విద్యుత్ సమస్యలకు 100 కెవి ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

విద్యుత్ సమస్య పరిష్కరం కోసం నూతన 100 కెవి ట్రాన్స్ ఫార్మర్ బిగింపు

◆-: శాశ్వతంగా సమస్యను తీర్చేందుకు కృషి చేస్తాం : 19 వ వార్డు ఇంచార్జ్ అరవింద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: ప్రజల సమస్యల పరిష్కరం కోసం నిత్యం వారికి అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని, వార్డులో విద్యుత్ సమస్య పరిష్కారం కోసం ఇంచార్జ్ డా చంద్రశేఖర్ ఆదేశాల మేరకు నూతన 100 కెవి ట్రాన్స్ ఫార్మర్ బిగిస్తున్నామని, రాబోయే వేసవి కాలం నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి తాగునీటి సమస్య పరిష్కరం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని 19 వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జ్ అరవింద్ అన్నారు.

సోమవారం నాడు పట్టణంలోని అల్లిపూర్ వార్డులో భాగమైన క్రిస్టియన్ కాలనిలో విద్యుత్ సమస్య పరిష్కరం కోసం 100 కెవి నూతన ట్రాన్స్ ఫార్మర్ పెట్టించడం జరుగుతుందని, విద్యుత్ సమస్య పరిష్కరం కోసం తమ విజ్ఞప్తిపై స్పందించినందుకు స్థానిక పార్లమెంట్ సభ్యులు సురేశ్ కుమార్, షెట్కార్, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఇంచార్జ్ డా చంద్రశేఖర్, విద్యుత్ శాఖ డిఈ, ఏఈ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలువుతున్నామని, పనులను వేగంగా పూర్తి చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ మరో మూడు రోజుల్లో పూర్తి చేస్తామని తమకు తెలపడం జరిగిందని అరవింద్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version