సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమం.

విజేతలకు బహుమతులు అందజేసిన మధు వంశీకృష్ణ.

చిట్యాల,నేటిధాత్రి :

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధువంశీకృష్ణ అన్నారు,చిట్యాల మండల స్థాయి క్రీడలు మండల క్రీడల కన్వీనర్ ఎంపీడీవో జయశ్రీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన క్రీడల పోటీలు చివరి రోజు ఘనంగా ముగిశాయి అని తెలిపారు, ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా స్పెషల్ ఆఫీసర్ చిన్నయ్య డివైఎస్ఓ చిర్రా రఘు హాజరైనారు ఈ క్రీడలకు 250 మంది క్రీడాకారులు హాజరైనారని వారికి భోజన వసతి మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి ఏర్పాటు చేశారని క్రీడల సమన్వయకర్త సూధం సాంబమూర్తి తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు క్రీడల్లో గెలుపొందిన వారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధువంశీకృష్ణ బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కోడెపాక రఘుపతి ఎంపీ ఓ రామకృష్ణ టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్. దబ్బెట్ట అనిల్. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రాయకోమురు మాజీ కోఆప్షన్ సభ్యులు రాజ్ మహమ్మద్ ఏబీవీపీ నాయకులు వేల్పుల రాజకుమార్. కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు అల్లగొండ కుమార్ . కట్కూరి నరేందర్ గుమ్మడి సత్యం .బుర్ర శ్రీనివాస్. గంగాధర్ రాజు. గంగాధరి రవీందర్ .ఫిజికల్ డైరెక్టర్లు బండి ప్రసాద్. సరూప .రాణి .నూకల లింగయ్య .గాజర్ల శ్రీనివాస్. ఉమా. వెన్నెల .శారద. చల్ల శ్రీనివాస్. రెడ్డి గ్రామ కార్యదర్శి రవికుమార్. తదితరులు పాల్గొన్నారు

జాతీయస్థాయి జూడో పోటీలలో పతకాలు.

అభినందించిన భారత జూడో సమైక్య కోశాధికారి కైలాష్ యాదవ్.

గురుకుల పాఠశాలలను ప్రపంచానికి చాటాలి.

కోచ్ రాము చెరువుతోనే పథకం సాధ్యమైంది.

కోచ్, ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారుడు టి.జంపయ్య.

కాశిబుగ్గ నేటిధాత్రి.

.పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా ప్రాంతంలో జరిరుతున్న 68వ పాఠశాల (యస్. జీ. ఎఫ్. ఐ.) జాతీయ స్థాయి అండర్ 19సం.. ల బాల బాలిక జూడో ఛాంపియన్ షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరకాలలో 10వ తరగతి చదువుతున్న నిరుపేద కుటుంబానికి చెందిన క్రీడాకారుడు డి.జంపయ్య జాతీయ స్థాయి జూడో పోటీలలో 50 కిలోల విభాగంలో వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలుపొంది, పంజాబ్ క్రీడాకారుడితో ఐదవ మ్యాచ్ లో ఓటమిపాలై, కాంస్య పతాకం కోసం జరిగే పోరులో జమ్ము-కాశ్మీర్ క్రీడాకారుడితో తలపడిన జంపయ్య హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో గెలుపొందడం జరిగింది.తెలంగాణ రాష్ట్రం తరఫున జంపయ్య 50కిలోల విభాగంలో కాంస్య పతకం (బ్రోన్జ్ మెడల్) సాధించడం జరిగింది.అనంతరం క్రీడాకారుడు జంపయ్య మాట్లాడుతూ అక్కడే ఉన్న తన కోచ్ రామును హత్తుకొని కన్నీటీ పర్యతరం చెంది ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న తనను, నిరుపేద కుటుంబానికి చెందిన నన్ను ఈ రోజు దేశానికి పరిచయం చేసి జూడో క్రీడలలో నాలాంటి పేదరికంలో ఉన్న క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ పాఠశాలలో అవకాశం రావడం అని సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.మంచి పోష్టిక ఆహారంతో పాటు, క్రీడలలో మెరుగైన శిక్షణ ఇప్పిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరియు మా తెలంగాణ రాష్ట్ర సాంఘీక సంక్షేమ పాఠశాల రాష్ట్ర కార్యదర్శి అలుగు వర్షిణీ మేడమ్ కు కన్నీటీ ఆనందబాష్పాలు మధ్య కృతజ్ఞతలు తెలిపారు.
పథకాలు సాధించిన క్రీడాకారుడిని మరియు కోచ్ చందనగిరి రాము ను ఫోన్ ద్వారా భారత జూడో సమైక్య కోశాధికారి బైరబోయిన కైలాష్ యాదవ్,మహబూబాబాద్ జిల్లా పాఠశాలల క్రీడా కార్యదర్శి సత్యనారాయణ తెలంగాణ జూడో అసోసియేషన్ & ఉమ్మడి వరంగల్ జిల్లా సంఘం కార్యవర్గ సభ్యులు దుపాకి సంతోష్ కుమార్,తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల పరకాల ప్రిన్సిపాల్ సమ్మయ్య,పిడి వెంకటేశ్వర్లు, విజయ్ జూడో అకాడమీ ప్రిన్సిపాల్ బాలస్వామి,పీడీ హరికిషన్, పి.ఈ.టీ రమేష్ మరియు తెలంగాణ జూడో సంఘం బాధ్యులు,కోచ్ లు, జూడో సీనియర్ క్రీడాకారులు, క్రీడా అభిమానులు ఫోన్ ద్వారా క్రీడాకారులకు మరియు కోచ్ చందనగిరి రాము కు అభినందనలు,ఆశీస్సులు అందజేశారు.

పెంబర్తి లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హసన్ పర్తి, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఇంటి ఇంటి సర్వే లో బాగంగా ఈ రోజు పెంబర్తి గ్రామంలో అకస్మాత్తుగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు లబ్దిదారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఇంటి స్థలం ఉండి ఇల్లులేకుండా ఉన్నారో వారికి మొదటి ప్రాధాన్యతగా ఇండ్లు మంజూరీ వస్తుంది, ఇంటి స్థలం లేని వారికి రెండవ దశ మంజూరి అవుతవి అని అన్నారు, హాసన్ పర్తి ఎంపిడిఓ జె ప్రవీణ్ కుమార్,ఎంపీఓ కట్ల కరుణాకర్ రెడ్డి,తహసీల్దార్ చల్ల ప్రసాద్ ,హౌజింగ్ ఇఇ రాజేందర్ ,ఇందిరమ్మ ఇండ్ల కమిటి సభ్యులు చైర్మన్ నాగవల్లి శ్రీనివాస్ (ప్రత్యేక అధికారి) కమిటి సభ్యులు జోరుక పూల,తాళ్లపెల్లి రమాదేవి- రమేష్,గోపాల్,కొయ్యడ సునీల్,సౌరం సుధాకర్,కన్వీనర్ పరకాల హేమలత (పంచాయతీ కార్యదర్శి),కారోబార్ చాతల్ల సదానందం ఇందిరమ్మ ఇండ్ల ఇంటి ఇంటి కి వెళ్ళి వారి వివరాలు ఫోన్ ఆప్ లో నమోదు చేసుకొని,సర్వే చేస్తున్నారు,గ్రామస్థులు పాల్గొన్నారు.

