పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించడంలో ఉపాధి హామీ సిబ్బంది విఫలం

ధర్మసమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కోగిల జితేందర్

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఉపాధిహామీ పనులు జోరుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు మందకోడిగా సాగిన ఉపాధి పనులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ముగియడంతో చేసే పనులు లేక ఇంట్లో ఉంటే పూట గడిచే పరిస్థితులు లేకపోవడంతో కూలీలు ఉపాధి పనుల బాట పట్టారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా కూలీలు ఉపాధిహామీ పనులను రోజుకు వేల మంది కూలీలు వినియోగించుకుంటున్నారు.మండలంలో ఉపాధి పనికి వచ్చే కూలీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించడంలో ఉపాధిహామీ సిబ్బంది విఫలమయ్యారని ప్రదేశాల్లో కూలికి రక్షణకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలి ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు కూలీలకు నీడ కోసం పట్టాలు, మంచినీటి సౌకర్యం, మెడికల్ కిట్టులు, అందుబాటులో ఉంచాలి. అయితే ఆ సౌకర్యాలు ఇప్పటివరకు అమలు అంతంత మాత్రమే జరుగుతున్నాయి. వేసవి తాపం నుంచి కూలీలకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం త్వరితగతిన కూలీలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిచి, ప్రతి రెండు వారాలకు ఒకసారి పని జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించాలనీ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు చేశారు.

ప్రమాదపు అంచులో కరెంట్ లైన్

•గత సంవత్సర కాలంగా పరిష్కారం కానీ సమస్య.

•లైన్మెన్ వీరన్న కు ఎన్నిసార్లు చెప్పినా ఉపయోగం లేదు.

•పలుమార్లు చెప్పిన పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు.

•ఊరికి సమీపంలో ఉండడం వలన భయాందోళనలో గ్రామ ప్రజలు.

•అటుగా చూడకుండా వెళ్లిన మూగజీవాలు, మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది.

•పట్టుకుంటే చేతికి అందే అంత కింద ఉన్న కరెంటు తీగలు

వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటే ప్రమాద ల నుంచి బయటపడవచ్చు అంటున్న గ్రామ రైతులు.

మరిపెడ నేటి దాత్రి.

మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గుండెపుడి గ్రామంలో గ్రామ శివారులో ఉన్న నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం వెనకాల ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుండి వెళ్లినటువంటి లైను లో మొదట రెండు స్తంభాలు వేయవలసిన దూరంలో ఒకటే స్తంభం వేయడం వలన కరెంటు తీగలు కొంత కాలానికి లూస్ అయ్యి కిందికి వేలాడడం జరిగింది అయితే ఈ సమస్యను పరిష్కరించాలి అని గత కొంతకాలంగా అంటే దాదాపుగా సంవత్సరం క్రింద విద్యుత్ శాఖ వారికి అక్కడ ఉన్నటువంటి రైతులు మా సమస్యను పరిష్కరించాలి అని ఒక లెటర్ రాయడం జరిగింది పలుమార్లు గ్రామానికి సంబంధించిన లైన్మెన్ ని ఈ సమస్యపై సంప్రదించడం జరిగింది అయినా కూడా విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ వారు గానీ గ్రామానికి సంబంధించినటువంటి లైన్మెన్ గానీ ఎవరు పట్టించుకోవడం లేదు అని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు వాపోతున్నారు గ్రామానికి దగ్గరగా ఉండడం వలన అటుగా వెళ్లే మనుషులు గాని మూగజీవాలు గాని విద్యుత్ తీగలు తగిలి మరణించే అవకాశం ఉంది అయినా సరే పలుమార్లు అధికారులకు చెప్పిన నిమ్మకు నీరు ఎత్తినట్టే ఉంటున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లూజ్ పోల్స్ వేయాలి అని పలుమార్లు విజ్ఞప్తి చేసిన సమస్యను దాటవేస్తున్నారు అని అక్కడ జరగకూడనిది ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత విద్యుత్ శాఖ వారే వహించవలసి ఉంటుంది అన్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేకపోతే త్వరలోనే విద్యుత్ శాఖ ఆఫీస్ ముందు ధర్నాకు దిగుతాం అన్నారు, ఈ కార్యక్రమంలో గుండగాని. లింగరాజు, గణేష్, గుండాగాని. రమేష్, భద్రు తదితరులు పాల్గొన్నారు.

