అక్రమ కేసులకు భయపడేది లేదు

5 రోజులుగా జైలు జీవితం గడిపిన తెలంగాణా ఉద్యమకారులు

జైలు నుండి విడుదలైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

నర్సంపేట,నేటిధాత్రి :

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక సార్లు జైళ్లకు పోయినం.ఇప్పుడు అదే పరిస్థితి పరాయి పాలనలో కనబతున్నది.
న్యాయంగా ఉండాల్సిన పోలీసులే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు ఐనా భయపడేది లేదని జైలు నుండి విడుదలైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో పెట్టించిన అక్రమ కేసులతో జైలుపాలై గత 5 రోజులుగా జైలు జీవితం గడిపామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.నర్సంపేట పట్టణంలో ఇటీవల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన క్రమంలో ఒక కార్యకర్త ఆర్టీసీ బస్సుపై రాయితో దాడి చేయగా ఆ కేసులో పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్ కు పంపారు.ఐదు రోజుల పాటు జైలు జీవితం గడిపిన నర్సంపేట మండల పార్టీ అధ్యక్షులు నామాల సత్యనారాయణ,1వ వార్డు కౌన్సిలర్ దేవోజు సదానందం,నర్సంపేట రూరల్ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కడారి రవి,పట్టణ ప్రధాన కార్యదర్శి వెన్నుముద్దల శ్రీధర్ రెడ్డి,మాజీ కౌన్సిలర్స్ మండల శ్రీనివాస్,పెండం వెంకటేశ్వర్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దెల సాంబయ్య, పైసా ప్రవీణ్, పెరుమండ్ల రవి, కొమ్ముల కరుణాకర్ లు విడుదల అయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి తప్పుడు అక్రమ కేసులకు భయపడేది లేదు ఆన్నారు.నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ మునుముందు ప్రజల కోసం ప్రజాక్షేత్రంలో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉంటామని తెలిపారు.
అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!