శ్రీమార్కండేయ స్వామి మాలాధారణ దీక్షలు

కరీంనగర్, నేటిధాత్రి:

మార్కండేయ స్వామి ఉద్భవించి ఏకోత్తర శత మార్కండేయులుగా వెలసి భావనా మహాఋషికి జీవం పోసి అయన ద్వారా ముక్కోటి దేవతలకు మాట రక్షణకై వారికి తగురీతి వస్త్రాలర్పించి గరుడ, గంధర్వయుని గణములు అనేకులు వరాలందించిన మూల పురుషుల చరిత్ర మనదని, మన జాతి సమైక్యతకై ప్రేమామరాగాలు వెదజల్లుటకై సనాతన ధర్మ రక్షణకై శ్రీమార్కండేయ స్వామి దీక్షలు వహించుటకై మాలాధారణ చేయవలయునవి మన పెద్దల సంకల్పమని, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసంవత్సరము కూడా జనవరి 20న మార్కండేయ మాలాదారణ దీక్షలు ప్రారంభమవుతున్నాయని పద్మకుల రత్న చిలుక నరసప్ప పద్మశాలి గురుస్వామి తెలియజేశారు. ఈదీక్షలు మాఘ శుద్ధ తదియ శ్రీమార్కండేయ స్వామి జన్మదినము 1-2-2025 వరకు జరుగునని, ఈదీక్షలు లోక కళ్యాణార్ధమై ప్రపంచశాంతి కోరుతూ సమస్త మానవాళి, సర్వప్రాణులు, సుఖశాంతులతో పాడి పంటలతో భారతదేశం సుబిక్షంగా వుండాలని సనాతన దర్శరక్షణకై మాలాధారణ దీక్షలు చేయాలని, పంచపాండవులు అరణ్యవాస సమయంలో శ్రీమార్కండేయ మాలాధారణ దీక్షలు చేశారని, మరి ఎంతో మంది దేవి, దేవతలు, ఋషులు ఆచరించినటువంటి ఈదీక్షలు చిరంజీవి శ్రీమార్కండేయ స్వామి లోక కళ్యాణార్థమై ఎన్నో మహాయజ్ఞములు చేసెనని, శ్రీమార్కండేయ స్వామి మాలాధారణ జనవరి 20-12-2024 నుండి శ్రీ మార్కండేయ జన్మదినము 1- 2-2025 వరకు, వయస్సు, లింగ బేధం లేకుండా నలబై ఒకటి రోజులు మండలం, ముప్పై ఒకటి, ఇరవై ఒకటి, పదకోండు రోజుల దీక్ష వలన సంపూర్ణ ఆరోగ్యము, వ్యాపార అభివృద్ధి, ఉన్నత విద్య అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉపాధి అవకాశములు లభిస్తాయని, అర్థమాశని, అష్టమ శని, ఆపద మృత్యుదోషము, గ్రహబాధలు, రాహుకేతుల దోషము, కలహములు తొలిగిపోవునని, స్త్రీలు సంపూర్ణ సౌభాగ్యవతిగా, పిల్లలకు సంపూర్ణమైన ఉన్నత విద్య కలుగునని, ఈదీక్షలు కరీంనగర్ జిల్లా మాండవ్య నది తీరమున శివభక్త మార్కండేయ దేవాలయములో స్వీకరించవచ్చునని లేని యెడల దూర ప్రాంతాల వారు మీగ్రామాలలో జిల్లాలో ఏచోట మార్కండేయ దేవాలయంలో మార్కండేయ మాలాధారణ చేయవచ్చునని, లేని యెడల భావనఋషి భద్రావతి దేవాలయంలో కాని శివలింగం ఏచోట వుండునో అచ్చట మాలాధారణ దీక్ష ప్రారంభించవచ్చునని, దీక్షా సమయంలో స్త్రీలు, పురుషులు పసుపు వస్త్రములు ధరిచవలయునని, ఈదీక్షలు తల్లిదండ్రులు చేతగాని, పద్మబ్రాహ్మణ పౌరోహితుల చేతగాని దేవాలయములోని అర్థకుల చేతగాని, గురుస్వాముల చేతగాని మాలాధారణ దీక్షలు చేయగలరని, మాలాధారణ మూలమంత్రము (శ్రీ మార్కండేయ నమః) అని జంపించవలయునని, దీక్ష సమయంలో తల్లిదండ్రులను, అత్తమామాలను, గురువులను దర్శించుకోవలెనని, ఈదీక్ష విరమణ స్థలము కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, మాండవ్యునది తీరమున శివభక్త మార్కండేయ స్వామి దేవాలయ అంతర్జాతీయ శ్రీమార్కండేయ స్వామి ఆశ్రమ పీఠం మాలాధారణ ప్రాంగణములో దీక్షల విరమణ చేయవలయునని లేనియెడల దీక్షా విరమణ కాళేశ్వరము, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కోటి లింగాలు, యాదాద్రి యాదగిరి గుట్ట, కొమురవెల్లి, భద్రాచలం, జోగులాంబ, అనంతగిరి, విజయవాడ, రాజోలి (జహారాబాద్), రామప్ప (వరంగల్), సమ్మక్క- సారలమ్మ (మేడారం), వెయ్యి స్థంభాలు, జైనథ్ శ్రీలక్ష్మీనారయణ స్వామి ఆలయం, వివిధ ప్రాంతాలలో వున్న పుణ్య నదులలో స్నానమాచరించి దీక్షా విరమణ చేయగలరని మాలధారణ దీక్షా పూర్తి వివరాలకు చిలుక నర్సప్ప పద్మశాలి గురుస్వామి మార్గదర్శకులు సెల్ (వాట్సవ్) 9059671181ను సంప్రదించగలరని చిలుక నర్సప్ప ఒక ప్రకటనలో తెలియజేశారు.

శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే

– సర్వే అధికారులకు ప్రజలు సహకరించాలి….