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు తెగిపోయిన రోడ్డుకు మరమ్మత్తులు.

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలం ఓడేడు గ్రామంలో బస్టాండ్ నుండి పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు వెళ్లే రోడ్డు ఇటీవల భారీ వర్షాలకు కొట్టుకుపోవడం జరిగింది అటు ప్రక్కనున్న రైతులు పొలాలు కోయుటకు వడ్లు తరలించడానికి రోడ్డు లేదు అని ఒడేడు గ్రామ రైతులు తెలుపగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెంటనే ఆదేశాల మేరకు డిసిసి ఉపాధ్యక్షులు మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ వెంటనే జెసిబి ని పంపించి రోడ్డుకు మరమ్మత్తులు చేపించడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఓడేడు గ్రామ మాజీ సర్పంచి సిరికొండ బక్కారావు, గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి చంద్రమౌళి కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవునూరి సదానందం,బొల్లపల్లి పోశాలు,తోట సుధాకర్,నరాల మల్లన్న, తదితరులు పాల్గొన్నారు..

6 గ్యారెంటీ ల అమలుతో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై రెట్టింపైన నమ్మకం

పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే భద్రాచలం అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్న నియోజకవర్గ ప్రజలు

భద్రాచలం నేటి ధాత్రి

మాజీ గ్రంథాల చైర్మన్ భోగాల శ్రీనివాసరెడ్డి

మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ విజయాన్ని కోరుతూ మాజీ గ్రంథాల చైర్మన్, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక భద్రాచలంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల హామీగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడం వల్ల,తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై ఉంచిన నమ్మకం ఆదరణ ఇప్పుడు మరింతగా పెరిగిందని

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల్లో తెలంగాణ ప్రజల ఆదరణతో విజయం సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ పయనం చేస్తుందని, మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు,పోరిక బలరాం నాయక్ ని భద్రాచలం నియోజకవర్గం ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

ఈ ఎన్నికల ప్రచారంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు రాసమల్ల రాము,అన్నెం రామిరెడ్డి, షాబీర్ భాష, మహిళా కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాణి, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

గద్వాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ సరఫరా

వనపర్తి నేటిదాత్రి;
గద్వాల పట్టణంలో ఈ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసి బస్టాండులో ప్రయాణికులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు వేసవికాలం అయిపోయేసరికి మజ్జిగ చల్లని మంచినీరు సరఫరా చేస్తున్నార ని ప్రయాణికులు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు . వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా గత సంవత్సరం మాదిరిగానే ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు చలివేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు వనపర్తి

బిఆర్ఎస్ పార్టీ కి నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు.

పార్లమెంట్ అభ్యర్థి గెలుపే
లక్ష్యంగా పనిచేయండి.

హసన్ పర్తి /నేటి ధాత్రి

వర్థన్నపేట నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో వర్థన్నపేటనియోజవర్గంలో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. హన్మకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి ,మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి , ఆధ్వర్యంలో నాగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బండారి స్వర్ణలత మరియు మాజీ ఉపసర్పంచ్ బండారి సాంబయ్య, తోట రవి బండారి రాజయ్య బండారి భీమయ్య గడ్డం రాజారాం బండారి శ్రీకాంత్ తో సుమారు 50 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు.ఈ సందర్బంగా వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకు ప్రజలను మోస పూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెల్లదీశారని అన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌ నాయకులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాత కొత్త అనే విభేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గారిని భారీ మెజారితో గెలిపించి వరంగల్ గడ్డ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి అని వారు కోరారు…
ఈ ఆహ్వాన కార్యక్రమం లో హాసన్ పర్తి మండల బీసీ సెల్ అధ్యక్షులు నక్క రవి ,గ్రామ అధ్యకులు గౌరు రాజీ రెడ్డి, కుమార్, అనిల్ ,బద్రి ,సాంబ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ పార్లమెంట్ డిఎస్పి అభ్యర్థిగా మేకల సుమన్

