సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్..
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి లో ఎల్బీనగర్లో కిరాయి కుంటున్న కాజీపేట నరేష్ సుమలత దంపతుల కూతురైన పాప కాజీపేట అక్షయను ఈరోజు ఆ కుటుంబాన్ని సందర్శించి పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది దీపావళి రోజున టపాకాయలు కాలుస్తుండగా పాపకు రెండు కాళ్లు కాలిపోయినవి ఒక కాలు ఆపరేషన్ చేయించినారు మరో కాలు ఆపరేషన్ చేయడం కొరకు ఆర్థిక స్తోమత లేక పాప మంచానికి పరిమితం అయిపోయినది ఆమె నడవలేక పోతున్నది ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పాప మంచానికి పరిమితం కావడం వలన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్థిక స్తోమత లేక మా పాపను మంచిగా చేసుకోలేని పరిస్థితి లేదని బాధపడుతూ ఉన్నారు సొంత ఊరు జూబ్లీ నగర్ రేగొండ మండలం నుండి వలస వచ్చి భూపాలపల్లి లో నివాసం ఉంటున్నాం వృత్తి రీత్యా పెయింటర్ పని చేసుకుంటున్నానని ఇవి నా కుటుంబ పోషణ కోసం మాత్రమే సరిపోతోంది పాపకు మెరుగైన వైద్యం అందించాలంటే మూడు లక్షల దాకా ఖర్చవుతుందని అన్నారు దయ దయమయిలైన స్వచ్ఛంద సంస్థలు మానవతావాదులు మేధావులు ఉద్యోగులు స్పందించి పాపకు కాలు ఆపరేషన్ కోసం సహాయం చేసే ఆదుకోవాలని సి.పి.ఐ ఎంఎల్ లిబరేషన్ పక్షాన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
నరేష్ ఫోన్ పే నెంబర్.9963368628.తోసిన సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాను