స్వీయ గణన నమోదు చేసుకున్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్…

స్వీయ గణన నమోదు చేసుకున్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

క్యాంపు కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా జనగణనను స్వీయ నమోదు చేసుకున్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు.
ఈ నెల 26న జిల్లా వ్యాప్తంగా జనగణన స్వీయ గణన డిజిటల్ నమోదు కార్యక్రమం ప్రారంభమైన సందర్భంగా మంగళవారం శాసన సభ్యులు క్యాంపు కార్యాలయంలో స్వీయ గణన ప్రక్రియను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు స్వీయ గనణలో తమ వివరాలు నమోదు చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ కొరకు https://se.census.gov.in లింక్ ఓపెన్ చేసి మొబైల్ నంబర్ నమోదు చేయాలని, ఓటిపి నమోదు చేసి జిల్లా, పట్టణం, గ్రామం, పిన్ కోడ్ నమోదు చేయాలని తెలిపారు. ఆన్లైన్ ద్వారా స్వీయ గనణలో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. జిళ్లలో మే 10వ తేదీ వరకు స్వీయ గణన జరుగుతుందని తదుపరి మే 11వ తేదీ నుండి ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని, ఎన్యూమ రేటర్లుకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసిన సమయంలో వచ్చిన ఐడి నంబర్‌ తెలియచేయాలని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమ రేషన్ చేసిన ప్రతి ఒక్కరూ ఐడి నంబర్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని తెలిపారు.
జిల్లా ప్రజలు అందరూ జనగణన కార్యక్రమంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో సీపీఓ జవహర్, డిప్యూటీ ఎస్ఓ సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version