5కే రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

5కే రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలో 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కె రన్(భూపాలపల్లి హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి కృష్ణా కాలనీ అంబేద్కర్ గ్రౌండ్ వరకు) కార్యక్రమం ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ క్రీడలు యువతలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు శారీరక దృఢత్వాన్ని, ఆలోచనా శక్తిని అభివృద్ధి చేస్తాయని అన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, పోటీ తత్వం పెంపొందుతాయని, యువత ప్రతి రోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ యువత ప్రతిభను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ హరికృష్ణ, జిల్లా క్రీడల అధికారి సిహెచ్ రఘు డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్నాకర్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version