– సర్వే ను పరిశీలించిన తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్….

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :-

మెదక్ జిల్లా చేగుంట మండల పరిదిలోని చందాయిపేట గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే శరవేగంగా కొనసాగుతుందని తాజా మాజీ గ్రామ సర్పంచ్ బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ తెలిపారు. శుక్రవారం చందాయిపేటలో ఇందిరమ్మ గ్రామ కార్యదర్శి రాధా తో కలిసి ఇండ్ల సర్వే సర్వేయర్లు యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్ల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని యాప్ లో ఏమైనా సమస్యలు ఏర్పడినట్లైతే సంబంధిత అధికారులను సంప్రదించి సమస్యలను నివృత్తి చేసుకొని ఇందిరమ్మ కమిటీలకు సమాచారం అందించి సర్వే నిర్వహించాలన్నారు. గ్రామం లో సొంతింటి కల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుపేదల్లో ఆశలు చిగురిస్తున్నాయన్నారు. సర్వే నిర్వహణకు వచ్చిన సర్వేయర్లకు ప్రజలు సంబంధిత పత్రాలు అందించి సహకరించాలన్నారు. క్షేత్రస్థాయిలో అసలైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్, కార్యదర్శి రాధా,కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మొజామిల్, గ్రామ సినియర్ నాయకులు బైండ్ల శివరాజయ్యా, బాసరాజు, దండు మహేష్, సాయిబాబా, ఎరుకల రాజు, ఎరుకల బిక్షపతి, మహేష్ తదితరులు పాల్గొన్నారు..

నూతన పలకవర్గాన్ని సన్మానించిన ప్రముఖులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ ఆవరణలో నూతన పాలకవర్గాన్ని సన్మానించిన కూర అంజిరెడ్డి.పూర్మాని. లింగారెడ్డి.SSC.. కేబుల్ యాజమాన్యం. మేనేజర్ ప్రశాంత్ . అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించి ఫోటో అందజేశారు అలాగే ద్వారక ఫర్నిచర్ వారి ఆధ్వర్యంలో పాలకవర్గాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులను దండలు శాలువాలతో సన్మానించారుఈ సందర్భంగా అధ్యక్షులు ప్రణయ్ మాట్లాడుతూ నూతన పాలకవర్గాన్ని ప్రత్యేకంగా సన్మానించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మండల లో ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చిన మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత వారితో మాట్లాడి సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటామని తెలియజేస్తూ అధ్యక్షులుగా ప్రణయ్ ఉపాధ్యక్షులుగా కంకణాల రాజేష్ ప్రధాన కార్యదర్శిగా.బర్ల బాలు కోశాధికారిగా కలకుంట్ల శ్రీనాథరావు సహాయ కార్యదర్శిగా దాసరి పరుశురాములు సాంస్కృతి కార్యదర్శిగా బర్ల ఏ స్పాల క్లబ్ సభ్యులు నుతదితరులను ప్రత్యేకంగా సన్మానించారు

పుష్ప అరెస్ట్ పై కేటీఆర్ రియాక్షన్

అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ లీడర్ కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. జాతీయ పురస్కారం అందుకున్న స్టార్‌ అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అని కేటీఆర్‌ విమర్శించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్‌ను.. సాధారణ నేరస్తుడిగా ట్రీట్‌ చేయడం సరికాదని తెలిపారు. ప్రభుత్వ తీవ్రచర్యను ఖండిస్తున్నాను. హైడ్రా కూల్చివేతలతో ఇద్దరి చావుకు బాధ్యుడైన రేవంత్‌రెడ్డిని కూడా ఇదే లాజిక్‌తో అరెస్ట్‌ ఎందుకు చేయరని కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

మరోవైపు అల్లు అర్జున్‌పై BNS 118 (1), BNS 105 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్‌పై 105 సెక్షన్ కింద నాన్‌బెయిలబుల్ కేసు నమోదు కాగా.. నేరం రుజువైతే 105 సెక్షన్ కింద 5 నుంచి పదేళ్లు జైలుశిక్షపడే అవకాశం ఉంది. అటు BNS 118 (1) కింద ఏడాది నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం కాగా.. సెక్షన్‌ 105 ప్రకారం ఒక వ్యక్తి మరణానికి పరోక్షంగా కారణమైతే.. 5 నుంచి 10 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ఇక 118(1) కింద ఉద్దేశపూర్వకంగా వ్యక్తిని గాయపరిస్తే 3 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది.

గేమ్ ఛేంజర్ చెస్‌ ప్రపంచ సింహాసనంపై గుకేశ్‌! 

భారత్‌లో పుట్టి విశ్వవ్యాప్తమైన చదరంగానికి అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉంది. అందుకే దాదాపుగా ఈ క్రీడలో విదేశీ ప్లేయర్లదే ఆధిపత్యంగా సాగింది. అమెరికా, రష్యా, నార్వే లాంటి దేశాల ఆటగాళ్లు ప్రపంచ టైటిళ్లను తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ మన దగ్గర విశ్వనాథన్‌ ఆనంద్‌ మాత్రమే విశ్వ విజేతగా నిలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సార్లు ప్రపంచ చెస్‌ పీఠాన్ని అధిరోహించాడీ ఛాంపియన్. 2000లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌ అయిన ఆనంద్‌, చివరగా 2012లో ఆ హోదాలో కొనసాగాడు. అయితే 2013లో కార్ల్‌సన్‌ చేతిలో ఓటమిని చవి చూశాడు. అప్పటి నుంచి భారత్‌ నుంచి మరో ప్రపంచ ఛాంపియన్‌ కోసం దేశం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉంది. అయితే ఇప్పుడా నిరీక్షణకు ముగింపు పలుకుతూ విషీ క్రీడా వారసుడు గుకేశ్‌ మరోసారి ప్రపంచ చెస్‌లో భారత ఆధిపత్యాన్ని చాటి మన్ననలు పొందుతున్నాడు.

2024 ఫిడే చెస్ ఛాంపియన్​షిప్​లో యంగ్ ప్లేయర్ గుకేశ్ ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. తాజాగా జరిగిన చివరి సమ్మిట్ గేమ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు. ఈ క్రమంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్​గా గుకేశ్​ చరిత్రకెక్కాడు.

క్లాసికల్ ఫార్మాట్ లో డిఫెండింగ్ చాంపియన్, చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ తో జరిగిన 14గేమ్ ల పోరులో గుకేశ్ 7.5-6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 13 గేమ్ లు ముగిసేసరికి గుకేశ్, లిరెన్ 6.5-6.5 పాయింట్లతో సమంగా ఉండగా నిర్ణయాత్మక చివరి పోరులో గుకేశ్ తన సత్తానుచాటి ప్రపంచ విజేతగా నిలిచాడు.

