నాటు సారా( గుడుంబా) దారుని బైండోవర్

జైపూర్ నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామపంచాయతీ గోపాల్ పూర్ కు చెందిన జుమ్మడి మహేందర్ s% రాజయ్య ను గుడుంబా విక్రయ దారునిగా అనుమానిస్తూ తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్టు మంచిర్యాల డివిజన్ ఎక్సైజ్ శాఖ ఎస్సై వెంకటరమణ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో గుడుంబా క్రయ విక్రయ అనుమానిత కుటుంబాలను మంచిర్యాల డివిజన్ ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. కాగా జూమ్మడి మహేందర్ గుడుంబా క్రయ విక్రయాలకు పాల్పడితే లక్ష రూపాయల జరిమానా లేక ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుందని హెచ్చరిస్తూ తహసీల్దార్ ప్రసాద్ వనజా రెడ్డి ఎదుట బైండోవర్ చేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్, ప్రసాద్,మహేష్ ప్రణీత మంచిర్యాల అబ్కార్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు

చందుర్తి, నేటిధాత్రి:

రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కరీంనగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామంలో బిజెపి నాయకులు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావాలి అంటే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలలో బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మూడోసారి దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారిని చేసుకుందామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శి చింతకుంట గంగాధర్ బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెరుక గంగరాజు బిజెపి ఓబీసీ మోర్చా మండలాధ్యక్షుడు చింతకుంట సాగర్ పేరుక రంజిత్ ముప్పిడి సత్తయ్య మెరుపుల వేణు అనీలు శేఖర్, ప్రకాష్ ,వెంకటేష్ ,తిరుపతి, మల్లేశం, నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

వినాయక కాలనీ నూతన కమిటీ సమావేశం

హన్మకొండ:

గోపాలపురంలో నూతన కమిటీ సమావేశం అధ్యక్షులు పల్లెబోయిన కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ యూనివర్సిటీ సబ్ ఇన్స్పెక్టర్ ధామరూపాల దేవేందర్ హాజరయ్యారు నూతన కమిటీకి తెలియజేస్తూ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గత మూడు సంవత్సరాల నుండి దిగ్విజయంగా ఒక కుటుంబ పాలనగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన పాత కమిటీ సభ్యులు గౌరవ అధ్యక్షులు ఆరె రాకేష్ రెడ్డి అధ్యక్షులు కోరిక రామ్ సింగ్ నాయక్ ప్రధాన కార్యదర్శి తంగేళ్ల రవి ప్రసాద్ కోశాధికారి పొన్నోజు శ్రీనివాస్ మిగతా కమిటీ సభ్యులకు కొత్త కమిటీ సన్మానం చేయడంతోపాటు కాలనీ వాసులు అందరు కలిసి ఎస్సై కి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బంక సురేందర్, కోశాధికారి పోచంపల్లి రమేష్, లక్ష్మణ్, రవీందర్, తిరుపతిరెడ్డి, బజన్ నాయక్, భాస్కర్, మధుసూదన్, వెంకన్న, రవి, సంతోష్, రమణాకర్, రాజేందర్, విజేందర్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.

ఇందారం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం

అవగాహన సదస్సులు జరిపినప్పటికీ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు

మానవ నిర్లక్ష్యమే దీనికి కారణం మంటలు ఆర్పివేసిన అటవీ అగ్ని మాపక సిబ్బంది

జైపూర్, నేటి ధాత్రి :

