` నిజమైన తెలంగాణ రుచి చూపించిన రేవంత్!
` అతిచేస్తే ఎవరికైనా గతింతే! ఎగిరెగిరి పడితే ఎవరిబతుకైనా అంతే!!
` అల్లుకున్నా, గిల్లుకున్నా వాళ్లంతా ఒక్కటే! కొట్టుకొని, తిట్టుకునే అభిమానులు ఎప్పుడూ వెర్రివాళ్లే!!
` సినీ మాయా నుంచి బ్కెట పడని వెర్రిజనం.
` అల్లు కోసం బిఆర్‌ఎస్ తాపత్రయం.
` సినిమా పరంగా తెలంగాణకు రేవంత్ అభయం.
` అల్లుకు ముల్లు గుచ్చిందని పంటితో తీసేందుకు బిఆర్‌ఎస్ ప్రయత్నం!
` తొలగిపోయిన బిఆర్‌ఎస్ ముసుగు రాజకీయం.
` అల్లు కోసం కదిలిన గులాబీ దండు!
` ఆంధ్రా సినిమా ఎప్పటికైనా తెలంగాణకు ప్రమాదమే!
` అల్లు కోసం ఒక్కట్కెన తెలుగు సినిమా!
` తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్!
` ఆంద్రా ప్రయోజనాల కోసం బిఆర్‌ఎస్.
` తెలంగాణ సినిమా బతికించాలని బిఆర్‌ఎస్ ఎప్పుడూ అనుకోలేదు.
` పదేళ్లుగా ఆంద్రా హీరోలను కంట్రోల్ చేయలేదు.
` తెలంగాణ సినిమాలకు ప్రోత్సాహం కల్పించలేదు.
` ఇప్పటికీ ఆంద్రా సినీ పెద్దల మీద బిఆర్‌ఎస్‌కు మమకారం తగ్గలేదు.
` కొండగట్టు ప్రమాదమప్పుడు అయ్యో అనేందుకు బిఆర్‌ఎస్ నేతలకు నోరు రాలేదు.
` వారిని చూసేందుకు కళ్లు,కాళ్లు రాలేదు!
` చిత్రపురిలో తెలంగాణ కార్మికులకు జరిగిన అన్యాయం బిఆర్‌ఎస్‌కు పట్టదు.
` అల్లు అర్జున్ అరెస్టు మీద బిఆర్‌ఎస్ అత్యుత్సాహం?
` అర్జున్ అరెస్టు మీద అంతగా స్పందించాల్సిన అవసరం ఎందుకు?
` ఆంద్రా వాళ్ల మొప్పు కోసం బిఆర్‌ఎస్ రాజకీయ ప్రయత్నం.
` అర్జున్ కోసం ఒక్కట్కెన రెండు కుటుంబాలు!
` ఇప్పటికీ అర్థం కాని వెర్రి అభిమానులు!
` సినిమా ప్రమోషన్ల కోసం ఎంతకైనా దిగజారతారు.
` అల్లు అర్జున్ అరెస్టును చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు.
` తెలంగాణలో ఆంధ్రా సినీ అహంకారం!
` ఇప్పటికీ తెలంగాణ మీద సినిమా పరంగా పెత్తనం.
` తెలంగాణ రాజకీయాల మీద అక్కసు ప్రయత్నం.
` ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం కోసం సినిమా నిర్మాణం.
` తెలంగాణ వ్యతిరేకంగా సినిమాలలో ప్రచారం.
` తెలంగాణ యాస మీద ఇప్పటికీ ఆగని సినిమా దౌర్జన్యం.
` ప్రశ్నించలేని బిఆర్‌ఎస్ దౌర్భాగ్యం.
` ఉద్యమ సమయంలో బిఆర్‌ఎస్ అవకాశవాదం.
` ఇప్పుడేందుకు మౌన రాగం.