క్లాసికల్ చెస్ లో రికార్డులన్నీ బద్దలుకొట్టి అతిపిన్న వయస్సులో గుకేశ్ చాంపియన్ గా నిలిచాడు. విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ కు ట్రోఫీతో పాటు రూ.11.45 కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది. రన్నరప్ లిరెన్ రూ.9.75 కోట్లు గెలుచుకున్నాడు. ఈ ఛాంపియన్ షిప్ ఫ్రైజ్ మనీ మొత్తం రూ.21.17 కోట్లు. అయితే, ఒక గేమ్ గెలిచిన ప్లేయర్ కు రూ.1.69 కోట్లు లభిస్తాయి. మూడు గేమ్ లు నెగ్గిన గుకేశ్ కు రూ.5.07 కోట్లు. రెండు గెలిచిన లిరెన్ కు రూ.3.38కోట్లు దక్కాయి. మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచారు.

రెడ్ క్రాస్” ఆధ్వర్యంలో ఘనంగా “పెద్ది వెంకటనారాయణ గౌడ్” పుట్టినరోజు వేడుకలు

పుట్టినరోజు సందర్భంగా పలు సేవా చేపట్టిన “పెద్ది”

పెద్ది వెంకటనారాయణ గౌడ్ సేవలు చిరస్మరణీయం. డాక్టర్ విజయ చందర్ రెడ్డి

కుట్టుమిషన్లు అందుకోవడం సంతోషకరంగా ఉంది టైలరింగ్ పూర్తి అయిన మహిళలు

“పెద్ది” సేవలు ఇలానే కొనసాగాలి రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు

“నేటిధాత్రి” హనుమకొండ

హనుమకొండ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ “పెద్ది వెంకటనారాయణ గౌడ్” పుట్టినరోజు వేడుకలు గురువారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ కాన్ఫరెన్స్ హాల్లో “రెడ్ క్రాస్” సిబ్బంది సమక్షంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ముందుగా “రెడ్ క్రాస్” సొసైటీ చైర్మన్ డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు పుష్పగుచ్చం అందజేసి శాలువతో సన్మానించారు అనంతరం రెడ్ క్రాస్ సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి, “పెద్ది వెంకటనారాయణ గౌడ్” నీ శాలువతో సన్మానించి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ వైస్ చైర్మన్ “పెద్ది వెంకటనారాయణ గౌడ్” రైస్ మిల్ యజమానిగా ఉంటూ తన భార్య పేరు మీద స్వచ్ఛంద సంస్థ స్థాపించి మహిళలకు కుట్టు మిషన్లు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, బెంచీలు, ఆట వస్తువులు ఉచితంగా అందజేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటారు అని అన్నారు.

ఈ సందర్భంగా హనుమకొండ “రెడ్ క్రాస్” టైలర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు అదే విధంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల సమక్షంలో డ్రా పద్ధతి ద్వార శిక్షణ పూర్తి చేసుకున్న ముగ్గురికి “రెడ్ క్రాస్” చైర్మన్, పాలకవర్గం ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు.

ఈ కార్యక్రమంలో కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, చెన్నమనేని జయశ్రీ, టైలరింగ్ ట్రైనర్ విజయ, రెడ్ క్రాస్ సిబ్బంది టైలరింగ్ నేర్చుకుంటున్న మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈనెల 14న గురుకుల హాస్టళ్ల లో ప్రత్యేక కార్యక్రమం

హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య

హనుమకొండ, నేటిధాత్రి :

హనుమకొండ: హనుమకొండ జిల్లాలోని అన్ని గురుకుల హాస్టళ్లలో ఈనెల 14వ తేదీన ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య తెలిపారు.
గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గురుకుల హాస్టల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలఫై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థులకు 40 శాతం డైట్ చార్జీలను పెంచిందన్నారు. అదేవిధంగా 16 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కాస్మోటిక్ చార్జీలను 200% పెంచిందని పేర్కొన్నారు. గురుకుల విద్యార్థుల కోసం పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అంతర్జాతీయ విద్య ప్రమాణాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. గురుకుల హాస్టల్ విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందిస్తుందన్నారు. ఈనెల 14వ తేదీ నుండి అమలయ్యే నూతన డైట్, కాస్మోటిక్ చార్జీల ఫై జిల్లాలోని ప్రతి గురుకుల హాస్టల్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, మండల స్థాయి అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. సంబంధిత గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యేలా చూడాలన్నారు. పెంచిన డైట్, కాస్మోటిక్ చార్జీల వివరాలను తెలిపేలా బ్యానర్లను ప్రతి గురుకుల హాస్టల్ లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గురుకుల విద్యాసంస్థ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని తప్పనిసరిగా అందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, డీఈవో వాసంతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

నూతన ఏసీపీని కలిసిన పరకాల మున్సిపల్ చైర్మన్

పరకాల నేటిధాత్రి
పరకాల ఏసిపిగా నూతనంగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చిర్ర సతీష్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ పసుల లావణ్య రమేష్,ఏకు రాజు, నాయకులు మునిగంటి విష్ణువర్ధన్ లు పాల్గొన్నారు.

అప్పు చేసి పప్పు కూడు…అధికారుల తీరు చూడు!

-అప్పులే ఇష్టం… వసూళ్లు కష్టం!!

-మిల్లర్ల సొమ్ము దిగమింగుతాం…

-ప్రభుత్వానికి అప్పులే దిక్కంటాం..

-రైతు భరోసా కు పదివేల కోట్లు అప్పు.

-కోకాపేట రాయదుర్గం 400 ఎకరాలు ఐసిఐసిఐకి తనకా.

-ఆడిటింగ్‌ పూర్తి చేసి ఆర్బిఐ ని ఒప్పించే పనిలో టీజీఐఐసి.

-ఈ నెలాఖరుకల్లా రుణం మంజూరు?

-ఈ ఏడాది 7,000 మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ.

-వారికి 2000 కోట్లకు పైగా చెల్లింపులు.

-9.6% వార్షిక వడ్డీతో పదివేల కోట్లు అప్పు ఇవ్వడానికి ముందుకొచ్చిన ఐసిఐసిఐ.

-రైస్‌ మిల్లర్ల బకాయిలు వసూలో అధికారుల నిర్లక్ష్యం?

-సివిల్‌ సప్లయ్‌ శాఖలో మిల్లర్ల 26 వేల కోట్లు బకాయిలు

-టెండర్‌ ప్యాడి డబ్బులు సకాలంలో వసూలు చేసినా2000 కోట్లు వచ్చేవి.

