నిర్వహించిన పంభాఆరాట్ మహోత్సవాన్ని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే,మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది సుదర్శన్ రెడ్డి స్వప్న దంపతులు దాతలుగా అంగరంగ వైభవంగా జరిపించారు.శ్రీధర్మ శాస్తా అయ్యప్ప సేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ సింగరకొండ మాధవ శంకర్ గుప్తా అధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షుడు సైపా సురేష్ అధ్యక్షతన కమిటీ సభ్యుల నేతృత్వంలో తాంత్రిక వేత్త, గురుస్వామి,శ్రీమాన్ బ్రహ్మశ్రీ డాక్టర్ వెంకటేష్ శర్మ,ఆలయ ప్రధాన అర్చకులు దేవేష్ మిశ్రాల వేద మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాష్ట్ర మాజీ సివిల్ సప్లై చైర్మన్,బిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు, నరంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి గురుస్వామి వెంకటేష్ శర్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆశీర్వదించారు.అనంతరం గర్భగుడిలోని అయ్యప్ప స్వామి మూలవిరాట్ విగ్రహాన్ని గురుస్వామి వెంకటేష్ శర్మ పంబ ఆరాట్ దాత బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అందించగా తలపై మోస్తూ అలంకరించిన స్వామివారి రథంలో ప్రతిష్టించారు.గురుస్వామి వెంకటేష్ శర్మ తో కలిసి ఎమ్మెల్యే పెద్ది అయ్యప్పస్వామి రథాన్ని ఊరేగింపుగా నడుపుతూ ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలదారులు,భక్తుల నుత్యాలు,మహిళల కోలాటాలు, డీజే చప్పుళ్ళు ఎంతగానో ఆనందింపజేశాయి.కేరళ సాంప్రదాయ డప్పు వాయిద్యాలు,మహిషి రాక్షసితో పాటు వివిధ వేషధారణతో చేసిన నృత్యాలు,సన్నివేశాలు పలువురిని ఆకట్టుకున్నాయి.మాదన్నపేట చెరువు నిర్వహించిన పంభా ఆరాట్ ఉత్సవ వేడుక కన్నుల పండుగగా కొనసాగింది.దేవాలయం నుండి పట్టణ పురవీదుల నుండి మాదన్నపేట చెరువు వరకు సాగిన ఊరేగింపులో ప్రజలు, మహిళలు మంగళహారతులతో నీరాజనాలతో స్వామివారికి స్వాగతం పలికారు. ఊరేగింపు జరుగుతున్న తరుణంలో గరుడపక్షి అయ్యప్ప స్వామి రూపంలో దర్శనం ఇవ్వడంతో భక్తులు అయ్యప్ప నామస్మరణతో తిలకించారు.ఈ నేపథ్యంలో అమెరికా, మలేషియా దేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నల్గొండ వరంగల్ ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 10 వేల మంది భక్తులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప దీక్షా సన్మార్గంలో నడిపిస్తోందని, దీక్ష నియమ నియమాలు ఉన్నతమైనవని అన్నారు.నియోజకవర్గ ప్రజలు అభివృద్దే ముఖ్యమని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభవృద్ధి చెందేలా ప్రాజెక్టులు నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయ్యాయని పాకాల, రంగాయాచెరువు ప్రాజెక్టులతో నర్సంపేట ప్రాంతం అభవృద్ధి చెందనుందని ఆయన పేర్కొన్నారు. మాదన్నపేట చెరువు ఆధ్యాత్మిక ప్రాంతంగా మారిందని ఇటీవల చెరువుకట్టపైన శ్రీ రామలిగేశ్వరస్వామి దేవాలయం పూర్తయ్యి పూజలు జరుగుతున్నాయని పెద్ది పేర్కొన్నారు.ఎలాంటి ఆటంకాలు లేకుండా 21 వ సారి పంబారాట్టు దాత,మహా అన్నదాన దాతగా అవకాశం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
