మొక్కజొన్న నిల్వలపై ఎమ్మెల్యే దొంతి సమీక్ష

మొక్కజొన్న నిల్వలపై ఎమ్మెల్యే దొంతి సమీక్ష

రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాలు జారీ

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పరిధిలో కొనుగోలు చేసిన మొక్కజొన్న నిల్వల పట్ల నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో పాటు సంబంధిత శాఖల అధికారులు సోమవారం సమీక్షా సమావేశంల నిర్వహించారు.రైతులు పండించిన మొక్కజొన్న నిల్వల పరిస్థితిపై సమగ్రంగా చర్చించారు.మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. అనంతరం నర్సంపేట అగ్రికల్చర్ మార్కెట్ గోదాంను సందర్శించి నిల్వల భద్రతను పరిశీలించారు.గోదాంలోకి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క రైతు నష్టపోకుండా న్యాయం జరిగేలా అధికార యంత్రాంగం కృషి చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, డీసీఓ నీరజ, ఆర్డీవో ఉమారాణి,నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి,డీఎం మార్కెటింగ్ సురేఖ, మార్క్‌ఫెడ్ నిరంజన్, మండలాల తహసిల్దార్లు రవిచంద్రారెడ్డి, సమ్మక్క తదితరుల ఎమ్మార్వోలు,అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version