పదేళ్ల తర్వాత తెలంగాణలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పడంలో సినీ హీరో అల్లు అర్జున్ అరెస్టే నిదర్శనం. గత పది సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాన్ని ఎదగకుండా మాత్రమే చట్టాన్ని వినియోగించి, చట్టాన్ని తన పని తాను చేయకుండా చేతులు కట్టేసిన చరిత్ర బిఆర్‌ఎస్‌ది. అలాంటి బిఆర్‌ఎస్ అల్లు అర్జున్ అరెస్టు మీద గగ్గోలు పెట్టడంలో జౌచిత్యం లేదు. అర్ధం అంతకన్నా లేదు. అసలు అల్లు అర్జున్ చేసిన పనిలో బిఆర్‌ఎస్ తప్పే కనిపించకపోవడం ఆ పార్టీకి పట్టిన దరిద్రం. దౌర్భాగ్యాం. తెలంగాణలో బెన్‌ఫిట్ షోల పేరుతో సినీ వ్యాపారం సాగిస్తున్న ఆంధ్రా హీరోలను నెత్తిన పెట్టుకొని, పదేళ్లపాటు వారి చేతి కీర్తించుకునేందుకు తాపత్రయపడిన బిఆర్‌ఎస్‌కు సినిమాకు వెళ్లిన సగటు ప్రేక్షకుడి కష్టం తెలిస్తే బాగుండు. కాని బిఆర్‌ఎస్ అంటేనే బలిసిన వారికి కొమ్ము కాసే పార్టీ అన్నది ఏనాడో తేలిపోయింది. అసలు సినిమా అనేది ఒకప్పుడు వినోదం. అదేమీ విజ్ఞాన బాండాగారం కాదు. చైతన్యానికి నిదర్శనం కానే కాదు. సామాజిక సృహను తట్టిలేపేది కాదు. జనం బలహీనలతను తెర మీద చూపించి, సొమ్ములు చేసుకోవడం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు సినిమా అంటే వంద రోజులు ఆడితే గొప్ప. ఇప్పుడు వారం రోజుల్లో వందల కోట్లు వసూలు చేస్తే గొప్ప. అలాంటి సినిమాలు తీసి, కోట్లు గడిరచే సినీ హీరోలకు ప్రభుత్వాలు వత్తాసు పలకడం అంటేనే దుర్మార్గం. ఒకప్పుడు బెన్‌ఫిట్ షోలు అంటే వచ్చే ఆదాయంతో ఏదైనా సామాజిక సేవా కార్యాక్రమాలు చేస్తామని చెప్పేవారు. కాని ఇప్పుడు వ్యాపాంర పెంచుకోవడానికి, లాభాలు రాబట్టుకోవడానికి మాత్రమే బెన్‌ఫిట్‌షోలు వేస్తున్నారు. సినిమా పిచ్చోళ్ల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. కోట్లు దండుకుంటున్నారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో కోట్లు సంపాదిస్తున్న సినీ వర్గాలు ఈ డెబ్బై సంవత్సరాల చరిత్రలో ఏనాడైనా తెలంగాణ సమాజానికి రూపాయి ఖర్చు చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటైనా వుందా? అదే ఆంధ్రాప్రాంతానికి మేలు చేసేందుకు మాత్రం ముందుకొస్తారు. కనీసం తెలంగాణ వచ్చిన తర్వాతనైనా తెలంగాణకు సాయం చేసిన దాఖలాలున్నాయా? వారికి చేతులొచ్చాయా? ఇటీవల ఖమ్మం జిల్లా వరదల్లో మునిగిపోతే ఏపికి చేసిన సాయంలో ఎన్నొ వంతు తెలంగాణకు వచ్చిందో చెప్పగలరా? బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా తెలంగాణ ప్రయోజనాల కోసం సినిమా హీరోలు ఏదైనా కార్యక్రమం చేపట్టారా? అంతకు ముందు ఎప్పుడైనా ఆదుకునే ప్రయత్నం చేశారా? తెలంగాణ రాకముందు తెలంగాణలో రైతుల చావులపై ఏనాడైనా సినీ వర్గాలు స్పందించాయా? ఆంద్రాలో తుఫాను అనగానే నటులంతా ముందుకొచ్చి లక్షలు సమర్పించిన సందర్భాలు కొకొల్లలున్నాయి. కాని ఏనాడు తెలంగాణ సమాజానికి పైసా ఖర్చు చేసిందిలేదు. పైగా చిరంజీవి దగ్గర నుంచి చిన్నా, పెద్ద నటులంతా ఆంధ్రా పక్షపాతమే చూపించారు. కాని ఏనాడు జై తెలంగాణ అనలేదు. ఇప్పటికీ అనరు. జై తెలంగాణ అని అనడానికి వారికి నోరు రాదు. కాని వాళ్ల కాళ్లకు ముళ్లు దిగితే మాత్రం కేసిఆర్ పంటితో తీస్తానంటాడు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే మాత్రం స్పందించరు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం