రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో పథకాలు సాధించిన మెట్పల్లి కరాటే విద్యార్థులు.
మెట్ పల్లి డిసెంబర్ 8 నేటి ధాత్రి
ఆదివారం రోజున పొన్నాల గార్డెన్ జగిత్యాల జిల్లా లో పవన్ కరాటే అకాడెమీ ఆర్గనైజర్ పవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ 2025 పోటీలలో జె.కె.ఏ ఇండియా షోటోకాన్ కరాటే అసోసియేషన్ జగిత్యాల జిల్లా నుండి 53 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో మెట్ పల్లి కి చెందిన 23 మంది కరాటే విద్యార్థులు వివిధ విభాగాల్లో 9 బంగారు పథకాలు, 5 వెండి పథకాలు, 9 కాంస్య పథకాలు గెలుపొందారు. అలాగే అత్యధిక బంగారు పథకాలు సాధించినా వంశినాయుడు మాస్టర్ కరాటే అసోసియేషన్ కు ఓవరాల్ ఛాంపియన్ షిప్ కప్ కైవసం చేసుకున్నారు.అనంతరం టోర్నమెంట్ ప్రధాన జడ్జ్ రచ్చ శ్రీనివాస్ మాస్టర్,ఆర్గనైజర్ పవన్, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ చేతులమీదుగా విద్యార్థులకు పథకాలు, ప్రశంసా పత్రాలు అందజేసారు. వివిధ జిల్లాల నుండి 500 మంది కరాటే విద్యార్థులు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారని జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
జగిత్యాల జిల్లా ఎం.ఎల్.ఏ సంజయ్ కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్ పవన్, శ్రీనివాస్, లింగయ్య, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్, కరాటే మాస్టర్లు నవీన్, వంశీనాయుడు, విశ్వ తేజ కరాటే విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.