గతంలో నేను మొదటిసారి పంబ ఆటాట్ మహోత్సవంలో పాల్గొన్న క్రమంలో అయ్యప్పస్వామికి గోదావరి జలాలతో. అభిషేకాలు నిర్వహిస్తానని మాట ఇస్తే గురుస్వామి ఆశ్చర్యానికి లోనయ్యారని నేను ఇచ్చిన మాట ప్రకారంగానే గత మూడు సంవత్సరాలుగా గోదారి జలాలతో అయ్యప్ప స్వామికి జల క్రీడల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని టిఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివరించారు. రాబోయే 25వ పంబ ఆరాట్ సిల్వర్ జూబ్లీ మహోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలో లివ్వరబోయే విధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తానని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు.గురుస్వామి వెంకటేష్ శర్మ మాట్లాడుతూ నర్సంపేట అయ్యప్ప దేవాలయ పంభారాట్ మహోత్సవం తెలంగాణ రాష్ట్రంలో తలమానికంగా మారిందన్నారు.మహోత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఏసిపి కిరణ్ కుమార్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో అమెరికా మై టెంపుల్ యాత్ర ప్రతినిధి ఎన్నారై చంద్రశేఖర్,నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, అర్ఎస్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాయిడి రవీందర్ రెడ్డి,కౌన్సిలర్స్ రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి, నాగిశేట్టి పద్మ ప్రసాద్,బాణాల ఇందిర,మల్లీశ్వరి,దేవోజు తిరుమల సదానందం, గందె రజిత చంద్రమౌళి, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనాయణ గౌడ్, మండల శ్రీనివాస్,మాజీ ఎంపిపిలు బానోత్ సారంగపాణి,మోతే కళావతి పద్మనాభరెడ్డి,సుంకరి సంతోష్ రెడ్డి,యూత్ నియోజకవర్గ కన్వీనర్, ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్,బండి రమేష్,బాల్నే వెంకన్న గౌడ్,మండల శ్రీనివాస్,సీఐలు రమణ మూర్తి,రమణ సాయి, ఎస్సైలు అరుణ్ రాజు,రవి కుమార్, ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా,ఉపాధ్యక్షులు ఇరుకు కోటేశ్వరరావు,పబ్బా రమేష్,ఆర్గనైజింగ్ సెక్రటరీలు,శ్రీరాముల శంకరయ్య,చకిలం కృష్ణమూర్తి,తక్కలపల్లి యుగంధర్ రావు,బండారుపల్లి చెంచారావు,పాలకుర్తి శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీలు బొద్దుల దివాకర్,వజినపెళ్లి శ్రీనివాస్,సహాయ కోశాధికారి అనంతుల రామనారాయణ,ముఖ్య సలహాదారులు దేవునూరి అంజయ్య, మాదారపు చంద్రశేఖర్, వంగేటి గోవర్ధన్, శ్రీరాం ఈశ్వరయ్య,దోమకుంట్ల నందయ్య, దుబ్బా రమేష్,బాల్నే సర్వేశం,చింతల నిరంజన్,బాబురావు,భూపతి లక్ష్మీనారాయణలు,ఆకుల ప్రభాకర్,దొడ్డ వేణు,మల్యాల రాజు,సింగిరికొండ వేణుగోపాల్,రావుల సతీష్,పిన్నం రామనాథం,ఇరుకుల వీరలింగం,శ్రీరాముల కార్తీక్,ప్రచార కమిటీ బాధ్యులు భీరం నాగిరెడ్డి,రాజేంద్రప్రసాద్ రెడ్డి,కందుల శ్రీనివాస్ గౌడ్,మల్యాల వినయ్ కుమార్,గురుస్వాములు సంజీవరావు, బొట్ల నాగరాజు,యాదగిరి,అనిల్ మహేంద్ర,రాయసాబ్,అంకూస్ గౌడ్, భరత్ కుమార్,భీరం రవీందర్ రెడ్డి,పుల్లూరి కపిల్ స్వామి గౌడ్,ఆలయ సిబ్బంది దేశి రాము,పోలీస్ శాఖ అధికారులలతో పాటు ప్రజా ప్రతినిధులు,భక్తులు తదతరులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో సోమవారం పర్వదినం సందర్భంగా రేగొండ టీఎస్ ఎస్ పి రిజర్వు ఇన్స్ పెక్టర్ కుమ్మరి చంద్రన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి రుద్రాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగరాజు చంద్రన్నకు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేసి కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. గోశాల గోమాతలకు దానా బస్తాలను అందజేసిన రిజర్వ్ ఇన్స్ పెక్టర్ చంద్రన్నకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
గణపురం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్
గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ 78వ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేపాక రాజేందర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ కి భారత ప్రధాని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ తృణప్రాయంగా భావించి త్యాగం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. యూపీఏ అధికారంలో ఉన్న కాలంలో చైర్పర్సన్ గా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. గ్రామీణ పేద ప్రజలకు ఉపాధి అందించాలని ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ పథకం,ఆకలి చావుల నివారణకు ఆహార భద్రత చట్టం,ప్రజలకు ప్రభుత్వాల మధ్య పారదర్శకత జవాబుదారితనం కోసం సమాచార హక్కు చట్టం,తీసుకొచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కటుకూరి శ్రీనివాస్ మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఎండి.చోటమియా,మాజీ జెడ్పిటిసి ముత్యాల రాజయ్య,మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ,మండల అధికార ప్రతినిధి మామిళ్ల మల్లికార్జున్,మండల యూత్ అధ్యక్షులు పెండ్యాల వెంకటేష్ ముదిరాజ్,సీనియర్ నాయకులు ఓల్లాల సుదర్శన్,గంగాధర్ రావు,నేరెళ్ల రాజు,మార్క కుమార్,పోషాల మహేష్, సీనియర్ నాయకులు ఆలూరి మొగిలి పసునూటి శంకర్, మైనార్టీ సెల్ నాయకులు ఎస్కే జానీ యూత్ నాయకులు పాష,సమీర్,ఆదిల్, ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మొగుళ్ళపల్లి డిసెంబర్ : నేటి ధాత్రి మండలంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆకుతోట కుమారస్వామి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా . కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. అనంతరం జిల్లా నాయకులు ఏలేటి శివారెడ్డి మాట్లాడుతూ ఆనాడూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోని సిరిసంపదలు. ఖనిజ సంపదలు అన్ని ఉన్నా. అన్ని సంపదలను దోచుకెళ్లి ఆంధ్రను అభివృద్ధి చేసుకున్నారే తప్పా. తెలంగాణను పట్టిచుకున్న పాపానపోలేదని. తెలంగాణకు జరుగుతున్న అన్యాన్ని గర్తించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అమరుల త్యాగాలను మరువకుండా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకోలేమని కోట్ల జనాభా ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీనీ తెలంగాణ ప్రజలు ఎన్నడూ మర్చిపోలేరని అయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఎం సి వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ రఫీ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము పట్టణ అధ్యక్షులు క్యాతరాజు రమేష్,.బొల్లపెల్లి రాములు, మధుకర్ రెడ్డి,రక్తాని గోపాల్ రావు నాయకులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లో రాష్ట్ర ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న సీఎం కప్ 2024 గ్రామ, మండల, జిల్లా స్థాయి పోటీలను మంగళవారం నుండి మండల స్థాయి పరిధిలో క్రీడలను ప్రారంభించడం జరుగుతుందని ఎంపీడీవో ఎల్ భాస్కర్ తెలియజేశారు. ఈ క్రీడా పోటీలు ఆసక్తి కలిగిన క్రీడాకారులు పాల్గొని కబడ్డీ, కోకో, వాలీబాల్ ఆటలకు హాజరు కావాలన్నారు. ఎంపీడీవో ఎల్ భాస్కర్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుతోపాటు ఆటల లో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉండి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులు గ్రామస్థాయి నుంచి, మండల స్థాయి, జిల్లా స్థాయి రాష్ట్రస్థాయికి ఎంపిక కావాలని వారన్నారు. క్రీడాకారులు మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయిలో పాల్గొంటారని క్రీడల నిర్వహణ అధికారి అన్నారు.
ఫోర్త్ స్టేట్ లెవెల్ ఓపెన్ టు ఆల్ కరాటే మరియు కుంగ్ ఫు ఛాంపియన్ షిప్ 2024 వలో సిసిసి నస్పూర్ కి చెందిన విద్యార్థిని కె.శివనషా బ్రౌన్ అండ్ బ్లాక్ బెల్ట్ స్పారింగ్ విభాగం లో ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్నట్లు కరాటే మాస్టర్ పోచంపల్లి వెంకటేష్ తెలిపారు.