-టెండర్‌ ప్యాడి కాంట్రాక్టర్లకు సమయం ఎందుకు?

-ప్రభుత్వ ఆస్తులు తనకా తప్ప, మిల్లర్ల నుంచి వసూలు చేయరా?

-విజిలెన్స్‌ రిపోర్ట్‌ చెత్తబుట్టకు చేరింది?

-మిల్లర్లు అధికారులకు కల్పతరువులా?

-అందుకే బకాయి దారుల నుంచి వసూలు చేయడం లేదా?

-అవినీతి అధికారుల మీద చర్యలు లేవు?

-ఎన్నేళ్లు గడిచినా బకాయిలు వసూలు కావు?

`సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలో నీ నేరేడుచర్ల మండలం తిరుమల రైస్‌ కార్పొరేషన్‌ (దర్శించర్ల) మిల్లు యజమాని పేరు ‘‘జి.రాజేష్‌’’ జరిమానా తో బకాయి..107,16,90,801/-

`సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గడ్డిపల్లి లోని ‘‘సంతోషి మా ప్యారాబాయిల్డ్‌ మోడ్రన్‌ రైస్‌ మిల్లు’’మిల్లు యజమాని పేరు ‘‘జి వెంకటేశ్వర్లు’’ బకాయి జరిమానా తో కలిపి 110,39,96,525/-

`‘‘సివిల్‌ సప్లై అధికారుల అవినీతికి తార్కాణం?..ఈ ఇద్దరు మిల్లర్ల బకాయిలే 217.50 కోట్లు

మిగతా బకాయి దారులు 1175 మంది ఉన్నారు

` ఇప్పటివరకు రైస్‌ మిల్లర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు 26 వేల కోట్ల పైచిలుకు మాటే

త్వరలో మరికొందరి బకాయిల మిల్లర్ల వివరాలు మీ ‘‘నేటిధాత్రి’’లో అంకెలతో సహా..

