టిడిపి 14వ డివిజన్ అధ్యక్షుడు పాశికంటి రమేష్
నేటిధాత్రి, వరంగల్
తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన టిడిపి వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ అధ్యక్షుడు పాశికంటి రమేష్ పిలుపునిచ్చారు. శనివారం ఎన్టీ రామారావు 29వ వర్ధంతి సందర్భంగా 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పాషికంటి రమేష్ తోపాటు టిడిపి నాయకులు, స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా పాశికంటి రమేష్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి రాజకీయ అవకాశాలు లభించాయన్నారు. నేడు కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఎంతోమంది నాయకులకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుతం పాలకులు కొనసాగిస్తున్నారని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. ఎన్టీ రామారావు పేరు మీద 25 సంవత్సరాల క్రితం వెలసిన ఎన్టీఆర్ నగర్ కాలనీకి నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాల సహకరించిన విషయాన్ని గ్రామ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వడ్నాల నరేందర్ బీసీ సెల్ సీనియర్ నాయకుడు ముండ్రాతి శరత్ బాబు, సీనియర్ నాయకుడు లాసాని నరసింగరావు, స్థానిక నాయకులు కొత్తపల్లి యాదగిరి, అడుప మహేష్, బొల్లం నరేష్ కర్రు రాజేందర్, ఎల్లంశెట్టి వీరస్వామి, బొల్లం భాగ్య, తదితరులు పాల్గొన్నారు.