నడికూడ,నేటిధాత్రి:
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలంలోని కౌకొండ గ్రామానికి చెందిన మేకల సుమన్ మహారాజ్ ఎంపికై నట్లు రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ఒక ప్రక టనలో తెలిపారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడికి మేకల సుమన్ ధన్యవాదాలు తెలిపారు.వరంగల్ పార్లమెంటు ప్రజలంతా చెప్పు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.బహుజన వర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా ధర్మ సమాజ్ పార్టీ పనిచేస్తుందని మేకల సుమన్ వివరించారు.రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మనదేనని నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే బహుజనులకు న్యాయం జరిగేలా పోరాడుతానని అన్నారు.

నియోజకవర్గవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసిన శ్రీ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్పల్లి,ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి

కూకట్పల్లి నియోజకవర్గంలో పలు అసోసి యేషన్ సభ్యులు,పలు దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్పల్లి, బాలాజీనగర్, మూసాపేట్,ఫతేనగ ర్,బాలానగర్,ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు,శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముల వారి ఆశీస్సు లు అందరిపై ఉన్నాయని,ప్రతి పండుగ ను ఆనందగా జరుపుకుంటున్నా మని అన్నారు.బాల రామున్ని జనవరి 22న అయోధ్య మందిరంలో ప్రతిష్ఠించుకున్న విషయాన్ని గుర్తు చేశారు.ఈరోజు అయో ధ్య గుడిలో నేరుగా ఆ బాలరాముడి నుదుట మీదకు సూర్య కిరణాలతో సూర్య తిలకం అద్భుతంగా ఉందని
అన్నరు.అనంతరం అన్నప్రసాద కార్యక్ర మంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరిం చారు.ఆ తర్వాత మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్తో కలిసి పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నా రు.ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

కాన్కూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో బత్తుల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. గ్రామంలో గల ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవం వేడుక ఘనంగా నిర్వహించారు. అనంతరం హనుమాన్ దీక్ష స్వీకరించిన స్వాములకు మరియు సుమారు 1200 మంది భక్తులకు గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

తెలంగాణ ఉద్యమకారుడు ముక్కెర సాయిలు మృతి

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం తెలంగాణ రాష్ట్ర సమితిలో సీనియర్ ఉద్యమ నాయకులు తెలంగాణ జెండా పట్టిన నాటినుండి తెలంగాణ సాయిలు గా పేరు సంపాదించిన ముక్కెర సాయిలు గౌడ్ 85 సంవత్సరాలు అనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు బుధవారం గణపురంలో అంత్యక్రియలు జరిపారు.

ధర్మ రావు పేట గ్రామంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మ రావు పేట గ్రామంలోని ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. లోక కళ్యాణార్థం జరిగే భగవత్ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి స్వామివారి తీర్థ, అన్న, ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.స్వామివారి కల్యాణ మహోత్సవంలో రఘువంశం వరుడు రామయ్య తరపున ఆకుల సుభాష్ కుటుంబం సీతమ్మ తల్లి తరపున కన్న రాజయ్య కుటుంబం కొన్ని సంవత్సరాలుగా ఈ కళ్యాణం అర్చకులు లంక రాజేశ్వర్ శర్మ అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు.

ముత్తారం అభయాంజనేయ స్వామి కి నాగినేని దంపతుల

8 లక్షల వెండి అభరణాలు సమర్పణ

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి కి మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్ రావు దంపతులు
దాదాపు 8 లక్షల పైగ విలువగల వెండి అభరణాలను
అభయాంజనేయ స్వామి కి శ్రీరామనమని రోజున సమర్పించారు. గతంలో స్వామివారికి జగన్మోహన్ రావు వెండి తొడుగు తన సొంత ఖర్చులతో చేయిస్తానని గత సంవత్సరం శ్రీరామనవమి రోజున గ్రామస్తుల ముందు హామీ ఇచ్చిన మాటకు కట్టుబడి, ఈ శ్రీరామనవమి రోజున ఆభరణాలు చేపించి స్వామివారికి అలంకరించి మొక్కు చెల్లించుకున్నారు. దీంతో నాగినేని దంపతులను తాజా మాజీ సర్పంచ్ తూటి రజిత రఫీ లతోపాటు గ్రామస్తులు, ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ తన కుమారుడు విదేశాలలో ఉంటూ తన సొంత గ్రామమైన ముత్తారంలో అభయాంజనేయ స్వామికి ఇచ్చిన మాట తప్పకుండా ఆభరణాలు చేయించాలని చెప్పి, తన సొంత ఖర్చులతో ఆభరణాలు చేయించాడని తెలిపారు.

వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య

వెల్గటూరు నేటి ధాత్రి

జీవితంపై విరక్తి చెంది యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్గటూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెల్గటూరు మండలం కిషన్ రావుపేట గ్రామానికి చెందిన బండారి సత్తవ్వ 40 సంవత్సరాల యువతి జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్గటూరు ఎస్సై ఆర్. ఉమా సాగర్ తెలిపారు.ఎస్ఐ ఉమా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం కిషన్ రావుపేటకు చెందిన బండారి సత్తవ్వ ఒక సంవత్సరం కాలంగా నరాల నొప్పితో బాధ పడుతుందని అందుకు గాను జీవితం పై విరక్తి చెంది మంగళవారం రాత్రి ఇంటి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. మృతురాలి భర్త బండారి మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉమా సాగర్ తెలిపారు.

పూర్తయిన ఇందారం జామా మస్జీద్ నూతన కమిటీ ఎంపిక *

జైపూర్, నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గల జామా మస్జిద్ నూతన కార్యవర్గం కోసం మంగళవారం రోజున ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికలలో 89 ఓట్లతో నూతన
ప్రెసిడెంట్ గా మొహమ్మద్ యూసుఫ్ ఎన్నికయ్యారు. 94 ఓట్లతో వైస్ ప్రెసిడెంట్ గా సయ్యద్ అన్వర్ అలీ ఎన్నికయ్యారు. 83 ఓట్లతో జనరల్ సెక్రటరీగా మొహమ్మద్ జహీరొద్దీన్ ఎన్నికయ్యారు. నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులను గ్రామస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఎన్నికలను పకడ్బందీగా జరిపిన ఎలక్షన్ కమిటీ సభ్యులు మొహమ్మద్ ఫయాజుద్దీన్ (ఎక్స్ కోఅప్షన్ మెంబర్) ,మొహమ్మద్ బషీరొద్దీన్ (కారోబార్) , సయ్యద్ తయ్యబ్ అలీ(ఎక్స్ కోఅప్షన్ మెంబర్) , సయ్యద్ రఫీఖ్ , మొహమ్మద్ జైను, సలహాదారు మొహమ్మద్ అష్వక్ హుస్సేన్ ‌అలాగే డిసిపి,ఎసిపి,సిఐ,ఎస్సై, మరియు పోలీస్ సిబ్బందికి నూతనంగా ఎన్నుకోబడిన మస్జిద్ కమిటీ మరియు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నిజాంపేటలో బిఆర్ఎస్ కు భారీ షాక్

•ఎంపీపీ సహా, పలువురు మాజీ సర్పంచులు కాంగ్రెస్ లో చేరిక

నిజాంపేట: నేటి ధాత్రి ఏప్రిల్ 17

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలనను చూసి కాంగ్రెస్ పార్టీ లో పలువురు ఎమ్మెల్యేలు,మంత్రులు,సీనియర్ బి ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్న క్రామంలో ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు తో సహా పలువురు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ లో బుధవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలన చూసి పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరామన్నారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా మాజీ సర్పంచులు అమర సేనా రెడ్డి, చల్మెడ నరసింహారెడ్డి,నాగరాజు, తిప్పనగుళ్ళ యాదగిరి లు కాంగ్రెస్ లో చేరారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యం అన్నారు. తాము సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే నిధుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూడవలసి ఉండేదన్నారు. చాలా బిల్లు ఇప్పటివరకు రాలేవని వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా పార్టీలు చేరామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

శ్రీ రామలింగేశ్వర ఆలయంలో సీతారాములు కళ్యాణ వేడుకలు

గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర త్రికూట లయం లో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం వేద మంత్రోచ్ఛారణల మధ్య అంగ రంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇట్టి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి గ్రామంలోని ప్రజలు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు కొమురయ్య, అర్చకులు నవీన్ శర్మ, భాస్కర్ శర్మ, శివకుమార్ శర్మ, గణేష్, శేఖర్, సత్యనారాయణ, గొట్కూరి చందు, దాసరి మధుసూదన్, నక్క కొమురయ్య హనుమాన్ దీక్షపరులు మహిళలు గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా సీతారాముల కళ్యాణం,