టేకుమట్ల మండలంలోని సోమనపల్లి గ్రామానికి చెందిన మారేపల్లి పోచమ్మ. పరమదించి.. 9వ రోజు అయినది.. ఈ సందర్భంగా వాళ్ల కుమారుడైన మారపల్లి రాజుకు అండగా ఉంటానని మనోధైర్యాన్ని కల్పించి లాస్ట్ రోజుకు 50 కిలోల బియ్యం అందజేసిన ఎం ఆర్ పి ఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ మాదిగ. జిల్లా నాయకులు. నోముల శ్రీనివాస్ మాదిగ ఎర్ర ఆదిత్య మాదిగ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు రోంటల సంపత్ అకేనపల్లి ఎంపీటీసీ రామ్ రామ్ చందర్ మాదిగ ఎం ఎస్ పి. మండల అధ్యక్షులు పార్నంది బిక్షపతి మాదిగ ఎమ్మెస్పీ మండల ఉపాధ్యక్షులు బోయిని కిష్టయ్య వక్కల భద్రయ్య సంయుక్త కార్యదర్శిఎం ఆర్ పి ఎస్ మండల అధ్యక్షులు రేణి కుంట్ల శంకర్ ఇల్లంల శంకర్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్మెస్ ఎఫ్ మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు గంధం రాజ శంకర్ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీసు కవాతు మైదానంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల సహకారం మరియు విశ్వాసం ద్వారానే పోలీసు శాఖ సమర్థంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు పోలీస్ శాఖను దగ్గర చేయడం, వారి సమస్యలను నేరుగా వినడం, మరియు పోలీసుల కృషిని ప్రజలకు చూపించడమే మా ఉద్దేశ్యం అని ప్రజలను తెలుపుతూ శాంతి భద్రతలకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా పోలీసు శాఖలో వినియోగంలో ఉన్న ఆధునిక ఆయుధాలు, ఎక్స్‌ప్లోసివ్ డిటెక్టివ్ పరికరాలు, కమ్యూనికేషన్ డివైజ్‌లు, క్లూస్ టీం పరికరాలు, సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రదర్శన, పోలీసు శునక దళం (డాగ్ స్క్వాడ్) ప్రదర్శన, ట్రాఫిక్ నియంత్రణ పద్ధతులు, నేర అన్వేషణలో ఉపయోగించే ఆధునిక పరికరాలు వంటి అంశాలు కార్యక్రమంలో ప్రదర్శించబడ్డాయి. విద్యార్థులు పోలీస్ శాఖకు సంబంధించిన వివరణలను ఆసక్తిగా చూసి, అనేక ప్రశ్నలు అడిగి సమాచారం పొందారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ రాములు, ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్ స్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్ బీ డీఎస్ స్పీ రమణా రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్ స్పీ సుదర్శన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గోపాల్, 1 టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ అహ్మద్, ఉమెన్ పీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఆర్ ఐ లు కృష్ణయ్య, నగేష్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
టీ గ్లాస్ లతో సమగ్ర శిక్షా’ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన
భూపాలపల్లి నేటిధాత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాయ్ తాగి తమ సమస్యలు పరిష్కరించాలని సమగ్ర శిక్షా కాంట్రాక్టు ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు టీ కప్పులతో నిరసన తెలిపారు. సోమవారం 3వ రోజు నిరసన దీక్షలు కొనసాగాయి. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్,ఉపాధ్యక్షులు చిట్యాల శ్రీనివాస్, డి వై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి ఆత్కూరి శ్రీకాంత్ దీక్షలకు సంఘీభావం తెలిపి, మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లుగా శ్రమదోపికి గురైన సమగ్ర శిక్షా ఉద్యోగులను క్రమబద్ధీక రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘము రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కంకల రాజయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎం.డీ చాంద్ పాషా, తోకల వేణు, మహిళా అధ్యక్షురాలు చల్ల సునీత మాట్లాడుతూ గత ఏడాది వరంగల్లో చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించారని గుర్తుచేశారు. టీ తాగే సమయంలో తమ సమస్యలు పరిష్కరించవచ్చని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. గత 18 సంవత్సరాలుగా సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. .ఈ అసెంబ్లీ సమావేశాల్లోపు తమ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించారు. అందరికీ జీవిత, ఆరోగ్య బీమా సదుపాయాలు కల్పించాలన్నారు. ఉద్యోగ విరమణ చేసేవారికి రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘము భాద్యులు మారం మహేందర్ రెడ్డి, సుదర్శన్, హేమ, నరేష్ కుమార్, రాజు, తిరుపతి, మల్లికార్జున్, శ్రీనివాస్, హరీష్, కుమార్, శశికల, శ్రీవాణి, సృజన తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అన్ని శాఖల జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించడంపై దృష్టి సారించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి వచ్చిన 25 దరఖాస్తులను స్వీకరించి పరిష్కరానికి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం చాలా ముఖ్యమని, ప్రతి శాఖలో ప్రత్యేక నోడల్ అధికారిని నియమించి, సమస్యల పరిష్కారానికి సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల పరిష్కారం తర్వాత దరఖాస్తుదారునికి సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తులు పరిష్కరించిన వెంటనే ప్రజావాణి వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డిఓ మంగిలాల్, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.