మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ పై మాట్లాడే అర్హత నీకు లేదు అని హెచ్చరించిన
బిఆర్ఎస్వి జిల్లా కార్యదర్శికంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టిఆర్ఎస్వి జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ మీరు మా కేటీఆర్ పైన మాట్లాడే అర్హత నీకు లేదని తెలియజేస్తున్నా బిఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేటీఆర్ పొగడ్తూ షాడో సీఎం అన్న సంగతి గుర్తుకు రాలేదా అని హనుమంతరావును ప్రశ్నించిన కంచర్ల రవి గౌడ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవి ఇచ్చింది కేటీఆర్ మర్చిపోయావా. సిరిసిల్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదని అన్నారు కేటీఆర్ ఎంత అభివృద్ధి చేసిండో సిరిసిల్ల ప్రజలకు తెలుసు అని అన్నారు సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ ను ఎప్పటికీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అన్నారు మిమ్మల్ని మల్కాజ్గిరి ప్రజలు తిరస్కరించిన విషయాన్ని మర్చిపోదని గుర్తు చేశారు కేటీఆర్ ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసినా మహా నాయకుడు అని తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు కేటీఆర్ గారి పైన మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ అభిమానులుగా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాయి,సూర్య ఎస్.కె అప్రోచ్ మట్టి శ్రీనివాస్, అనిల్, నరేష్, అరవింద్ జోసఫ్,సురేష్,రాజేందర్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.