ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు . .
రాయికల్. నేటి ధాత్రి. జులై 07
రాయికల్ పట్టణ కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దొబ్బల వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మార్పీఎస్ జెండాను వేణు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు మంచి వైద్యం అందాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎబిసిడి వర్గీకరణను నేడు సాధించారని కొనియాడారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకుడు బాపురపు నర్సయ్య, తలారి రాజేష్, వెంకటేష్, ప్రకాశ్, రాజేష్, సాయిలు, దిల్ రాజు, నిగ రాజేష్ వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.