గ్రామ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన నూతన సర్పంచ్
◆-: వినోద బాలరాజ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఝరాసంగం గ్రామ ప్రజలకు నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమా గుణం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు ఇచ్చిన మహోన్నత సందేశాలని, క్రీస్తు బోధనలు ఎప్పటికీ మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయి అని వినోద బాలరాజ్ పేర్కొన్నారు.మండల మరియు గ్రామ ప్రజలందరికీ మంచి జరిగేలా ఎల్లప్పుడూ దేవుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని క్రీస్తు ప్రభువుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు,
