కలియుగ దైవం శ్రీమత్స్య గిరిస్వామి దేవాలయం

కలియుగ దైవం శ్రీమత్స్య గిరిస్వామి దేవాలయం

నేటి నుండి బ్రహ్మోత్సవా లు

కాకతీయుల కళా వైభ వానికి ప్రతీక.

శాయంపేట నేటిధాత్రి;

శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరిస్వామి ఆలయం కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. రాష్ట్రం లోనే రెండో మత్స్యగిరిస్వామి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిం ది. శ్రీ మత్స్యగిరిస్వామి వారి కి ప్రతి సంవత్సరం వైశాక శుద్ధ పౌర్ణమి పంచమ రాత్రి ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ మత్స్యగిరి స్వామి తిరు కళ్యాణ బ్రహ్మో త్స వాలను వైభవంగా నిర్వహించడం ఆనవాయి తీగా వస్తుంది. ఆ క్రమంలోనే ఏప్రిల్ 29 బుధవారం నుండి మే 3 ఆదివారం వరకు ఐదు రోజులపాటు బ్రహ్మోత్సవా లను వైభవంగా నిర్వహిం చడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాలయ ట్రస్టు బోర్డు చైర్మన్ సామల బిక్షపతి తెలిపారు. వేసవికాలం దృష్ట్యా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేసినట్లు వెల్లడించారు.ఆల య చరిత్ర. శాయంపేట గ్రామ పొలిమేరలోని మచ్చర్లయ గుట్టపై శ్రీ మత్స్యగిరిస్వామి ఆరు శతాబ్దాల క్రితం సుమా రు 570 సంవత్సరాలకు కొలువు దీరినట్లు పూర్వీకులు చెబుతున్నారు. మహావిష్ణువు దుష్టశిక్షణకై దశావతారాలలో భాగంగా మొదట మత్స్య అవతారంగా వెలిసినట్లు చెబుతున్నారు. మచ్చర్లయ్య గుట్ట వద్ద గ్రామ్యభాషలో శాలివాహన శకంలో వేయిం చిన శిలాశాసనం ద్వారా ఆనా టి దేవాలయ చరిత్ర తెలు స్తుంది. గుట్ట లోపల బండరా యిపై సహజ సిద్దంగా చేప అవతారంలో స్వామివారు దర్శనమిస్తారు. ఇక్కడ 14 దేవాలయాలు 24 మంది అర్చకులు ఉండేవారని శిలా శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ గుట్ట లోపలకి వెళ్లేందుకు ఒకే ఒక చిన్న మార్గం ఉంటుం ది. అప్పుడు నిర్మించిన చెరు వు నేటికీ అదే దేవుని చెరువు పేరుతో పిలువబడుతుంది. కాకతీయ సామంత రాజు కొత్తగట్టు సీమ పాలకుడు రేచర్లదర్శనాయుడు తన తల్లిదండ్రులు సింగమాంబ సింగమ నాయుడు దేవా లయం నిర్మించినట్లు తెలు స్తుంది. కాలక్రమంలో మచ్చ ర్లయ్య గుట్ట వద్ద నుంచి గ్రామం దూరంగా వెళ్లిపో యింది. గ్రామం మధ్యలో రాతితో శ్రీ మత్స్యగిరిస్వామి దేవాలయాన్ని నిర్మించారు దేవాలయం గోపురం పైన మహావిష్ణు దశావతారాలు భక్తులకు దర్శనమిస్తాయి.

కార్యక్రమా వివరాలు. ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉద యం అధ్యాయనోత్సవం తోల క్కo ప్రారంభం పుట్ట బంగారు సేవ మధ్యాహ్నం ధ్వజారో హణము గరుడ ముద్ద. సం తానం లేని దంపతులు గరుడ ముద్ర ప్రసాదము స్వీకరిం చడం ద్వారా సంతానం కలు గుతుంది ప్రసిద్ధి గాంచింది. రాత్రి ఎదురుకోళ్లు. 30 తేదీ గురువారం ఉదయం 11 గంటలకు కళ్యాణోత్సవం. మధ్యాహ్నం 1 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం మే 1 తేదీ శుక్రవారం ఉద యం పూర్ణాహుతి సాయంత్రం 6 గంటలకు గజవహనసేవ గుట్టమీదికి పోవటం మే 2 తేదీ సాయంత్రం రథోత్సవం స్వామివారు అలుకతీరుట సాంస్కృతిక కార్యక్రమాలు మే 3వ తేదీ ఆదివారం ఉదయం చక్రవరీ సాయంత్రం నాకబలి పుష్పయాగం ద్వాదశ ప్రదక్షి ణాలు పండిత సన్మానంతో ఉత్సవాలు ముగిస్తాయని దేవాలయ చైర్మన్ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version