మంచిర్యాల జిల్లా అటవీ డివిజన్ పరిధిలోని జైపూర్ మండలం ఇందారం రక్షిత అటవీ ప్రాంతం లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. మంచిర్యాల – హైదరాబాద్ ప్రధాన రహదారి ఆనుకొని ఉన్న ఇందారం అటవీ ప్రాంతంలో మంటలు వస్తున్నాయని అటవీ అభివృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ కు ఆదివారం రాత్రి కొందరు పత్రికా విలేకరులు వారి సామాజిక భాద్యత గా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన తమ అటవీ శాఖ అధికారులకు, ఇతర సిబ్బందికి సమాచారం ఇచ్చి సంఘటన స్థలానికి చేరుకున్నారు.వాచర్ తుత్తుర్ల శంకర్ సహాయంతో ఫైర్ కంట్రోల్ బ్లోయర్ తో మంటలు అర్పివేయిస్తూ మంచిర్యాల అగ్ని మాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వెంటనే ఫైర్ ఇంజిన్ ను ప్రమాద స్థలానికి పంపించారు.అటవీ, అగ్ని మాపక సిబ్బంది అందరూ శ్రమించి మంటలు అడవి అంతా విస్తరించకుండా పూర్తిగా అర్పివేసారు. సకాలంలో ఈ మంటలను ఆర్పివేసి అటవీ ప్రాంతాన్ని రక్షించారు. ప్రధాన రహదారి వెంట వెళ్లే వారు సిగరెట్ లేదా బీడీలు తాగి పడేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మానవ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల విషయం లో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకుంటేనే సాధ్యమైనంత వరకు వాటిని నివారించవచ్చని అటవీ అభివృద్ధి సంస్థ, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి. సురేష్ కుమార్ పేర్కొన్నారు.ఇలాంటి ప్రమాదాల వల్లే మంచిగా పెరిగిన పచ్చని చెట్లు ఎండిపోయి చనిపోతున్నాయాన్నారు. ఎక్కడైనా అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

జైపూర్ ఎస్టిపిపిలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆదివారం రోజున
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్టిపీపి ఈడి శ్రీ బసివి రెడ్డి ఇతర అధికారులు మరియు ఉద్యోగులతో కలిసి ఉదయం 7 గంటలకు ఎస్టిపిపి నుండి బైక్ ర్యాలీతో పెగడపల్లి వరకు వెళ్లి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం ఆడిటోరియం వద్దకు చేరుకొని పతాక ఆవిష్కరణ చేశారు. తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. అలాగే ఈ సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఈడీ బసివి రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగ శిల్పి , సామాజిక, ఆర్థిక వేత్తయని, బహుముఖ ప్రజ్ఞాశాలి అని, సమసమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తియని కొనియాడారు. అంబేద్కర్ అనేక వివక్షలకు గురి అవుతు కూడా అవమానాలకు కృంగిపోకుండా ఆ కసినీ మెట్లుగా ఉపయోగించుకొని తాను రెండు పిఎచ్ డి లను పొంది,64 సబ్జెక్టులలో మాస్టర్స్ సాధించి, సమాజ అభివృద్ధికై కృషి చేశారని, అంటరానితనాన్ని నిర్మూలించడానికి విద్య ఒక్కటే మార్గం అని సూచించారనీ అన్నారు. అలాగే విద్యను ప్రోత్సహించండి అదే వారి అభివృద్ధికి తోడ్పడుతుందని ఈడి అన్నారు. నిన్న ఎస్టిపిపిలో జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో 121 మంది రక్తదానం చేశారని ప్రశంసించారు. సమాజంలో సమానంగా గౌరవించాలని పిలుపునిచ్చారు.అనంతరం వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవైతాలికుడు అనగా సమాజాన్ని మేల్కొల్పేవాడు అన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడు అని, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాగే అంబేద్కర్ రాజకీయ అధికారం లేకుంటే ఏ సామాజిక వర్గం అభివృద్ధి చెందలేదని అన్నారని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో కూడా అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జైపూర్ లోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులకు మరియు ఎస్టిపిపి ఉద్యోగులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన మరియు డ్రాయింగ్ కాంపిటీషన్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షురాలు భవాని, ఈడి బసివి రెడ్డి , చీఫ్ ఆఫ్ (ఓ అండ్ ఎం ) శ్రీ జే ఎన్ సింగ్, ఏజీ ఎం (సివిల్ ) శ్రీ ప్రసాద్, ఏజీఎం( ఫైనాన్స్) శ్రీ సుధాకర్, ఏజీఎం (ఎఫ్జీడి) శ్రీ రమణ డీజీఎం శ్రీ మదన్మోహన్, ఎస్టీ ఎంప్లాయిస్ అధ్యక్షులు డి. పంతులు, ఎస్సీ లైసెనింగ్ ఆఫీసర్ శ్రీ వెంకటయ్య, ఎస్టి లైజనింగ్ ఆఫీసర్ శ్రీ బీమా, సి ఎం ఓఏఐ తరఫున శ్రీ సంతోష్ కుమార్, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ సత్యనారాయణ రెడ్డి,పర్సనల్ మేనేజర్ శ్రీ రామశాస్త్రి, పవర్ మేక్ ప్లాంట్ హెడ్ శ్రీ అఖిల్ కపూర్ ఇతర అధికారులు ,ఉద్యోగులు మరియు స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