నిర్మాణం అన్నది తెలంగాణకు శాపమని తెలిసినా, ఆ ప్రయత్నాలుఆపలేదు. ఇప్పటికీ పోలవరం వల్ల తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఆంద్రాలో కలిపితే కేసిఆర్ నోరు మెదపలేదు. వాటిని అడ్డుకునే ప్రతయ్నం చేయలేదు. పోలవరం వల్ల భద్రాచలం మునిగిపోతుందని తెలిసినా నోరు తెరిచే ప్రయత్నం చేయలేదు. అలాంటి బిఆర్‌ఎస్ ఇప్పుడు అల్లు అర్జున్ అనే నటుడుని తెలంగాణ ప్రభుత్వం అరెస్టు అనగానే గగ్గోలు పెడుతున్నారు. ఇంత వరకు పుష్ప సినిమా వల్ల మరణించిన మహిళ కుటుంబాన్ని ఏ బిఆర్‌ఎస్ నాయకుడు పరామర్శించింది లేదు. ఆ కుటుంబానికి తాము కూడా అండగా వుంటామని చెప్పింది లేదు. చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న అబ్బాయిని చూసేందుకు ఆసుపత్రికి వెళ్లిన వాళ్లు లేరు. పుష్ప సినిమా వల్ల ఒక మహిళ చనిపోతే రెండు రోజుల వరకు కూడా అల్లు అర్జున్ స్పందించింది లేదు. తెలంగాణ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని తెలిసిన తర్వాతే అర్జున్ స్పందించాడు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి చేతులు దులుపుకున్నాడు. సినిమా ప్రమోషన్ కోసం బైటకు వచ్చిన అల్లు అర్జున్ ఆ మహిళ మృతదేహాన్ని సందర్శించి నివాళులు ఎందుకు అర్పించలేదు. ఇప్పటి వరకు ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్దపడే వాళ్లకు హైదరాబాద్‌లోనే చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించేందుకు సమయం చిక్కలేదా? ఎంతో భవిష్యత్తు వున్న ఒక బాలుడి జీవితం ఇలా అంధకారమైందన్న బాద బిఆర్‌ఎస్‌కులేదు. కాని అల్లు అర్జున్ అరెస్టు మాత్రం బిఆర్‌ఎస్ నాయకులను ఎంతో కలిచి వేస్తోంది? కొండగట్టు బస్సు ప్రమాదం జరిగిన సమయంలో బాధితులను పరామర్శించేందుకు కూడా బిఆర్‌ఎస్ నాయకులకు ఆనాడు కళ్లు, కాళ్లు రాలేదు. కాని ఇప్పుడు అల్లు మీద మమకారం పొంగిపోతోంది? ఇలాంటి అవకావ వాద రాజకీయ నాయకులు మూలంగానే తెలంగాణకు ఈ పరిస్దితి దాపురించిందని చెప్పకతప్పదు. నిజానికి బిఆర్‌ఎస్ చేయాల్సిన పని అదికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. అందుకు ప్రభుత్వాన్ని హర్షించాల్సిన బాధ్యత బిఆర్‌ఎస్ మీద వుంది. ప్రభుత్వం ఒక వేళ అలసత్వం వహిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి చేసి అల్లు అర్జున్‌ను అరెస్టు చేయాలని బిఆర్‌ఎస్ డిమాండ్ చేయాలి. కాని ప్రభుత్వం అల్లును అరెస్టు చేస్తే బిఆర్‌ఎస్ ఆగమాగం కావడంలో అర్ధం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఆ సినిమాలే వుంటాయి. దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎన్ని వున్నా అన్ని రాష్ట్రాలలో ఆయా ప్రాంతీయ సినిమాలకే అక్కడి ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తాయి. దేశంలో హిందీ సినిమాలకు రాజధాని అయిన బొంబాయిలో హిందీ సినిమాలే కాదు, మహా రాష్ట్రకు చెందిన మరాఠీ సినిమాలు కూడా నిర్మాణం జరుగుతాయి. మహారాష్ట్ర మొత్తం మరాఠీ సినిమాలు ఆడుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తరాధిన అన్ని రాష్ట్రాలలోనూ ఆయా బాషాచిత్రాలు నిర్మిస్తారు. ప్రదర్శిస్తారు. గుజారాతీ, బెంగాలి, ఒరియా, బోజ్‌పురి, పంజాబీ అన్ని బాషల్లోనూ సినిమాలుంటాయి. అలాగే తెలుగు రాష్ట్రాలు రెండు వున్నా, తెలంగాణ సినిమా అన్నదానికి చిరునామా లేకుండా చేస్తున్నవారిని బిఆర్‌ఎస్ వెనకేసుకురావడం వారి బావదారిద్య్రానికి నిదర్శనం. పదేళ్లు అదికారంలో వుండి కూడా బిఆర్‌ఎస్ ఏనాడు తెలంగాణ సినిమాను ప్రోత్సహంచింది లేదు. తెలంగాణ సినమాలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చింది లేదు. తెలంగాణ సినిమాలకు ధియేటర్లు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఏనాడు చెప్పింది లేదు. తమిళనాడులో తులు సినిమాలు కూడా నిర్మాణమౌతాయి. నడుస్తాయి. తెలుగు విషయంలో తెలంగాణ యాస వేరు. సంస్కృతి వేరు. ఆచార వ్యవహరాలు వేరు. సంప్రదాయాలు వేరు. తెలుగు సినిమాల్లో మేన కోడలును హీరోలు పెళ్లి చేసుకునే సంప్రదాయాలను చూపిస్తారు. కాని తెలంగాణలో మేన కోడలు అంటే అమ్మతో సమానంగా చూస్తాం. చెల్లితో సమానంగా గౌరవిస్తాం. అమ్మలా కొలుస్తాం. ఆడబిడ్డగా కాళ్లు మొక్తుతాం. కాని ఆంధ్రాలో అక్క కూతురు, చెల్లి కూతురును పెళ్లి చేసుకుంటారు. పైగా మేనత్త కూతరును తెలంగాణలో పెళ్లి చేసుకోరు. కేవలం మేన మామ కూతరును మాత్రమే పెళ్లిచేసుకుంటారు. కాని ఆంద్రాలో మేనత్త, మేన మామ కూతురైనా సరే పెళ్లి చేసుకుంటారు. మాట్లాడేది తెలుగే కదా? అని ఎంతో గొప్పదైన తెలంగాణ సంస్కృతికి మచ్చ తెచ్చేలా వుండే సినిమాలను ప్రజలు ఆదరించాలనే ఇంకా కోరుకుంటున్నారా? బిఆర్‌ఎస్ సమాదానం చెప్పాలి. తెలంగాణ కార్మికులకు చిత్ర పురి కాలనీలో చోటు లేకుండా చేశారు. ఒక వేళ ఎవరైనా వున్నామంటే వారిని తరిమేశారు. చిత్రపురి వైపు రాకుండా చేశారు. ఆంద్రా అయితే చాలు అందరికీ పఫ్పు బెల్లం పంచినట్లు పంచుకున్నారు. కాని తెలంగాణ కార్మికులకు సినీ పెద్దలు తీరని అన్యాయంచేశారు. వారిలో ఒక్కరికైనా బిఆర్‌ఎస్ ప్రభుత్వం న్యాయం చేసిందా? అలాంటి బిఆర్‌ఎస్‌కు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిచంచే నైతిక హక్కు వుందా? అయిన వాడికి ఆకుల్లో కాని వాడికి కంచాల్లో పెట్టడం బిఆర్‌ఎస్‌కు అలవాటే? కాని కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాంటి అలవాటు లేదని తేల్చి చెప్పారు. చట్టానికి ఎవరూ అతీతలు కాదని నిరూపించారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే నిరూపించారు. దటీజ్ తెలంగాణ ప్రభుత్వం అని చాటి చెప్పారు. మరోసారి ఇలాంటి అతి ఎవరూ చేయకుండా చర్యలు తీసుకున్నారు. సినిమా ప్రమోషన్ పేరుతో ఎక్కవ చేస్తే కటకటాలు తప్పవని హెచ్చరించారు. ఇదీ అసలైన తెలంగాణ ప్రభుత్వం అని అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకొని వుండేలా చేశారు. సినిమా వాళ్లంటే ఆకాశం నుంచి ఊడిపడలేదు. చట్టాలకు వాళ్లు అతీతులు కాదు. బిఆర్‌ఎస్ ప్రభ్వుం, గతంలో ఉమ్మడి ప్రభుత్వాల కాన్న అతి ప్రయోజనాలు కల్పించింది. తెలంగాణ సంస్కృతిని ఒక రకంగా అణచివేసేందుకు కూడా బిఆర్‌ఎస్ పరోక్షంగా సహకరించింది. అందుకే ఇప్పుడు అసలైన తెలంగాణ అస్ధిత్వం కనిపిస్తుంటే చూసి ఓర్వలేకపోకపోతోంది. ఆంద్రా సినీ పెద్దలు వత్తాసు పలుకుతోంది. అసలు చట్టం తన పని తాను చేసుకుపోతుంటే బిఆర్‌ఎస్‌కు ఎందుకు కంకకింపు కలుగుతుందో అర్ధం కాదు. ఒకప్పుడు రామోజీ ఫిల్మ్‌సిటీని లాక్కుంటాము..లక్ష నాగళ్లతో దున్నిస్తామని చెప్పి, మాట మర్చినప్పుడే కేసిఆర్ అసలు రంగు బైట పడిరది. ఇప్పుడు రేవంత్ సర్కారు ఆంద్రా పెత్తందారులుగా మారి తెలంగాణ సమాజంపై ఆదిపత్యం చేస్తున్న సినీ వర్గాలకు సరైన గుణపాఠం చెబుతుంటే బిఆర్‌ఎస్‌కు మింగుడు పడడం లేదు.