బస్టాండ్ ను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
మాజీ కౌన్సిలర్ కొమరవెల్లి అనిత సుధాకర్ రెడ్డి
నాగారం నేటిదాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
నాగారం మున్సిపాలిటీ 7వ వార్డు ఎస్వి నగర్ మెయిన్ రోడ్ విజయ హాస్పిటల్ గేట్ ప్రక్కన సుమారు 25 సంవత్సరాల నుండి ఉన్న బస్టాండ్ ను స్థానిక మున్సిపాలిటీ నుండి కానీ సంబంధిత ఏ డిపార్ట్మెంట్ ద్వారా కానీ ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్ట రాజ్యంగా రాత్రికి రాత్రే తొలగించిన విజయ హాస్పిటల్ యాజమాన్యం ఇట్టి విషయంపై స్థానిక కాలనీ వాసుల ద్వారా సమాచారం అందుకున్న బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు 9వ వార్డు మాజీ కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా బస్సు స్టాండ్ ను తొలగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని బస్సు స్టాండ్ ను యాద తదంగా పునర్నిర్మించాలని ముందే వేసవి కాలం కావడంతో నిలువ నీడ లేక స్కూల్ పిల్లలు,కాలేజ్ విద్యార్థులు, మహిళలు, వయో వృద్ధుల బాధలు చెప్పలేనివి అని. తక్షణమే బస్సు స్టాండ్ నిర్మించని యెడల వచ్చే ప్రజావాణి కార్యక్రమంలో కాలనీ ప్రజలం అందరం కలిసి కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతామణి అలాగే సిడిఎంఏ ఉన్నతధికారులకు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రావు, వీరా రెడ్డి, పంజలా నర్సింహా గౌడ్, మర్రి కొండల్ రెడ్డి,దుడికి ప్రభు కిరణ్, కోటేశ్వర్ రావు, తదితరులు పాల్గొన్నారు