అప్పు చేసి పప్పు కూడు సామెత మన పాలకులకు బాగా అబ్బినట్టుంది. అచ్చొచ్చినట్లుంది. అది ఏ పాలకులైనా సరే..గత పాలకులైనా, ఇప్పటి పాలకులైనా నడిచే దారి ఒకటే. ఎంచుకునే మార్గం ఒకటే..అప్పు. అప్పు లేనిదే పూట గడవకుండా పోతోంది. అందుకే అన్నింటికీ సర్వరోగ నివారణి అప్పు. అది తప్ప మరో దారి లేదు. అయితే భూములు అమ్మాలి. లేకుంటే ఆస్ధులు తనఖా పెట్టాలి. ఆర్భీఐ నుంచి అనుమతి పొందాలి. అప్పుల మీద అప్పులు చేయాలి. సంక్షేమ పథకాల పేరుతో పంచాలి. అయితే ఇలా అప్పుల మీద అప్పులు చేస్తున్నా, పన్నుల వడ్డింపులు వాయింపులు కూడా ఏ ప్రభుత్వంలోనూ తప్పడం లేదు. పన్నులు పెంచడం తప్ప, తగ్గించింది వుండదు. దరలు పెంపు తప్ప తగ్గిన ధాఖలాలుండవు. ఎలా వడ్డింపులు వడ్డించాలా? అన్న దానిపై తప్ప, కోతలను, వాతల నుంచి ప్రజలను ఎలా రక్షించాలని ఏ పాలకులు అనుకోవడం లేదు. అందుకే ఎప్పుడూ అప్పుల వేటే సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ డిపార్టుమెంటుకు మిల్లర్లంతా కలిసి సుమారు 26వేల కోట్ల రూపాయలు బాకాయిలున్నారు. ఇది ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించిన లెక్క. ఈ బకాయిలు వసూలైతే సగం రైతు రుణమాఫీ జరిగిపోయేది. లేకుంటే నాలుగు దఫాల రైతు భరోసాకు అవసరమైన సొమ్ము కూడేది. కాని ఇప్పుడు అదే రైతు భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోంది. సంక్రాంతికి ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇస్తామని ప్రకటించింది. అందుకు ఎంత లేదన్నా రూ.7000 కోట్లు కావాలి. ఈ ఏడాది చివరి కల్లా సుమారు 10 వేల మంది ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారు. వారికి ఎంత లేదన్నా కనీసం రూ.3000 వేల కోట్లు అవసరమౌతాయి. అందుకోసం ఉన్న ఫలంగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు అవసరమౌతాయి. అందుకు అప్పు చేయక తప్పదు. అందుకే కోకా పేటలో వున్న ఓ 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుతత్వం ఐసిఐసిఐ ప్రైవేటు బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడానికి రెడీ అయ్యింది. ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. కాని మిల్లర్ల బాకాయిలున్న రూ.26 వేల కోట్లలో సగం వసూలు చేసేందుకు కూడా సమయం లేదా? ఆ శాఖ అధికారులు ఏంచేస్తున్నారు? ఎప్పుడూ తీరిక లేని పనుల్లో మునిగినట్లే కనిపిస్తారు. బకాయిల వసూళ్లును మాత్రం వదిలేస్తున్నారు. అప్పులు మాత్రమే చేద్దాం…అన్న చందంగా ముందుకు సాగుతున్నారు. బకాయి దారులైన మిల్లర్లకు మాత్రం వాయిదాల మీద వాయిదాలు గత పదేళ్లుగా ఇస్తూనే పోతున్నారు. ఇంతకీ ఆ శాఖ అదికారులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం, అలసత్వం, అవినీతి అన్నీ ఒకే చోట తిష్ట వేసి కూర్చున్న తర్వాత బకాయిలు ఎలా వసూలౌతాయి? మిల్లర్ల బకాయిలు కొండలా ఎలా పేరుకుపోతాయి? కనీసం ప్యాడీ టెండర్ల సమయంలో కాస్త శ్రద్ద పెట్టి సివిల్‌ సప్లై శాఖ వసూలు మొదలుపెట్టినా ఎంత లేదన్నా రూ.2000 వసూలయ్యేవి. కాని ఒక్క రూపాయి వసూలు చేయలేదు. పైగా బ్యాంకు గ్యారెంటీలను ప్రోత్సహించారు.రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్దితుల్లోనూ బకాయి దారుల నుంచి సొమ్ము వసూలు చేయాలని అధికారులను ఆదేశించినా లాభం లేకపోయింది. ఆఖరుకు గ్యారెంటీలు ప్రభుత్వమే ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకు కారణం అధికారులు. నేటి ధాత్రి గత పదేళ్లుగా ఇదే విషయం చెబుతోంది. ఆనాడు గత పాలకులు పట్టించుకోలేదు. అదికారులను ఆదేశించలేదు. సివిల్‌ సప్లయ్‌లో జరుగుతున్న అవినీతిని అరికట్టలేదు. అధికారుల అవినీతి, అడ్డగోలు సంపాదనను గత పాలకులు గుర్తించలేదు. ఇప్పుడూ అదే జరుగుతోంది. మిల్లర్ల నుంచి నెల నెల మామూళ్లే కాదు, ప్యాడీ కొనుగోలు సమయంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారుతాయన్నది భహిరంగ రహస్యమే. ఒక్కసారి సివిల్‌ సప్లయ్‌లో పోస్టింగ్‌ వచ్చిందంటే చాలు నాలుగు తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపాదన సమకూరుతందని అంటారు. కింది స్ధాయి నుంచి పై స్ధాయి దాకా సివిల్‌ సప్లయ్‌లో పనిచేసే అధికారులకు ఆడికార్లు కొనుగోలు చేసుకునేంత శక్తి ఎలా వస్తుంది. మిల్లర్ల నుంచి నగదు లంచాలే కాదు, గిఫ్టుల కింది కార్లు, విల్లాలు కూడా తీసుకుంటున్నారన్న సంగతి పాలకులకు తెలియదా? అందరికీ తెలిసినా ఎవరూ పట్టించుకోరు. అప్పుల కోసం మాత్రం ప్రతిపాదనలు సిద్దం చేయమంటే ఉరుకులు పరుగుల మీద రిపోర్టులు తయారు చేస్తారు. ఆగమేఘాల మీద నివేదికలు సిద్దంచేస్తారు. కాని మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయడానికి మాత్రం కార్యాలయం నుంచి అధికారులకు కాళ్లు కదలవు. ఎంత సేపు మిల్లర్ల మేలు కోసం తప్ప, ప్రభుత్వం కోసం అధికారులు పనిచేసినట్లు ఎక్కడా కనిపించదు. సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌కు నియోజకవర్గంలోని నేరేడు చెర్ల తిరుమల రైస్‌ మిల్లు బకాయిలు సుమారు 108 కోట్లుగా లెక్క తేలింది.( 107,16,90,801 కోట్ల రూపాయలు) అదే జి ల్లాకు చెందిన గడ్డిపల్లి మండలంలోని సంతోషి పారాబాయిల్డ్‌ రైస్‌ మిల్లు రూ.110,39,96,525 కోట్లు బాకాయిలున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు మిల్లులే సుమారు రూ.217.50 కోట్లు బకాయిలున్నాయి. ఇలాంటి మిల్లర్లు ఇంకా 1175 మంది వున్నారు. వారిలో సగం మిల్లర్ల మీద ఒత్తిడి తెచ్చి సగం వసూలు చేసినా కనీసం రూ.5వేల కోట్లు వసూలౌతాయి. కాని అధికారులు దానిపై దృష్టిపెట్టరు. రాష్ట్ర ప్రభుత్వమేమో అధికారిక లెక్కల ప్రకారం భూముల ధరలతో కూడిన లెక్కలు సమర్పించి అప్పులు చేస్తుంటే, మిల్లర్లు మాత్రం తమ ఆస్దుల విలువ ఇష్టాను సారం పెంచి, బ్యాంకులను నమ్మించి, కోట్ల రూపాయలకు బ్యాంకు గ్యారెంటీలు తెస్తున్నారు. నిజంగా అవి సక్రమమైనవేనా ? అన్నది ఏ అదికారి పట్టించుకున్న పాపాన పోలేదు. వాటిపై ఎంక్వైరీ జరిగినట్లు వార్తలు వచ్చింది లేదు. ఆ బ్యాంకు గ్యారెంటీల వెనకాల వున్న మతలబు ఆరా తీయలేదు. నిజంగానే మిల్లర్లు అంతంత ఆస్దులున్నప్పుడు నేరుగా బకాయిలు చెల్లించొచ్చు. కాని గ్యారెంటీల వైపే ఎందుకు మొగ్గుచూపారు? వారి నుంచి బకాయిలు వసూలు చేయాలని ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సీరియస్‌గానే ప్రకటించారు. పైగా బాకాయిదారులైన వారికి ఒక్క వడ్ల గింజ కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి కూడా చెప్పారు. కాని ఆ మాటపై ప్రభుత్వం నిలబడలేదు. అధికారులు సీరియస్‌గా తీసుకోలేదు. మిల్లర్ల విజ్ఞప్తి అని ఒక విన్నపాన్ని ముందు పెట్టి, వారి నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకుంటే సరిపోతుందని నిర్ణయం ఎవరు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా అంగీకరించిందా? ముఖ్యమంత్రి దానిపై ఆమోద ముద్ర వేశారా? సంబందిత మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడ ఓకే అన్నారా? ఈ వార్తలేమీ లేవు? కాని బకాయిదారులైన మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకోవడం జరిగిపోయింది. వారికి వడ్దు అప్పగించడం కూడా పూర్తయింది. ఇలా లోలోన తంతు నిర్వహించడానికి అధికారులకు మిల్లర్లు పెద్దఎత్తున ముట్ట చెప్పినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పధకాల అమలు కోసం ప్రభుత్వాలు పడే తిప్పలు అవి పడుతుంటాయి. అందుకోసం మిల్లర్ల మీద ఒత్తిడి రాకుండా వుండేందుకు అదికారులు బ్యాంకు గ్యారెంటీల ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. కాని ఎప్పటికైనా మిల్లర్లనుంచి వసూలు చేయాల్సిన వాటిని ఎందకు వదిలేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వందల మంది మిల్లర్లు బకాయిలు పడి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి. ఆ బకాయిలు కొండలా పెరిగిపోతున్నాయి. అయినా అదికారుల్లో చలనం లేదు. నెలలో ఒకటో తారీఖనే జీతాలు కావాలి. కాని బకాయిల వసూలు మాత్రం అదికారులకు పట్టింపు లేదు. ఇక ఇదిలా వుంటే ఎంతో మంది అవినీతి అదికారులు ఇతర శాఖలనుంచి సివిల్‌సప్లయ్‌ శాఖకు వచ్చి, ఏళ్ల తరబడి ఇక్కడే తిష్టవేసి, కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి అధికారులను ఇప్పటికైనా గుర్తించి వారిని వారి మాతృ సంస్ధలకు పంపిచాల్సిన అవసరం వుంది. ఇక పోతే ఇప్పుడు కాదు…అంటూ బకాయిల వసూలు ఇంకా, ఇంకా కాలయాపన చేసుకుంటూ పోతూ వుంటే అవి పెద్ద కొండలా మారిపోతాయి. ప్రభుత్వం వసూలు చేయడానికి గుదిబండలా మారుతాయి. ఈ పదేళ్లలో కొన్ని మిల్లులు కూడా మూతపడ్డాయి. అందులో బకాయి మిల్లులు వుంటాయి. వాటి నుంచి వసూలు చేయడం ఎవరి వల్ల కాదు. వచ్చే ఐదేళ్లు ఇలాగే కాలయాపన చేస్తే బకాయిలు పెరగడమే కాదు, వాటిని వసూలు చేయడం కూడా కష్టమే..అందుకే అప్పుల కోసం కాకుండా, బకాయిల వసూలు మీద దృష్టిపెట్టండి.

