మంటగలుస్తున్న మానవత్వం!

-అల్లు పరామర్శలకు మీడియా ప్రాధాన్యం.

-బాధితుల కుటుంబంలో ఆవహించిన నిర్వేదం.

-సగటు తెలంగాణ గుండె చలించినా, కనికరం లేని సినీ రంగం.

-బాధితులకు సానుభూతి కూడా దక్కని ధైన్యం.

-అల్లుకు మాత్రం అండగా సినీ లోకం.

-అల్లు అరెస్టును జీర్ణించుకోలేని సినీ జనం.

-అల్లుకు పరామర్శలు…బాధితుడికి కడుపుకోతలు!

-భార్యను కోల్పోయి, కొడుకు ఆసుపత్రిలో వుంటే పలకరించే వారు లేరు.

-బాధితులకు అధికార పక్షం అండ.

-అల్లుకు ప్రతిపక్షాల నీడ.

-ఆంద్రా సినిమా పోతే…తెలంగాణ సినిమా వస్తుంది!

-నిజమైన తెలంగాణ వాది రేవంతే అని మరోసారి రుజువైంది.

-తెలంగాణ కోసం తెగింపు ఉన్నది రేవంత్‌ కే అని అర్థమౌతోంది.

-తెలంగాణ సినిమా ఎదిగితే లంబాడ భాష సినిమాలు వస్తాయి.

-తెలంగాణలో అన్ని రకాల సినిమాలు బతుకుతాయి.

-తెలంగాణ సినిమా మరింత వెలుగులోకి వస్తుంది.

-ఆ నాలుగు కుటుంబాల పెత్తనం ఆగిపోతుంది.

-తెలంగాణ సినిమా తలెత్తుకుంటుంది.

-తెలంగాణ యాసకు పట్టం కట్టే రోజులొస్తాయి.

-తమిళనాడు నుంచి తరిమినట్లు తరిమితే తప్ప తెలంగాణ బాగుపడదు.

-తెలంగాణ ఆనవాలు లేకుండా చేసిన ఆంద్రా సినిమా ఆగిపోతుంది.

-తెలంగాణ విలువ అప్పుడు తెలిసొస్తుంది.

-క్రమంగా అది మీడియా మీద కూడా పడుతుంది.

-తెలంగాణలో ఆంద్రా వార్త కనబడకుండా పోతుంది.

-తెలంగాణలో ఆంధ్ర ఆనవాలు ఉన్నంత కాలం తెలంగాణ సంస్కృతి బతకదు.