ఆశీర్వదించండి అండగా ఉంటా..

కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి

షాద్ నగర్ పట్టణ, ఫరూఖ్ నగర్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.

వంశీచంద్ రెడ్డి గెలుపుకై కార్యకర్తలు సన్నిద్ధం కావాలి.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే అండగా నిలబడతానని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. వంశి చంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా సోమవారం పట్టణ కేంద్రంలో ఫరూఖ్ నగర్ మండలం, షాద్ నగర్ పట్టణ కార్యకర్తల సమావేశాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేసిందని గెలిపించే బాధ్యత మీదే అన్నారు. నేను ఏ పదవిలో ఉన్న మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ కష్టాల్లో పాలు పంచుకుంటాను అన్నారు. రాష్ట్రంలో మన ప్రజా ప్రభుత్వం ఉన్నదని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ తొమ్మిదన్నరేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయని బిఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతిక హక్కు లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి నిబద్ధత చాటుకున్నదని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నట్లుగానే, కేంద్రంలో అధికారంలో తెచ్చుకుంటేనే బిజెపి చేతిలో నిర్వీర్యమైన ఈ దేశాన్ని కాపాడుకునేందుకు, ప్రజలకు మంచి చేసేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజలకు వివరించారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ షాద్ నగర్ నుండి ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ కి రెండింతలు మెజార్టీ ఇవ్వడం కొరకు కార్యకర్తలు సన్నద్ధమన్నారు. దాంట్లో ఎలాంటి అతిశయం లేదని అన్నారు. కార్యకర్తలు అందరూ గ్రామాల్లో ఒక సైనికుల్లా పనిచేసి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తే ప్రతి పని, ప్రతి పథకం కూడా అమలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, చెంది తిరుపతి రెడ్డి, రఘు, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీఖాన్ బాబర్, మాజీ జెడ్పిటిసి కందివనం సూర్య ప్రకాష్, ఎంపిటిసిలు మాజీ సర్పంచులు వివిధ విభాగాల బాధ్యులు, మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు..

సి డి పి ఓ కు వినతిపత్రం అందజేసిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్.

చెన్నూర్ నేటి ధాత్రి::

అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ( సిఐటియు ) ఆధ్వర్యంలో రిటర్మెంట్ ఆర్ సి బెనిఫిట్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం టీచర్స్ రెండు లక్షలు, హెల్పర్ కు లక్ష రూపాయలు 60 సంవత్సరాలు దాటిన వారికి వీడిఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీవో జారీ చేయాలని కోరుతూ సిడిపిఓ కి వినతి పత్రం అందజేయడంజరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు నగేష్ , అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ప్రవీణ, పద్మావతి, శారద, మణిమాల,విజయలక్ష్మి, భారతి,లలిత,సురేఖ, సావిత్రి, రాజు భాయ్,హేమలత, సుగుణ,ఈశ్వరి,సునీత తదితరులు పాల్గొన్నారు

కొల్చారం మండలంలోని పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాధికారి రాధా కిషన్

కొల్చారం (మెదక్)నేటిధాత్రి :-

సోమవారం నుండి ఒకటవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాధికారి రాధా కిషన్, మండల విద్యాధికారి నీలకంఠం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొల్చారం, ప్రాథమిక పాఠశాల కొల్చారం, లేక్ వ్యూ ప్రైవేట్ పాఠశాల కొల్చారం, సీతారాం తండా, రంగంపేట ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు.
తరగతి గదులను సందర్శించి పరీక్షల నిర్వహణ పరిశీలించడం జరిగింది, విద్యార్థుల హాజరు గురించి ఉపాధ్యాయులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాధా కిషన్, ఎంఈఓ నీలకంతం మాట్లాడుతూ
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంచాలని, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఎనగండ్ల క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో

– ఘనంగా అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు…

– అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కొల్చారం ఎంపిపి మంజుల కాశీనాథ్….

-మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన అంబేద్కర్…

– ఎంపీపీ మంజుల….

కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:-

కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి ,పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల కాశీనాథ్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావుల్లో ఒకరిగా పేరుగాంచి ఆర్థికంగా,సామాజికంగా ఎంతో వెనుకబడిన అనగారిన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పోరాడి తన మేధా సంపత్తితో తొలి భారత క్యాబినెట్లో న్యాయశాఖ, మంత్రిగా సామాజిక న్యాయం కోసం అనేక సంస్కరణలు తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆమె అన్నారు. ఆయన అడుగు జాడల్లో సామాజిక అభివృద్ధి కోసం అందరూ పాటుపడాలని అన్నారు. మహనీయుల జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తి పొందాలని, అంబేద్కర్ యువతకు మార్గదర్శనం అన్నారు. దేశ ప్రజలందరికి సమాన ఓటు హక్కు కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుల కాశీనాథ్, ,క్రాంతి యువజన సంగం అధ్యక్షులు గోపాల్ మరియు మాజీ ఉప సర్పంచ్ సుమలత బాబు, సొసైటీ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మి నర్సింహా గౌడ్, మన్నే సుభాష్, కొరబోయిన శివ ప్రసాద్, లింగం క్రాంతి యువజన సంఘం యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం.

చిట్యాల, నేటిధాత్రి :

భారతీయ జనతా పార్టీ చిట్యాల బిజెపి మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు ఏడు నుతల నిశిధర్ రెడ్డి విచ్చేసి ఇంటింటి ప్రచారం పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ మరొక్కసారి నరేంద్ర మోడీ ని మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ప్రధానమంత్రినరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు పల్లె పట్నం అని తేడా లేకుండా ప్రతి గ్రామంలో పేద మధ్యతరగతి ప్రజలకు చేరాయని కరోనా కష్టకాలంలో కూడా దేశాన్ని కాపాడుకున్న గొప్ప మహా నాయకుడు అని ఏ దేశం చేయని విధంగా ఉచిత కరోనా టీకాను ఇప్పించిన ఘనత నరేంద్ర మోడీది,ఆయన యొక్క ఆలోచన విధానాలతోని ప్రపంచంలోనే అగ్రగామిగా మన భారతదేశం అభివృద్ధి చెందుతున్నదని బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఆయన విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని అలాంటి నాయకుడు మనకు దొరకడము మన దేశ ప్రజల అదృష్టమని మళ్లీ ఒకసారి నరేంద్ర మోడీ ని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని కావున పార్టీలకతీతంగా నరేంద్ర మోడీ అభివృద్ధిని కొనియాడుతున్నారని ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ కి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరురీ రమేష్ ని గెలిపించి ఒక బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని ఆయన అన్నారు,
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గుండ సురేష్ చెక్క నరసయ్య గజనాల రవీందర్ బీజేవైఎం మండల అధ్యక్షులు మైదాన్ శ్రీకాంత్ ఓబీసీ మోర్ చ జిల్లా కార్యదర్శి వల్లాల ప్రవీణ్ కుమారస్వామి శ్రీహరి చింతల రాజేందర్ రాకమ్ శ్రావణ్ దశరథం మహేష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచo గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిస్థాయిలో అందించాలి

శాయంపేట నేటి ధాత్రి:

ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని మండల జర్నలిస్టు అధ్యక్షుడు కూడలివద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆయన 133 వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గుర్తించబడటం గొప్ప విషయం అన్నారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాత్మ కమైనద న్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆలోచనతో పాలను అందించాలని కోరారు. విద్యుత్ సౌకర్యం లేని రోజుల్లోనే బుడ్డి దీపాల కింద చదువుకున్న అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ఎదిగారని కొనియాడారు. ఆయన రాసిన గొప్ప రాజ్యాంగము వల్లనే నేడు దేశంలో చట్టాలు అమలవుతున్నాయని గుర్తు చేశారు. దేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన అంబేద్కర్ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను అందించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.