తెలంగాణ స్టూడెంట్ పవర్ నూతన కమీటి ఎన్నిక

నర్సంపేట,నేటిధాత్రి :

ఉస్మానియా యూనివర్శిటిలో జరిగిన తెలంగాణ స్టూడెంట్ పవర్ (టీఎస్పి) రాష్ట్ర స్థాయి సమావేశంలో తెలంగాణ స్ఫూడెంట్ పవర్ రాష్ట్ర విద్యార్థి విభాగం ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షునిగా వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి పరిశోధక విద్యార్థి సునీల్ గవాస్కర్ ని నియమిస్తున్నట్లు తెలంగాణ స్టూడెంట్ పవర్ విద్యార్థి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మేడి సత్యనారాయణ తెలిపారు, ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షునిగా ఎన్నికైన సునీల్ గవాస్కర్ ని పలు విద్యార్థి సంఘాల నాయకులు అధ్యాపకులు మరియు బోధినేతర సిబ్బంది తదితరులు అభినందించారు.

సోమ రాజన్న త్యాగస్పూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిద్దాం

సోమ రాజన్న వర్ధంతి సభలో యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట,నేటిధాత్రి :

యంసిపిఐ (యు) వ్యవస్థాపక నేతల్లో ఒకరైన కామ్రేడ్ సోమ రాజన్న త్యాగాలను, పోరాటాలను ఆదర్శంగా తీసుకుని ప్రజా ఉద్యమాలను నిర్మించడమే ఆ మహానుభావుడికి అర్పించే నిజమైన నివాళులు అని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. గురువారం నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన కామ్రేడ్ సోమ రాజన్న 10 వ వర్ధంతి సభ జరిగింది.ఈ సందర్భంగా హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ నర్సంపేట మండలం మాదన్న పేట గ్రామంలో జన్మించిన కామ్రేడ్ రాజన్న పీడిత ప్రజల పక్షాన గొంతు కలిపి అనేక దాడులు దౌర్జన్యాలు, నిర్బంధాన్ని, జైలు జీవితాన్ని ఎదుర్కొని పోరాడిన కష్టజీవుల కడలి తరంగం అని అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో అమరజీవి మద్ది కాయల ఓంకార్ తో కలిసి రైతులు,కూలీలను ఏకం చేసి భూస్వామ్య,జమీందారీ వ్యవస్థపై ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు.సుమారు లక్ష ఎకరాల భూస్వాముల భూములు,పంచరాయి,పొరంబోకు, ప్రభుత్వ మిగులు భూములు ప్రజల పరం చేసారని అన్నారు. దీనితో కక్ష కట్టిన భూస్వామ్య, నరహంతక గుండాలు కామ్రేడ్ రాజన్నపై ఐదు సార్లు హత్యా ప్రయత్నం చేశారని,
చివరికి ములుగు రామచంద్ర పురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాడు సాయుధ ముఠా కామ్రేడ్ రాజన్నను హత్య చేయడానికి వచ్చి జరిపిన కాల్పుల్లో కామ్రేడ్ మహ్మద్ సర్వర్ హత్య చేయబడగా, మరో ముగ్గురు కార్యకర్తలు తీవ్ర గాయాలతో బయటపడ్డారని అన్నారు.
రాజన్న పేద ప్రజలకు విద్య, వైద్యం, గృహవసతి, పోలీసు స్టేషన్,యంఆర్వో, ఆర్డివో,కలెక్టర్, ఎక్సైజ్ ఆపీసు, కోర్టు సమస్యలు ఏదైనా అక్కడ కార్యకర్తల అండగా నిలిచి సాదించిన మహా నాయకుడని తెలిపారు. ఆయన ఆశయ త్యాగం ఎంత గొప్పదని, ఏ ప్రజా పదవినీ ఆశించకుండా, ప్రజలకోసమే జీవితాన్ని అంకితం ఇచ్చిన నాయకుడు కామ్రేడ్ సోమ రాజన్న అని అన్నారు.రానున్న కాలంలో రాజన్న దారిలోనే ప్రజా ఉద్యమాలు ఉదృతంగా నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,సీనియర్ నాయకులు నాగెల్లి కొమురయ్య,జిల్లా నాయకులు,సింగతిమల్లిఖార్జున్, కే శెట్టి సదానందం,కలకోట్ల యాదగిరి, కొప్పుల సమ్మక్క, కేశెట్టి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

కార్మికుల సంక్షేమానికి అహర్నిశలు కృషి- బాసని చంద్రప్రకాష్

తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు మెంబర్ చంద్రప్రకాష్ ఎంపిక

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ తెలంగాణ రాష్ట్ర మినిమం వెజెస్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్ర ప్రకాష్ 1982లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అహర్నిశలు పార్టీ కోసం శ్రమిస్తూ అంచలంచెలుగా ఎదిగారు. 1992 లో పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్, 1995 లో శాయంపేట గ్రామ సర్పంచ్, 2001 లో ఎంపీపీ, శాయంపేట చేనేత సొసైటీ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టారు. తన భార్య రమాదేవి ఎంపీపీగా చేశారు. 2018లో చంద్ర ప్రకాష్ ఎంపీటీసీ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా ఎంపికయ్యారు. తన నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి ఎనుముల రేవంత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చైర్మన్ జనక్ ప్రసాద్ లకు బాసాని చంద్రప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అంగన్వాడి సెంటర్ కు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని రాయపర్తి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఫ్లెక్సీ ల రూపంలో గ్రామాలలో ఏర్పాటు చేయాలని కోరారు.
ఆర్థిక సర్దుబాటు చేసుకుంటూ అంచలంచలుగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని,ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 ఉచిత కరెంట్,500 రూ వంట గ్యాస్,రెండు లక్షల లోపు రైతురుణ మాఫీ, ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు అమలు చేస్తున్నామన్నారు
తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దామని అన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో పెట్టి ప్రజలకు వివరించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని అన్నారు.రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నదనే సంగతి ఏ సందర్భంలో కూడా తెలియజేయలేదు అని అన్నారు.
గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా, నాణ్యమైన పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తుంటే, బిఆర్ఎస్ నాయకులు కావాలనే అసత్యపు ప్రచారాలు చేస్తున్నరని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తామని, రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ దేయమని తెలిపారు. ఏకకాలంలో 2 లక్షల లోపు రైతు రుణ మాఫీ చేసామన్నారు.
పంట బోనస్ 500/- ప్రకటనతో పెరిగిన సన్నాలు సాగు పెరిగిందని,కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రైతు కుటుంబాలు ఆనందంగా ఉన్నాయి అని తెలిపారు.