-ఆంద్రా పెత్తనం సాగినంత కాలం తెలంగాణ సినిమా వెలుగులోకి రాదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
మానవత్వం మంట గలుస్తోంది. సినిమా అనేది ఒకప్పుడు వినోదం. ఇప్పుడు వ్యాపారం. పూర్తిగా వ్యాపార ధోరణి పులుకున్న వ్యవహారం. సామాజిక చైతన్యం వదిలేశారు. ఒకప్పుడు సినిమా అంటే ఏదో ఒక మంచి సందేశమిచ్చేవారు. ఇప్పుడేం చేస్తున్నారు. సినిమాలో విలనే హీరో అవుతున్నాడు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే అంశాలనే జోడిస్తున్నారు. ఒకడు బ్యాంకును ఎలా మోసం చేయాలో చూపిస్తున్నాడు. మరొకడు ఎర్ర చంద్రనం నేఫధ్యంలో వేలం వెర్రి వేశాలు తెరమీద వేస్తున్నాడు. ఎర్రచందనం అనుమతి లేకుండా సరఫరా చేసేవారిని స్మగ్లర్లు అంటారు. మరి అలాంటి వారిని హీరోలుగా చూపిస్తూ, సినిమాలు తీస్తున్నారు. సీక్వెల్‌ మీద సీక్వేల్‌ తీస్తూ ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నట్లు తెరమీద నటిస్తున్నారు. ఆ సినిమాలు విజయవంతం కావడంతో అవే హిట్‌ ఫార్ములా అనుకుంటున్నారు. వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నామని చెబుతున్నారు. వేల కోట్లు రాబట్టుకునే వ్యాపారం చేస్తున్నారు. అందుకు ఎంతైకనా దిగజారుతున్నారు. పుష్ప 2 సినిమా నేర్పిన పాఠం పాపమై పండిరది. కాని ఒక కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. అభిమాన నటుడని సినిమాకు వెళ్తే ప్రాణమే పోయింది. జనం తొక్కిసలాటలో ఓ తల్లి మరణించింది. ఆ తల్లి కుమారుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్నాడు. అలాంటి కుటుంబం మీద ఎవరికీ సానుభూతి లేకుండాపోయింది. సమాజంలో మానవత్వంపూర్తిగా కనుమరుగౌతోంది. ఏ హీరో వల్ల అయితే ఓ కుటుంబం చిన్నాభిన్నమైందో ఆ కుటుంబాన్ని ఆ సినిమా పెద్దలు కలిసింది లేదు. వారిని పరామర్శించింది లేదు. ఆ హీరో ఇప్పటి వరకు ఆ కుటుంబానికి ఓదార్చింది లేదు. ఓ 25లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకుందామనుకున్నాడు. కాని పాపం వెంటాడిరది. శాపం ముందు ముందు ఇంకా తగలనుంది. అసలు ప్రీమియర్‌ షోలంటూ హడావుడి చేయడమే తప్పు. సినిమాలు ఎవరు తీయమంటున్నారు? ఎవరికి కోసం తీస్తున్నారు? ప్రీమియర్‌ షోలంటూ ఎందుకు హడావుడి చేస్తున్నారు. ఎంత చిన్నహీరో అయినా తొలి రోజు ఎంతో కొంత హడావుడి వుంటుంది. గతంలో సినిమా విడుదలైన కొన్ని వారాలకు హీరోలకు టూర్లు పెట్టుకునేవారు. సినిమా ధియేటర్లు సందర్శించేవారు. మరిన్ని కలెక్షన్లు రాబట్టుకునే ప్రయత్నం చేసేవారు. పనిలో పనిగా ప్రేక్షకులుకు కృతజ్ఞతలు తెలిపేవారు. కాని దానికి చరమగీతం పాడారు. ఇప్పుడు పెద్ద హీరోలు సైతం మొదటిరోజే సినిమా ధియేటర్లకు వచ్చి హడావుడి చేయడం అలవాటు చేసుకుంటున్నారు. దాంతో వినోదం కాస్త విషాదాలు మిగిల్చుతున్నాయి. పుష్ప`2 సినిమా విషయంలో విపరీతమైన హైప్‌ క్రియేట్‌ చేశారు. ధియేటర్లున్నీ బుక్‌ అయ్యాయి. ఇంకా ఎందుకు ఆపేక్ష. వేల కోట్లు