సికెఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా “మన గ్రంథాలయ జ్ఞానోత్సవం”
వరంగల్, నేటిధాత్రి.
సి.కె.యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వరంగల్‌లో తెలంగాణ ప్రభుత్వం మరియు కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో “మన గ్రంథాలయ జ్ఞానోత్సవం” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ. ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయపాల్ రెడ్డి, బిల్లాల శివుడు రచించిన పుస్తకాలను ఆవిష్కరించి వారిని ఘనంగా సన్మానించారు. అలాగే ఉత్తమ గ్రంథాలయ వినియోగదారులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
గ్రంథాలయ సేవల విశిష్టతను తెలియజేసే విధంగా ప్రత్యేక బ్యానర్, పుస్తక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు పోటీ పరీక్షల కోసం కూడా గ్రంథాలయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గ్రంథాలయంలో లభ్యమయ్యే పుస్తకాలు, ఈ-వనరులు విద్యార్థులు మరియు అధ్యాపకులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
అమెరికాకు చెందిన సేవ స్ఫూర్తి ఫౌండేషన్ ఎన్‌జీఓ ద్వారా గ్రంథాలయానికి రూ.10 వేల విలువైన పుస్తకాలను అందించేందుకు మేనేజర్ గొల్లపల్లి రత్నాకర్ సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గ్రంథపాలకులు ఎస్. అనిల్ కుమార్‌ను ప్రిన్సిపాల్ అభినందించారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్ కె.ఎల్.వి. వరప్రసాద్ రావు, డాక్టర్ బి. విజయపాల్ రెడ్డి, ఎన్‌సీసీ అధికారి కెప్టెన్ సతీష్ కుమార్, అయేషా, ఎస్. వెంకటేశ్వర్లు, బిల్లాల శివుడు, ఏ. హరిబాబు, స్రవంతి, సుమన్, అంజయ్య, రాజేష్, నాగరాజు, కళాశాల సూపరింటెండెంట్ జి. శ్రీనివాస్, గ్యానేశ్వర్, పాషా, జమున, సరిత, సురేష్, రామరాజు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
