విశ్రాంత అధికారి పాఠాలు: విద్యార్థులకు ఆనందం, దేశానికి ఉత్తమ పౌరులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి మండలంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో విశ్రాంత మండల విద్యాధికారి, అడ్వకేట్ డి. అంజయ్య విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులుగా బోధించడం వల్ల మానసిక ఆనందం కలుగుతుందని, సమయం దొరికినప్పుడల్లా విద్యార్థులతో గడపడం సంతోషాన్నిస్తుందని ఆయన తెలిపారు. విశ్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు తమకు దగ్గరలోని పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు బోధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిల్లలతో సమయం గడపడం దేశానికి ఉత్తమ పౌరులను తయారు చేయడానికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ప్రధానోపాధ్యాయులను లేదా మండల విద్యాధికారిని సంప్రదిస్తే బోధించడానికి అనుమతి లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత పాల్గొన్నారు.
