జమిలితో జాతీయ పార్టీలు ఔట్‌?

`ప్రాంతీయ పార్టీలకే లాభం!

`ప్రజాస్వామ్యంలో ఎన్నికలను నిరసిస్తే మొదటికే మోసం.

`బహుపార్టీల రాజకీయమే ప్రజాస్వామ్యంలోనే దేశానికి మేలు.

`అందరి అభిప్రాయాలతోనే ప్రగతి బాటలు.

`ఏక పార్టీ అధికారం నియంతృత్వానికి నిదర్శనం.

`గతంలో కాంగ్రెస్‌ ఎమర్జెన్సీ తెచ్చింది.

`ఇప్పుడు బిజేపి పరోక్షంగా అలాగే పాలిస్తోంది?

`జమిలితో మళ్ళీ కేంద్రంలో బలమైన సంకీర్ణం ఏర్పాటు.

`లుకలుకలు మొదలైతే మళ్లీ మొదటికి ఎన్నికలు.

`బిజేపి కలలు కళ్లలు.

`తొందరపాటు నిర్ణయాలు.

`బిజేపి నిండా మునగడం ఖాయం.

`అంతో ఇంతో కాంగ్రెస్‌ కే లాభం.

`సంకీర్ణాలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం.

`బిజేపి ప్రాంతీయ పార్టీలను మింగేస్తుందని భయం.

`ప్రాంతీయ పార్టీలను నిలబెట్టేదే జనం.

`ప్రాంతీయ పార్టీలను తుంచాలనుకోవడం మూర?త్వం.

`పదే పదే ఎన్నికలు అభివృద్ధికి ఆటంకం అనేది నిజం కాదు.

`పదేళ్ల నుంచి కొత్తగా అమలులోకి వచ్చిన పథకాలేమీ లేవు

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఎప్పుడైనా తొందరపాటు నిర్ణయాలు సత్పలితాలిచ్చిన సందర్బాలు లేవు. ముఖ్యంగా మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే తొందరపాటు నిర్ణయాలు తలకిందులైన చరిత్రలే కనిపిస్తాయి. ప్రస్తుతం మనదేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే బిజేపి జమిలీ ఎన్నికలపై అనేక అడుగులు వేసింది. అవి తప్పటడుగులు అని గ్రహించలేకపోతోందన్న వాదనలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జమిలీ ఎన్నికల మీద బిజేపి మెజార్టీ నాయకుల అభిప్రాయం ఏమిటని ఎవరిని ప్రశ్నించినా సమాధానం వుండదు. పైకి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించినా, వ్యక్తిగతంగా వారిలో భిన్నమైన అభిప్రాయలే వ్యక్తమౌతున్నాయి. కాని వాటిని పైకి చెప్పకోవచ్చు. వెల్లడిరచడానికి సాహసం చేయలేకపోవచ్చు. బిజేపి రాష్ట్రాలు కూడా అందుకు మినహాయింపుకాదు. కేంద్రం వేరు. రాష్ట్రాలు వేరు. మనది రాష్ట్రాల సమాఖ్య. అంటే రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం, ఆధిపత్యం ఎక్కువైతే కూడా వ్యతిరేకత మొదలయ్యే అవకాశం లేకపోలేదు. జమిలీ ఎన్నికల వల్ల బిజేపికి లాభమా? నష్టమా? అంటే నష్టమనే చెప్పాలి. ప్రజలు మూడుసార్లు గెలిపించారు. కాంగ్రెస్‌కు రెండుసార్లు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు కట్టబెట్టలేదు. మూడోసారి బిజేపి నాలుగు వందల సీట్లు గెలుపే లక్ష్యంగా సాగిన బిజేపికి ఆశనిపాతమే ఎదురైంది. గత ఎన్నికల్లో పూర్తి మెజార్టీ రాలేదు. మళ్లీ ఎన్డీయే కూటమి తప్పలేదు. రెండు పార్టీల సపోర్టు తప్పలేదు. అంటే ప్రజలు బిజేపికి ఇచ్చిన సంకేతాలు అని గ్రహించాల్సిన చోట జమిలీ ఎన్నికల నిర్వహణ అంటే బిజేకి తీరని నష్టం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. పైగా దేశంలో ప్రాంతీయ పార్టీలకు మళ్లీ ప్రజలు ఊరిపోస్తారని చెప్పవచ్చు. కాంగ్రెస్‌కు కూడా మరింత బలం చేకూర్చే అవకాశాలు కూడా రావొచ్చు. జమిలీ ఎన్నికల మీద మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ నివేదిక కూడా ఆగమేఘాల మీదే పూర్తి చేశారని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే జమిలీ ఎన్నికలు అనేవి సామాన్యమైన విషయం కాదు. రాష్ట్ర విభజన కాన్నా జఠిలమైన సమస్య. తెలంగాణ ఏర్పాటుకోసం ఏడాది కాలంపాటు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. మూడేళ్లపాటు కాలయాపన చేశారు. అలాంటిది జమిలీ ఎన్నికల మీద దూకుడు వల్ల జాతీయ పార్టీలు నష్టపోవడం తప్ప ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. ఒకే దేశం ఒకే ఎన్నిక..అన్న నినాదంలోనే అటు రాష్ట్రాల, ఇటు కేంద్రం ఎన్నికలు దాగి వున్నాయి.
రాష్ట్రాల ఎన్నికల విషయంలో ప్రజలు ఎంతో స్పష్టమైన నిర్ణయంతో వుంటారు. రాష్ట్రాల ఎన్నికలపై స్ధానిక సమస్యల ప్రభావం వుంటుంది. జాతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా వుండే ఉత్తరాధిలో కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా వున్నాయి. దక్షిణాదిలో కూడా ప్రాంతీయ పార్టీలదే హవా సాగుతుంది. తీరా ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఎన్డీయే కూటమి లేకుండా బిజేపి ఒంటరిపోరుకు సై అనే అవకాశం లేనప్పుడు, జమిలీ ఎన్నికలు నిర్వహించి లాభం ఏమిటి? ఒక వేళ బిజేపి ఈసారి వచ్చిన మెజార్టీ కూడా తగ్గితే బిజేపి బలం పెరిగినట్లౌతుందా? తగ్గినట్లౌతుందా? జమిలీ ఎన్నికలు తెస్తే దేశ ప్రజలంతా బిజేపిపైవే నిలుస్తారని చెప్పడానికి ఆధారాలేమిటి? కాంగ్రెస్‌ వైపు కూడా నిలువొచ్చు? ఆ పార్టీని కూడా ప్రజలు ఆదరించొచ్చు. మూడుసార్లు కేంద్రంలోఅవకాశం ఇచ్చిన ప్రజలు మార్పు కోరుకోవచ్చు. ఏదైనా జరగొచ్చు. రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు మళ్లీ పుంజుకోవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రాంతీయ పార్టీలు మరింత బలపడొచ్చు. రెండు ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు ఎన్టీయే కూటమి బిజేపికి పోటీ చేసే స్ధానాలు కూడా తగ్గొచ్చు. ప్రాంతీయ పార్టీలు బెట్టు చేయొచ్చు. అప్పుడు రెండు ఓట్లు మా పార్టీకే వేయాలని ప్రాంతీయ పార్టీలు సూచిస్తాయి. అసెంబ్లీ , పార్లమెంటుకు ఒకేపార్టీకి ఓట్లు వేయమని ప్రచారం చేస్తాయి. అప్పుడు జాతీయ పార్టీలకు తీరని నష్టం జరగొచ్చు. గత ఎన్నికల్లో బిజేపికి పూర్తి మెజార్టీ రాకపోవడంతో, బిజేపి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి రావడంతో ఆ రాష్ట్రాలు కోరిన నిధులు కేంద్రం ఇస్తోంది. ఇదే రేపటి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ప్రచారాస్త్రంగా మార్చుకునేందుకు అవకాశం వుంటుంది. మన రాష్ట్రాలకు కావాల్సిన నిదులు సాధించాంటే కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడితే ఇతోధిక నిదులు తెచ్చుకునే అవకాశం వుంటుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. గత ఎన్నికల ఫలితాల తర్వాత కేసిఆర్‌ అదే చెప్పారు. మనకు పది సీట్లు వస్తే, కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం వుండేదని అన్నారు. ఎందుకంటే ఏపికి, బిహార్‌కు నిధుల వరద పారుతోంది. తెలంగాణ విషయానికి వస్తే…నిధులేవి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అందుకే జమిలీ ఎన్నికలు అనేవి బిజేపి తొందరపాటు నిర్ణయంగానే భావించాలి. ప్రాంతీయ పార్టీలకు జీవం, పూర్వ వైభవం అనే చెప్పకతప్పదు. జమిలీ ఎన్నికల నిర్వహణ వల్ల పదే పదే ఎన్నికలు రావడం ఆగిపోతుందని చెప్పడానికి ప్రాతిపదిక ఏదీ లేదు. ఇందిరాగాంధీని వ్యతిరేకించి పార్టీని చీల్చిన సందర్భం కూడావుంది. రాజకీయ పార్టీలలో లుకలుకలు సహజం. భవిష్యత్తులో బిజేపికి అలాంటి ప్రమాదం రాదని చెప్పలేం. తమకు ప్రాధాన్యత తగ్గుతోందని భావించిన నేతలు మరో వేధక ఏర్పాటు చేసుకోవచ్చు. జమిలీపై ముందు బిజేపిలో ఏకాభిప్రాయం వుందా? అన్నది లోతైన చర్చ జరిగితే మేలు…
బిజేపిలో కేంద్రం నిర్ణయాలను బిజేపి పాలిత రాష్ట్రాలు పూర్తిగా సమర్ధించడానికి కారణాలు అనేకం వున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇంత కాలానికి బిజేపి బలపడే అవకాశం ఏర్పడిరది. దాన్ని తుంచుకోవాలని ఏ బిజేపి నాయకుడు అనుకోలేడు. అందుకే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారే తప్ప వారికి జమిలీ ఎన్నికల మీద నమ్మకం లేదు. విశ్వాసం అసలేలేదు. కాని బిజేపిలో మెజార్టీ అభిప్రాయం అని ఒక్కసారి కేంద్ర ప్రార్టీ ప్రకటించిన తర్వాత ఊ కొట్టడం తప్ప మరో గత్యంతరం లేదు. ఎందుకంటే ఒంటెద్దు పోకడలు పోయిన కాంగ్రెస్‌లో అనేక చీలికలు వచ్చాయి. ఇందరాగాంధీ హాయాంలోనే రెండుసార్లు చీలకలు రావడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న కాంగ్రెస్‌, స్వాతంత్రానికి ముందు వున్న కాంగ్రెస్‌ ఒకటి కాదు. అలాగే బిజేపిలో కూడా భవిష్యత్తులో చీలికలు రావని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. కాంగ్రెస్‌ నుంచి అనేక కాంగ్రెస్‌లు ఉద్భవించాయన్నది మర్చిపోవద్దు. ఎప్పుడైనా కేంద్రం వున్న నాయకులు తీసుకునే తొందరపాటు నిర్ణయాల మూలంగా ఇప్పటికిప్పుడు వ్యతిరేకత రాకపోయినా, భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందికరమైన పరిస్ధితులు రావని చెప్పలేం. ఎందుకంటే ఒకప్పుడు బిజేపి అంటే వాజ్‌పాయ్‌, ఎల్‌కే. అద్వానీ. తర్వాత కూడా చాల మంది నాయకులున్నారు. కాని వారు ఇప్పుడు ఎల్‌కే. అద్వాని పరిస్దితి ఏమిటో తెలియంది కాదు. బిజేపిలో ఒక్కొ ఇటుక పేర్చుకుంటూ వచ్చిన వారిలో ఎంతో మంది ఎక్కడున్నారో చూస్తూనే వున్నాం. అందువల్ల ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు వేరు. జమిలీ ఎన్నికల నిర్ణయం వేరు. ప్రధాని మోడీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత నోట్ల రద్దును తెచ్చారు. దాంతో దేశంలో నల్లదనం పూర్తిగా కనిపించకుండాపోతోందన్నారు. సాధ్యమైందా? పాత నోట్ల స్ధానంలో కొత్త నోట్లు తెచ్చారు. ఈ కొత్త నోట్లను తయారు చేయడం ఎవరి వల్లా సాద్యం కాదన్నారు. నకిలీ నోట్ల సృష్టికి అడ్డుకట్ట అని చెప్పారు. ఏమైంది? నకిలీ నోట్లు విచ్చలవిడిగా సర్కులేట్‌ అవుతున్నాయన్న వార్తలు వింటూనే వున్నాం. రాత్రికి రాత్రి రద్దు చేసిన నోట్ల రద్దు మూలంగా ఆర్దిక వ్యవస్ధ కుదేలైందన్న సంగతి అందరికీ తెలిసిందే. బిజేపి కూడా నోట్ల రద్దు సక్సెన్‌ అని చెప్పలేకపోతోంది. ఇక జిఎస్టీ విషయంలో కేంద్రానికి ఏటా ఎంత వసూలౌతుందన్న లెక్కలు తప్ప, సామాన్యులపై ఎంత భారం పడుతుందన్నది అందరూ అనుభవిస్తున్నదే. అలాగే వ్యవసాయ చట్టాలపై కూడా కేంద్రం యూటర్న్‌ తీసుకున్న సందర్భం వుంది. ఇక డిజిటల్‌ మనీ వాడకాన్ని పెంచారు. బాగానే వుంది. దాని ద్వారా కూడా కేంద్రం ఆదాయం సమకూర్చుకునే పనిలోవుంది. ప్రభుత్వాలంటే ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడానికి మాత్రమేనా? ప్రశ్న రాను రాను ఉత్పన్నం కాదని చెప్పలేం. ఇలా తొందరపాటు నిర్ణయాల ఖాతాలో జమిలీ కూడా చేరుతుందా? అన్న చర్చ మేధావులు వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!