నిజాంపేట: నేటి ధాత్రి ఏప్రిల్ 17

జగదానంద కారుడు జగదాభిరాముడు భక్తకోటి తిరుప పేరులతో పిలుచుకునే భద్రాద్రి రాముడీ కల్యాణ వేడుకలు కనుల పండుగగా సాగిందని వేలేటి రామ్మోహన్ శర్మ అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం రోజున సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు కళ్యాణం లో రాముడి తరుపున వీరమల్లు లింగం దంపతులు, సీతాదేవి తరపున స్థానిక ఎస్సై శ్రీనివాస్ రెడ్డి దంపతులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీతారాముల కళ్యాణం జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే మండల ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆ భగవంతున్ని కోరుకున్నామని తెలిపారు. అనంతరం ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు శ్రీ రామ్ దళ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు గ్రామ పురోహితులు రామ్ మోహన్ చేతుల మీదుగా క్రోది నామ సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈకార్యక్రమంలో చికోటి వెంకటేశం సిద్దరాం రెడ్డి, జీపీ స్వామి, తిరుపతి, వెంకట్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు అన్నారు.

ఖమ్మంపల్లి లో మాయమవుతున్న ఎర్రమట్టి గుట్టలు

రాత్రి కి రాత్రే లారీల్లో అక్రమంగా తరలింపు
చోద్యం చూస్తున్న అధికారులు

ముత్తారం :- నేటి ధాత్రి

ముత్తారం మండలంలోని ఖమ్మం పల్లి లో ఎర్ర మట్టి గుట్టలను కొంతమంది మాయం చేస్తున్నారు. గ్రామంలోని ఫారెస్ట్ భూముల్లో గల ఎర్ర మట్టి గుట్టలను గుర్తించిన వారు పదిహేను రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో జేసీబీతో తవ్వుతూ లారీల్లో వేరే ప్రాంతాల కు తరలిస్తున్నారు. అంతే కాకుండా రెండు రోజుల నుంచి ఫారెస్ట్ ను అనుకొని ఉన్న గుట్టలను మిషన్స్ తో రాత్రి సమయంలో గుట్టుగా బెందడు, కంకర తవ్వుతూ రాళ్లను తరలిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ప్రజలు వాపోతు న్నారు. కోట్లాది రూపాయల మైనింగ్ మినరల్ మింగుతున్న అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు

సీతారాముల వారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటి ధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి గ్రామంలో రాజ వేణుగోపాల స్వామి మరియు భవాని సమేత మహా లింగేశ్వర స్వామి ఆలయం లో సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణానికి పెద్దపెల్లి ఎమ్మెల్యే చితకుంట విజయ రమణారావు సీతా రాములను దర్శించుకున్నారు, ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఛైర్మెన్ ఆళ్ళ సుమన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి,రెడ్డి రజినీకాంత్,అంబాల కొమురయ్య, సిరీసెటి రాహుల్,బొంగొని శ్రీనివాస్,మాచర్ల రవీందర్,సాయిలు మరియు భక్తులు పాల్గొన్నారు.

శ్రీ అభయాంజనేయ దేవాలయంలో అంగ రంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం మహోత్సవం

హసన్పర్తి (నేటిదాత్రి) :
గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్లో
దేవన్నపేట గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణం మహోత్సవం భక్తులతో కళ్యాణమండపం నిండుగా జన సందోహంతో గ్రామ ప్రజలందరూ కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగ అత్యంత వైభోగపేతంగా వేద పండితుల వేదమంత్రాల తో శ్రీ సీతారాముల వారి కల్యాణాన్ని పూజారి బెజ్జంకి వెంకటేశ్వర్లు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు పాల్గొని ఎంతో ఆనందోత్సవాల నడుమ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు ఆలయ కమిటీ పాల్గొని స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ..

error: Content is protected !!
Exit mobile version