రాబట్టుకునేంత కథ, కధనం వుంటే ఆ సినిమా వద్దన్నా హిట్‌ అవుతుంది. గతంలో ఎలాంటి పబ్లిసిటీ లేకున్నా సినిమాలు హిట్‌ అయిన సందర్భాలు అనేకం వున్నాయి. ఇంత ప్రచారం చేసుకునే వీలు లేని సమయాల్లో కూడా సినిమాలు రికార్డు కలెక్షన్లు వసూలు చేశాయి. కాని ఇప్పుడు ఏళ్లకేళ్లు సినిమా తీసి, వారం రోజుల్లో డబ్బులు వసూలు చేసుకోవాలనే దుర్భుద్దితో అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారు. ప్రేక్షకులను బలి తీసుకుంటున్నారు. పుష్ప సినిమా ప్రీమియర్‌ షోకు అల్లు అర్జున్‌ రావడం నేరం. ఏ సినిమా విడుదైనా సహజంగా ముందు రోజు పోలీసులకు నామ మాత్రంగా బందోబస్తు కోసం వినతి పత్రాలు ఇవ్వడం సహజం. అంతే కాని అల్లు అర్జున్‌ రావడం వల్ల క్రౌడ్‌ పెరగుతుందని తెలుసు. పోలీసులు పర్మిషన్‌ దొరక్కపోవచ్చని తెలుసు. అందుకే తూతూ మంత్రంగా వినతిపత్రం ఇచ్చి, పోలీసులు బందోబస్తు సమకూర్చలేదని డిపార్టుమెంటు మీద నెపం నెట్టేయడం సిని వర్గాలకు బాగా అలవాటైపోయింది. పుష్ప సినిమాలో స్మగ్లర్‌ హీరో పోలీసులకు సవాలు విసరడం వేరు. నిజ జీవితంలో పోలీసులతో ఆడుకుంటే పర్యవసనాలు వేరు. కాని ఆ వ్యత్యాసం చాలా మందికి తెలియక తప్పు చేస్తుంటారు. అల్లు అర్జున్‌లాగా ఇరుక్కుంటారు. అయినా అల్లు అర్జున్‌ అరెస్టు సినీమా రంగానికి ఒక గుణపాఠమౌతుందని అందరూ అనుకున్నారు. కాని ఒక్క పూట జైలుకు వెళ్లినంత మాత్రాన అల్లు అర్జున్‌కు ఒక రోజంతా సినీ పెద్దలందరూ తరలి వచ్చి పరామర్శలు చేయడం విడ్డూరం. ఆ అల్లు అర్జున్‌ సినిమా మూలంగా తొక్కిసలాటలో మరణించిన కుటుంబాన్ని పరామర్శించలేకపోవడం సినీ లోకం దౌర్భాగ్యం. ఒక రకంగా దుర్మార్గం. అల్లు అర్జున్‌ సినిమా మూలంగా ఒక కుటుంబం సర్వస్వం కోల్పోయినా ఇది కామన్‌ అన్నట్లు హీరో నుంచి మూడు రోజుల పాటు ఎలాంటి స్పందన రాలేదు. కనీసం ఏం జరిగిందన్నది తెలుసకునే ప్రయత్నం చేయలేదు. మీడియా నుంచి ఒత్తిడి వస్తుండడంతో పరిహారం చెల్లించి, చేతులు దులుపుకుందామనుకున్నాడు. కాని తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని చాల సీరియస్‌గా తీసుకోవడం ఎంతో ఆహ్వానించ దగ్గ పరిణామం. తెలంగాణ నుంచి ఎక్కువ వసూళ్లు చేసుకొని వ్యాపారం సాగించుకునే వర్గాలు, ఓ కుటుంబంలో విషాదం నిండితే పట్టించకోకపోవడాన్ని సమాజం చూస్తూ ఊరుకోలేదు. ప్రశ్నల వర్షం కురిపించింది. సోషల్‌ మీడియా పుణ్యమా అని అల్లు అర్జున్‌కు చుక్కలు చూడాల్సి వచ్చింది. ఇక్కడ సోషల్‌ మీడియా లేకపోతే, ప్రధాన మీడియా స్రవంతి సినిమా ప్రమోషన్‌ మాత్రమే చేసేది. ఆ సినిమాకు వసూళ్ల లెక్కలు గొప్పగా చెప్పేది. కాని ఇప్పుడు సోషల్‌ మీడియా వల్ల ప్రధాన మీడియా కూడా సినీ వర్గాలను ప్రశ్నిస్తోంది. అయినా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని గురించి వార్తలు ప్రసారం చేయడానికి ప్రధాన మీడియా స్రవంతికి మనస్సు రాలేదు. కాని అల్లు అర్జున్‌ను పరామర్శలకు మాత్రం లైవ్‌లు ఇచ్చారు. ఒక