గుంతల వలన ఇబ్బంది పడుతున్న వాహనదారులు
. రోడ్డుపై గుంతల వలన మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువతి..
కొడిమ్యాల (నేటి ధాత్రి ):
కొడిమ్యాల నుండి జగిత్యాలకు వెళ్లే దారిలో నాచుపల్లి గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్ సమీపంలో రోడ్డు పొడవునా గుంత పడడం వలన వాహన దారులు పడి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఇటీవల ఈ మండలంలో బైక్ పై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై గుంతల వలన బైక్ స్కిడ్ డై వెనకాల కూర్చున్న యువతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఈ గుంతను పూడ్చాలని మండల కేంద్రంలోని అధికారులను, వాహనదారులు, ప్రజలు, కోరుకుంటున్నారు.