.22 నుంచి దుర్గాదేవి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలు
జహీరాబాద్ నేటిధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 22 నుంచి దుర్గాదేవి శరన్నవరాత్రుల దసరా మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు
ఆలయ ఈ.ఓ శివరుద్రప్ప ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో 22 నుండి అక్టోబర్ 2 వలకు పార్వతిదేవి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా నిర్వహించుటకు నిర్ణయించామన్నారు.ఈ నేపథ్యంలో ప్రతి రోజు అమ్మవారికి అభిషేక అలంకారాలు అలాగే భక్తులతో విఘ్నేశ్వర పూజ చతుష్టి సహిత ఆవరణార్చనలు లలిత హోమం ఉంటుందని పేర్కొన్నారు.పూజల్లో పాల్గొనేందుకు ఒక్కరోజు శ్రీ చక్ర సవరణ పూర్వక అభిషేకసహిత అలంకారణాది అర్చన మూడు రోజులకు రూ. 516,పాడ్యమి నుండి దశమి న్10 రోజులకు గాను ఒకేసారి రూ.1516 చెల్లించాలని,ప్రతి రోజు లలిత సహస్రనామ పారాయణము రూ. 5016 ఉంటుందని పేర్కొన్నారు.
నవరాత్రులలో అమ్మవారికి చేయబడు నిత్యాలంకారముల కోసం పట్టుచీరలు (సిల్కు) మాత్రమే అలంకరింపబడునని ఆలయ ఈ ఓ తెలిపారు.