ఈ చిన్న పాపకు కాలుకు ఆపరేషన్ ఖర్చుకు సహాయం చేయండి..

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్..

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి లో ఎల్బీనగర్లో కిరాయి కుంటున్న కాజీపేట నరేష్ సుమలత దంపతుల కూతురైన పాప కాజీపేట అక్షయను ఈరోజు ఆ కుటుంబాన్ని సందర్శించి పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది దీపావళి రోజున టపాకాయలు కాలుస్తుండగా పాపకు రెండు కాళ్లు కాలిపోయినవి ఒక కాలు ఆపరేషన్ చేయించినారు మరో కాలు ఆపరేషన్ చేయడం కొరకు ఆర్థిక స్తోమత లేక పాప మంచానికి పరిమితం అయిపోయినది ఆమె నడవలేక పోతున్నది ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పాప మంచానికి పరిమితం కావడం వలన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక స్తోమత లేక మా పాపను మంచిగా చేసుకోలేని పరిస్థితి లేదని బాధపడుతూ ఉన్నారు సొంత ఊరు జూబ్లీ నగర్ రేగొండ మండలం నుండి వలస వచ్చి భూపాలపల్లి లో నివాసం ఉంటున్నాం వృత్తి రీత్యా పెయింటర్ పని చేసుకుంటున్నానని ఇవి నా కుటుంబ పోషణ కోసం మాత్రమే సరిపోతోంది పాపకు మెరుగైన వైద్యం అందించాలంటే మూడు లక్షల దాకా ఖర్చవుతుందని అన్నారు దయ దయమయిలైన స్వచ్ఛంద సంస్థలు మానవతావాదులు మేధావులు ఉద్యోగులు స్పందించి పాపకు కాలు ఆపరేషన్ కోసం సహాయం చేసే ఆదుకోవాలని సి.పి.ఐ ఎంఎల్ లిబరేషన్ పక్షాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
నరేష్ ఫోన్ పే నెంబర్.9963368628.తోసిన సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను

పాలమూరు ఎంపీగా డీకే అరుణమ్మ గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇస్తాం..

రాజపూర్ మండల అధ్యక్షులు. కావలి రామకృష్ణ..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

సోమవారం రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని గుండ్ల పొట్లపల్లి గ్రామంలో బూత్ 100లో పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్క మహిళ యువకులు నాయకులు అందరూ డీకే అరుణమ్మ కు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి పాలమూరు ఎంపీ గా నరేంద్ర మోడీ కి బహుమతిగా ఇస్తామని రాజపూర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు తెలియజేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ పథకాలను గడపగడపకు తెలియజేస్తు ఆ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ రాజాపుర్ మండలం డీకే అరుణమ్మను కచ్చితంగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ప్రబారి విజయన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ ఇంచార్జ్ సామల నర్సింలు , జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు డబ్ల్యూ నరసింహులు , జిల్లా కార్యదర్శి అశోక్ మండల అధ్యక్షులు కావలి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆనంద్ , సింగల్ విండో డైరెక్టర్ రాజు, సీనియర్ నాయకులు శేఖర్ గౌడ్, శక్తి కేంద్ర ఇంచార్జ్ బాల గౌడ్. ఆలే మధు, మండల ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

బిజెపి పార్టీ గెలుపు కోసం ఇంటింటా విస్తృత ప్రచారం

శాయంపేట నేటి ధాత్రి:

