మార్వాడి గో బ్యాక్ పిలుపు చట్ట విరుద్ధం
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
మార్వాడి గో బ్యాక్ పిలుపులో భాగంగా తెలంగాణ బంద్ చట్టవిరుద్దమని బిజెపి నాయకులు అన్నారు.ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ భారతదేశంలో ఎవరైనా,ఎక్కడైనా నిర్భయంగా న్యాయపరమైన వ్యాపారాలు చేసుకోవచ్చని చెప్పారు.బందుకు పిలుపునిచ్చిన వారిని కాకుండా బిజెపి శ్రేణులను అరెస్టు చేయడానికి ఖండిస్తున్నామన్నారు.ఈ అరెస్టులతో హిందువుల ఐక్యతను విడదీయలేరని అన్నారు.నస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్, ప్రధాన కార్యదర్శిలు పొన్నవేని సదయ్య,బద్రి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు కట్కూరి తిరుపతి,బిజేవైఎం జిల్లా కార్యదర్శి మద్ది సుమన్ యాదవ్,శక్తి కేంద్రం ఇంచార్జ్ చల్లవిక్రమ్,కోశాధికారి పులి రాజేందర్ గౌడ్,దూట కిరణ్, కొత్తపల్లి సాత్విక్,చెన్నం నితిన్ లు అరెస్ట్ అయినారు.