మండల కేంద్రంలో 108 సేవలు ప్రారంభం

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా మండలంలోని ప్రజల సౌకర్యార్థం 108 సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రజలు అత్యవసర సమయం లో 108 వాహనం సేవలు వినియోగించు కొని ప్రజలు ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు.
త్వరలో మండల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఏర్పాటు చేస్తామని హామీ.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం ప్రజలకు ప్రాథమిక వైద్యము విద్య అందించాలనేది మా సంకల్పము అని అన్నారు. ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున 108 సేవలను ప్రారంభించడం ఇదే మొదటిసారి కావొచ్చని అన్నారు.ప్రజలకు సేవలు అందించడంలో ఆశా కార్యకర్తలు,ఏ ఎన్ ఎం లా ప్రాముఖ్యత కలదు అందుకు మనము కృతజ్ఞతగా ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ త్వరలో నడికూడామండలంలో పి హెచ్ సి ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ మేడం డాక్టర్ లలితా దేవి స్థానిక ఆర్ డి ఓ,స్థానిక పి హెచ్ సి రాయపర్తి వైద్యాధికారులు డాక్టర్ స్వాతి,డాక్టర్ దివ్య, డాక్టర్ అనూహ్య, తహసిల్దార్ నాగరాజు,ఎంపిడిఓ శ్రీనివాస్, 108 ప్రాజెక్టు మేనేజర్ శివకుమార్,లక్ష్మణ్ హనుమకొండ జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి,స్థానిక సిహెచ్ఓ సుజాత వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశలు,ఏఎన్ఎంలు సూపర్వైజర్లు పాల్గొన్నారు.స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, ఫార్మల్ నాన్ ఫార్మల్ అధికారులు,నాయకులు పాల్గొన్నారు.

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలన అధికారి గా సునoద

వనపర్తి నెటిధాత్రి:,
వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలన అధికారిగా ఏ ఓ గా శ్రీమతి వి,సునంద పదవి భాధ్యతలు స్వీకరించారు.
వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
సునంద జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో 10, వ బెటాలియన్ లో సూపరింటెండెంట్ పర్యవేక్షణ అధికారిగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలన అధికారి ఏ ఓ గా బదిలీపై వచ్చారు.

అక్రమ కేసులకు భయపడేది లేదు

5 రోజులుగా జైలు జీవితం గడిపిన తెలంగాణా ఉద్యమకారులు

జైలు నుండి విడుదలైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి :

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక సార్లు జైళ్లకు పోయినం.ఇప్పుడు అదే పరిస్థితి పరాయి పాలనలో కనబతున్నది.
న్యాయంగా ఉండాల్సిన పోలీసులే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు ఐనా భయపడేది లేదని జైలు నుండి విడుదలైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో పెట్టించిన అక్రమ కేసులతో జైలుపాలై గత 5 రోజులుగా జైలు జీవితం గడిపామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.నర్సంపేట పట్టణంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన క్రమంలో ఒక కార్యకర్త ఆర్టీసీ బస్సుపై రాయితో దాడి చేయగా ఆ కేసులో పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.ఐదు రోజుల పాటు జైలు జీవితం గడిపిన నర్సంపేట మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ,1వ వార్డు కౌన్సిలర్ దేవోజు సదానందం,నర్సంపేట రూరల్ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కడారి రవి,పట్టణ ప్రధాన కార్యదర్శి వెన్నుముద్దల శ్రీధర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ మండల శ్రీనివాస్,పెండం వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దెల సాంబయ్య, పైసా ప్రవీణ్, పెరుమండ్ల రవి, కొమ్ముల కరుణాకర్ లు విడుదల అయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి తప్పుడు అక్రమ కేసులకు భయపడేది లేదు ఆన్నారు.నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ మునుముందు ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు.
అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

పెద్ది వెంకట నారాయణ గౌడ్ జన్మదిన వేడుకలు

హన్మకొండ ,నేటిధాత్రి :

రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ పుట్టినరోజు వేడుకలు గురువారం రోజున హన్మకొండ రెడ్ క్రాస్ సొసైటీ కాన్ఫరెన్స్ హాల్ లో రెడ్ క్రాస్ సిబ్బంది ఘనంగా నిర్వహించారు.అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి మరియు పాలకవర్గసభ్యులు పుష్పగుచ్చం అందచేసి,శాలువాతో సన్మానించారు.రెడ్ క్రాస్ సిబ్బంది పుష్పగుచ్చం అందచేసి,శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసినారు.రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ వైస్ చైర్మన్ పెద్ది వెంకట నారాయణ గౌడ్ రైస్ మిల్లు యాజమనిగా ఉంటూ తన భార్య పేరు మీద స్వచ్చంద సంస్థ స్థాపించి మహిళలకు కుట్టు మిషన్లు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు, పెన్నులు,బెంచీలు,ఆట వస్తువులు ఉచితముగా అందచేస్తూ సేవ చేసే కార్యక్రమాలలో ముందుంటారని అన్నారు.ఈ సందర్బంగా హనుమకొండ రెడ్ క్రాస్ టైలర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందచేసినారని అదేవిదంగా శిక్షణ పూర్తిచేసుకున్న మహిళల సమక్షం లో డ్రా పద్ధతి ద్వారా ముగ్గురికి రెడ్ క్రాస్ చైర్మన్ మరియు పాలకవర్గం ఉచితముగా కుట్టు మిషన్లు అందచేసారు.ఈ కార్యక్రమ లో కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి,జిల్లా పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణు గోపాల్,చెన్నమనేని జయశ్రీ, టైలర్ ట్రైనర్ విజయ,రెడ్ క్రాస్ సిబ్బంది మరియు టైలర్ నేర్చుకుంటున్న మహిళలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version