శంకర్‌పల్లి మండలం మహాలింగాపురం సమీపంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. బలమైన ఈదురు గాలుల కారణంగా భారీ క్రేన్ అకస్మాత్తుగా కుప్పకూలి అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడింది.
ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు, సహచర కార్మికులు వెంటనే బయటకు తీసి ఆసుపత్రులకు తరలించారు.
ఎన్‌సీసీ సంస్థ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రాథమికంగా సాంకేతిక లోపం లేదా భద్రతా ప్రమాణాల లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది.
అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
