ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన ఎంపీడీవో..
నిజాంపేట: నేటి ధాత్రి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఎంపీడీవో రాజీరెడ్డి పరిశీలించారు. నిజాంపేట మండలం కే. వెంకటాపూర్, నార్లపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్లు, గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ వెంకట నరసింహారెడ్డి, కార్యదర్శులు స్రవంతి, ప్రేమలత ఉన్నారు.
