తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు మెంబర్ చంద్రప్రకాష్ ఎంపిక
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ తెలంగాణ రాష్ట్ర మినిమం వెజెస్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చంద్ర ప్రకాష్ 1982లో కాంగ్రెస్ పార్టీలో చేరి, అహర్నిశలు పార్టీ కోసం శ్రమిస్తూ అంచలంచెలుగా ఎదిగారు. 1992 లో పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్, 1995 లో శాయంపేట గ్రామ సర్పంచ్, 2001 లో ఎంపీపీ, శాయంపేట చేనేత సొసైటీ చైర్మన్ పదవి బాధ్యతలు చేపట్టారు. తన భార్య రమాదేవి ఎంపీపీగా చేశారు. 2018లో చంద్ర ప్రకాష్ ఎంపీటీసీ గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ గా ఎంపికయ్యారు. తన నియామకానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రి ఎనుముల రేవంత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, చైర్మన్ జనక్ ప్రసాద్ లకు బాసాని చంద్రప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.