శాయంపేట మండలంలోని కేంద్రంలో 306 బూత్ అధ్యక్షులు భాసని నవీన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి విచ్చేసి ఇంటింటి ప్రచారం పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ మరొక్కసారి నరేంద్ర మోడీ మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ఈ రోజున పల్లె పట్నం అని తేడా లేకుండా ప్రతి గ్రామంలో పేద మధ్యతరగతి ప్రజలకు చేరాయని కరోనా కష్టకాలంలో కూడా దేశాన్ని కాపాడుకున్న గొప్ప మహా నాయకుడు అని ఏ దేశం చేయని విధంగా ఉచిత కరోనా టీకాను ఇప్పించిన ఘనత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన యొక్క ఆలోచన విధానాలతోని ఈరోజు ప్రపంచంలోనే అగ్రగామిగా మన భారతదేశం అభివృద్ధి చెందుతున్నదని బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఆయన విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారని అలాంటి నాయకుడు మనకు దొరకడం అనేది మన దేశ ప్రజల అదృష్టమని మళ్లీ ఒకసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని కావున పార్టీలకతీతంగా నరేంద్ర మోడీ గారి అభివృద్ధిని కొనియాడు తున్నారని ప్రతి ఒక్కరూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారికి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ గెలిపించి ఒక బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాయరాకుల మొగిలి మండల ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి రామకృష్ణ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కానుగుల నాగరాజు సీనియర్ నాయకులు గంగుల రమణారెడ్డి బాసనీ విద్యాసాగర్ భూత అధ్యక్షులు మేకల సుమన్ సంజీవ్ సుధాకర్ సాంబయ్య రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్ బొల్లారం సంజీవ్ కు ఘన సత్కారం

పరకాల నేటిధాత్రి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 134వ జయంతి సందర్బంగా కాకతీయ విశ్వవిద్యాలయం లో దూర విద్య కేంద్ర ప్రాంగణం లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.అనంతరం 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ మధ్య డాక్టరేట్ పొందిన పరిశోధకులు బొల్లారం సంజీవ్ కు జ్ఞాపికను బహుకరించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ఒప్పంద అధ్యాపకురాలు డాక్టర్ లక్ష్మి, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ పృథ్వీరాజ్ వల్లాల, విశ్రాంత ఆచార్యలు పి.కృష్ణమాచారి,ఆచార్య చింతకింది సమ్మయ్య,పలువురు బోధన,బోధనేతర సిబ్బంది. పరిశోధకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి పార్టీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ను గెలిపించాలి

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య

భూపాలపల్లి నేటిధాత్రి

భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి అర్బన్ అధ్యక్షులు సామల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాసింపల్లి సెగ్గంపల్లి జంగేడు పకీరు గడ్డ కాలనీలలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నం పల్లి పాపన్న హాజరై వారు మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మరి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మహిళలకు 2500 రూపాయలు ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఏ మహిళ కూడా ఇవ్వలేదని వారన్నారు డిసెంబర్ 9వ తారీకు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదన్నారు అంతే కాకుండా రైతులకు రైతు భరోసా 15000 ఇస్తానని రైతు కూలీలకు 12,000 ఇస్తానని మరి ఏ ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోడీ 400 ఎంపీ సీట్లకు పైగా గెలిచి దేశ ప్రధాని కావడం కాయం ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత బిజెపి పార్టీదీ విశ్వకర్మ యువజన ద్వారా 18 కులవృత్తులకు శిక్షణ ఇచ్చి మరి మూడు లక్షల రూపాయల లోను ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేద మధ్యతరగతి వాళ్లకు అండగా ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి వరంగల్ పార్లమెంటు అభ్యర్థి ఆరూరి రమేష్ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు దొంగల రాజేందర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు వేషాల సత్యవతి అర్బన్ ప్రధాన కార్యదర్శి తుమ్మేటి రామ్ రెడ్డి జోరు కృష్ణ కాంత్ బూతు అధ్యక్షులు రాజు అనిల్ గుణ తదితరులు పాల్గొన్నారు

మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి ఐక్యవేదిక

వనపర్తి నేటిదాత్రి ;
వనపర్తి పట్టణంలో మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ జన సమితి అధ్యక్షులు ఖాదర్ పాషా సీపీఐ నేత గోపాలకృష్ణ 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ గంధం నాగరాజ్ గంధం సుమన్ 15వ వార్డు ప్రజలు బండారు భాస్కర్ చికెన్ సెంటర్ శీను యాదమ్మ భాగ్యలక్ష్మి బండార్ మధు కోరారు వారు మాట్లాడుతూ రామ టాకీస్ నుంచి ఒక సైడ్ బీటీ రోడ్ ఒక సైడు బీటి రోడ్డు వేయకుండా వదిలి వేశారని గుంతలు ఉన్నాయని యూనియ న్ బ్యాంకు వరకు అదే విధంగా ఉన్నదని రోడ్డు ప్రమాదకరంగా ఉండడంవల్ల ద్విచక్ర వాహనాలు దుమ్ముతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే బీ టి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందిం చి మిగిలి పోయిన బిటి రోడ్డు ను వేయించాలని వారు విజ్ఞప్తి చేశారు పానగల్ రోడ్డు పాలిటెక్నిక్ రోడ్ కొత్తకోట రోడ్డు రోడ్ల విస్తరణ చేయకపోవడంతో రోడ్డు చిన్నగా ఉండటంవల్ల ప్రయాణికులు వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీజేఎస్ అధ్యక్షులు ఖాదర్ బాషా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో వచ్చిన నిధులను వాపస్ పోయాయని ఆ యొక్క జీవో ను మార్చి వెంటనే రోడ్ల విస్తరణ చేయాలని నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ విజయం కోరుతూ భద్రాచల పట్టణంలో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి

భద్రాచలం నేటి ధాత్రి

ఈరోజు భద్రాచలం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి పోరిక బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ భద్రాచల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని, ఎన్నికల ముందు చెప్పిన విధంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి తెలంగాణ ప్రజల మన్నులను పొందాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజల మనిషి మాజీ, మాజీ కేంద్ర మంత్రివర్యులు పోరిక బలరాం నాయక్ నిఅధిక మెజార్టీతో గెలిపించుకోవడం ద్వారా కేంద్రం నుంచి కూడా అభివృద్ధిని తీసుకొని వచ్చి నియోజకవర్గాన్ని సర్వనా సుందరంగా అభివృద్ధి చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో ఆయన ప్రజలకు వివరించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు రాస మల్ల రాము,అన్నెం రామిరెడ్డి, ఉబ్బ వేణు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి ఆర్టీసీ బస్టాండ్ లో కొత్త గా మరుగుదొడ్లు మూత్రశాల నిర్మానించాలి

వనపర్తి నేటిదాత్రి:

వనపర్తి;ఆర్టీసీ బస్టాండు లో మరుగుదొడ్లు మూత్రశాల లు నిర్మాణంకొత్తగా చేయాలని డిపో మేనేజర్
వేణుగోపాల్ కు తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గంధం సుమన్ వినతి పత్రం అందజేశారు ఈసందర్భంగాఅయిన మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ దాదాపు 45 సంవత్సరాల క్రిందట నిర్మాణం ప్రారంభం చేసినార ని ప్రయాణికులకు ప్రజలకు అప్పుడున్న జనాభాకు తగ్గట్లు మరుగుదొడ్లు మూత్రశాలను మహిళలకు పురుషులకు ఏర్పాటు చేసినార ని అన్నారు ప్రస్తుతం వనపర్తి జిల్లా కేంద్ర ము కావడం వలన 14 మండలాలు వివిధ గ్రామాలు ప్రజలు వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు ల ద్వారా ప్రయాణం చేస్తారని అక్కడికి వచ్చే ఆర్టీసీ బస్టాండ్ లో మరుగుదొడ్లు సరిపో వడము లేదని ప్రయాణికులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలకు ప్రయాణికులకు నూతనంగా మరుగుదొడ్లు మూత్రశాలు 30 ఏర్పాటు చేయాలి చేయాలని వనపర్తి జిల్లా ఆర్టీసీ డిఎం కు ఇచ్చిన వినతి పత్రంలో కో రా రు తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జి శ్రీకాంత్ ఉన్నారు

సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన పిప్పాల రాజేందర్

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!
Exit mobile version