రోజంతా అవే వార్తలు ప్రసారం చేశారు. దీనికి బిఆర్‌ఎస్‌ లాంటిపార్టీ వంత పాడడం విడ్డూరం. సినిమా వల్ల నష్టపోయిన కుటుంబానికి అండగా నిలవాల్సిన బిఆర్‌ఎస్‌ అల్లు అర్జున్‌కు సపోర్టు చేయడం ఆ పార్టీ దౌర్భాగ్యం. సినీ రంగం మీద బిఆర్‌ఎస్‌కు ఎనలేని ప్రేమ ఎందుకు? సినీ పెద్దల మీద అంత మమకారం ఎందుకు? ఓట్లు వేసి గెలిపించేది ప్రజలు. గద్దెనెక్కించేది ప్రజలు. కాని ఎన్నికల నాడు కనీసం బైటకు రాకుండా, ఓట్లు వేయకుండా వుండే సినీ రంగం మీద బిఆర్‌ఎస్‌కు సానుభూతి ఎందుకు? తెలంగాణకు పైసా ఉపయోగం లేని ఆంధ్రా సినిమా పెద్దలపై అంత ప్రేమ ఎందుకు? ఉద్యమ సయమంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ప్రజలు అంటుంటే, ఇదే మెగా, అల్లు, మంచు కుటుంబాలు సమైక్యాంధ్ర అన్నారు. అసలు హైదరాబాద్‌కు తెలంగాణకు సంబంధమే లేదన్నారు. తెలంగాణ కావాలంటే హైదరాబాద్‌ వదులకోవాలన్నారు. ఇప్పటికీ కుట్రలు పన్నుతూనే వున్నారు. 2014 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు కేవలం 62 సీట్లు రావడానికి కారణం సినీ రంగమే అన్న సత్యం బిఆర్‌ఎస్‌కు తెలియదా? అయినా వారిని నెత్తిన పెట్టుకొని, రాజకీయ ప్రయోజనాల కోసం బిఆర్‌ఎస్‌ పాకులాడిరది. అందుకే ఇంకా తెలంగాణ మీద ఆంద్రా సినీ జనం విషం ఆగడం లేదు. తెలంగాణ సినిమాకు దిక్కులేదు. పదేళ్లలో తెలంగాణ సినిమాను ప్రమోట్‌ చేయలేదు. తెలంగాణ నుంచి టెక్నీషన్లను ఎదగనివ్వలేదు. కొత్త డైరెక్టర్లను రానివ్వలేదు. ఒక్క హీరో కూడా పదేళ్లులో ఉద్భవించలేదు. కాని ఈ పదేళ్లులో అదే ఆంద్రాకు చెందిన హరీలో పదులు సంఖ్యలో వెలుగులోకి వచ్చారు. పెద్ద పెద్ద హీరోలైపోయారు. ఇప్పటికీ తెలంగాణ యాసను అవమానపర్చుతూనే వున్నారు. ఈపాపం బిఆర్‌ఎస్‌ది కూడా..తెలంగాణ తెచ్చి ఆంద్రాకు దోచి పెట్టడానికేనా బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది? అన్న ప్రశ్నలు కూడా అనేకం వినిపించాయి. తెలంగాణ నిర్మాతలను ప్రోత్సహించలేదు. తెలంగాణ నిర్మాతలకు స్థలాలివ్వలేదు. వారికి స్టూడియోలకు భూముల్విలేదు. కాని ఆంద్రా హీరోలు పెద్దపీట వేశారు. వారు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. తెలంగాణ సినిమాను బొందపెట్టే కుట్ర చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూపంలో తెలంగాణకు ఆత్మగౌరవం దక్కుతుంది. తెలంగాణలో పిచ్చిపిచ్చివేషాలేస్తే ఎంతటి వారినైనా తాట తీస్తామని హెచ్చరించినట్లైంది. తెలంగాణలో వెర్రి వేషాలువేస్తు తరిమేస్తామని భయపెట్టినట్లైంది. చట్టం తన పని తాను చేసేలా ప్రజా పాలన సాగింది. అందుకే మొదటిసారి సినీ రంగంలో భయం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం అంటే గుబులు రేగింది. ఇదిలాగే కొనసాగాలి. తెలంగాణ సినిమాకు మంచి రోజులు రావాలి. ఆ నాలుగు కుటుంబాల ఆధిపత్యం పోవాలి. తెలంగాణ సినిమా తెరమీద రికార్డులు సృష్టించాలి. అంతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!