రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కొహిర్ మండలం దిగ్వాల్ లోని జిల్లా పరిషత్ తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల- న్యాలకల్ (TGSWRS) లో రోడ్డు భద్రతా మాసంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోహిర్ ఎస్ఐ నరేష్, డెక్కన్ టోల్ ప్లాజా సేఫ్టీ మేనేజర్ నాగరాజు విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల కారణాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ఉపాధ్యాయులు, డెక్కన్ టోల్ ప్లాజా సిబ్బంది పాల్గొన్నారు.
