ఘనంగా మల్లికార్జున ఖర్గే జన్మదిన వేడుకలు.
కేక్ కట్ చేసిన మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్
భూపాలపల్లి నేటిధాత్రి
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే 83వ జన్మదిన వేడుకలను టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ మాట్లాడుతూ,1969 లో కాంగ్రెస్ పార్టీలో చేరిన మల్లికార్జున ఖర్గే 1972–2009 ఎమ్మెల్యేగా, 2009–2019 ఎంపీగా గెలుపొంది, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్, రైల్వే శాఖ మంత్రిగా కారణమైన శైలిలో సేవలను కొనసాగించారు. 2020 లో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికై, 2021 నుండి రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కొనసాగుతూ, కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలికంగా కొనసాగుతూ అత్యంత నమ్మకస్తుడిగా ప్రవేశపెట్టిన కార్గే, 2022 లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ,తన రాజకీయ అనుభవంతో సామాజిక న్యాయం కోసం, అన్న నిత్య పోరాడుతున్న మల్లికార్జున కారుకే నిండు నూరేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ దేశ ప్రజలకు తన సేవలను అంకితం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మండల యువజన కాంగ్రెస్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.