మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ.
భద్రాచలం నేటిదాత్రి
స్థానిక అంబేద్కర్ సెంటర్లో మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశన్ని ఉద్దేశించి మహనీయుల జయంతుల ఉత్సవ కమిటీ నిర్వాహకులు ముద్దా పిచ్చయ్య, అలవాల రాజా పెరియర్, గురుజాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…..
సామాజిక విప్లవ మూర్తి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ సెంటర్ నందు మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్ టి, బి సి , మైనార్టీ, అంబేద్కర్ వాదుల ఆధ్వర్యంలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి నిజమైన అంబేద్కర్ వాదులు, ఉద్యోగస్తులు, న్యాయవాదులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగబద్ధ రిజర్వేషన్, హక్కులు పొందుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థ ఉద్యోగస్తులు కార్మికులు, కర్షకులు, అంబేద్కర్ అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కొప్పుల శేఖర్, ఆదివాసి నాయకులు మర్మం చిట్టిబాబు, ఇర్పా శీను, కొమ్మ గిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.