ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకే!

ఖైరతాబాద్‌ టిక్కెట్‌ ‘‘రోహిన్‌ రెడ్డి’’కే!

’’రోహిన్‌ రెడ్డి’’ వైపే ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’ మొగ్గు!

`‘‘దానం’’ బరిలో నిలబడితే ‘‘కష్టమే’’!

`అభ్యర్థిని మార్చితే ‘‘కాంగ్రెస్‌’’ కు ‘‘గెలుపు’’ నల్లేరు మీద నడకే.

`‘‘విజయారెడ్డి’’ మద్దతు ‘‘రోహిన్‌ రెడ్డి’’కే!

`ప్రజలు కూడా అధికార కాంగ్రెస్‌ వైపే!

`‘‘రోహిన్‌ రెడ్డి’’ సీఎం ‘‘రేవంత్‌’’ కు అత్యంత సన్నిహితుడు.

`‘‘రోహిన్‌ రెడ్డి’’ ఖైరతాబాద్‌ నియోజకవర్గం స్థానికుడు.

`‘‘రోహిన్‌ రెడ్డి’’ ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు

`జూబ్లీ ని ఒంటి చేత్తో గెలిపించిన ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’.

`‘‘రోహిన్‌ రెడ్డి’’ గెలిస్తే నియోజకవర్గానికి ‘‘ఇతోధిక నిధులు’’.

`‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’ కి అత్యంత సన్నిహితుడు కావడం నియోజకవర్గానికి మేలు.

`కాంగ్రెస్‌ చేయించిన సర్వేలో ‘‘దానం’’ కు తక్కువ మద్దతు.

`అభ్యర్థిని మర్చితే కాంగ్రెస్‌ కె ‘‘70 శాతం’’ జనం ఓట్లు.

’’విజయారెడ్డి’’కి ‘‘సిఎం రేవంత్‌ రెడ్డి’’ భవిష్యత్‌ మీద హామీ

హైదరాబాద్‌, నేటిధాత్రి:

రాజకీయంగా ప్రతిపక్షాలకు తన వ్యూహాలతో కౌకు దెబ్బలుకొట్టడంలో సిఎం. రేవంత్‌ రెడ్డి సిద్దహస్తుడు. అందుకే ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీకి కళ్లు బైర్లు కమ్మేటు వంటి దెబ్బ కొట్టారు. అసలు జూబ్లీలో కాంగ్రెస్‌ పోటీచేసేందుకు భయపడుతుందని అసత్య ప్రచారం చేసిన బిఆర్‌ఎస్‌కు ఓడిరచి తనేంటో, తన రాజకీయ చతురత ఏమిటో మరోసారి రుచి చూపించారు. ఇప్పుడు ఉప ఎన్నికలు అంటే చాలు బిఆర్‌ఎస్‌ గజగజ వణికిపోయేలా చేశాడు. జూబ్లీలో గెలుస్తామా? లేదా? అనే అనుమానం కాంగ్రెస్‌ పార్టీలో అందరికీ వుండేది. కాని గెలిచి చూపించడం ఎలా వుంటుందో ఒక్క రేవంత్‌ రెడ్డికి మాత్రమే తెలుసు. అందుకే ఆ ఎన్నిక భారం మొత్తం తన భుజాన వేసుకొని సిఎం.రేవంత్‌ రెడ్డిగా ఒక్కసారి ఎవరెస్టుశిఖరమంతటి ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. తెలిసీ తెలియకుండా మాట్లాడేవారి నోర్లు మూయించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు అటు ప్రతిపక్షాలను, ఇటు సొంత పార్టీ నేతల సిఎం. రేవంత్‌ తన రాజకీయ చాణక్యం చూపించారు. ఇప్పుడు కూడా సరిగ్గా అదే చేయబోతున్నారు. జూబ్లీ ఎన్నికల సమయంలో చివరి క్షణంలో అభ్యర్ధిని ఎంపిక చేశారు. అంతకు ముందు ఎవరెవరు? టికెట్‌ ఆశిస్తున్నారో..వారికి ప్రజల్లో వున్న పలుకుబడి ఎంతో అంతా గమనించారు. ఆఖరుకు ఎవరిని నిలబెట్టి గెలిపిస్తే తన రాజకీయం బలం కొండంత పెరుగుతుందో ఆలోచించి అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ను ఎంపిక చేసి గెలిపించారు. తనను నాయకత్వ పటిమను మరోసారి చూపించారు. ఒకవేళ ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వస్తే అందరికంటే ముందుగానే అభ్యర్దిని ప్రకటించి, ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలనుకుంటున్నారు. జూబ్లీలో ఆఖరు వరకు ఎదురు చూసి అభ్యర్దిని ఎంపిక చేశారు. ఇప్పుడు మాత్రం అందరికంటే ముందుగానే అభ్యర్దిని ఎంపిక చేయాలనుకుంటున్నారు. అది కూడా సిఎం.కు అత్యంత సన్నిహితుడైనటు వంటి రోహిన్‌ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లే లెక్క అని విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే రోహిన్‌ రెడ్డి సిఎం. రేవంత్‌ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడు. సిఎంకు శ్రేయోభిలాషి. రోహిన్‌ రెడ్డి ఉన్నత విద్యావంతుడు. పైగా వైద్యుడు. ప్రజా సేవ అంటే ఎంతో ఇష్టమైన వారు. కొన్ని దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న నాయకుడు. రాజీకీయాలలోవున్నవారు. అన్నింటికన్నా మించి ఖైరతాబాద్‌ నియోజకవర్గ స్దానికుడు. కాంగ్రెస్‌ పార్టీలో ఖైరతాబాద్‌ నియోజకవర్గ అధ్యక్షుడుగా కూడాకొనసాగుతున్నారు. ఇన్ని రకాలుగా ఆయనకు అర్హతలున్నాయి. ఖైరతాబాద్‌ స్దానికుడు కావడం వల్ల ఆయనను ప్రజలు కూడా నేరుగా గుర్తుపడతారు. ఈ మధ్య సిఎం. రేవంత్‌ రెడ్డితోనే నిత్యం వుండడం వల్ల ప్రజలకు తెలిసిన నాయకుడయ్యారు. సహజంగా ఉప ఎన్నికలు అంటే ప్రజలు కూడా అధికార పార్టీ నాయకులను ఎన్నుకునేందుకు ఆసక్తిచూపుతారు. ప్రభుత్వం వున్నంత కాలం అధికార పార్టీ ఎమ్మెల్యే వుంటే నియోజకవర్గం అభివృద్ది చెందుతుంది. ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వస్తే రోహిన్‌ రెడ్డి ఎమ్మెల్యే కావడం వల్ల నేరుగా సిఎంతో వుండే సాన్నిహిత్యం, సన్నిహిత సంబధాల వల్ల ఏ నియోజక వర్గానికి లేని అనేక అవకాశాలు వుంటాయి. వేల కోట్ల రూపాయలు నిదులు తెచ్చి నియోజకవర్గాన్ని బంగారుతునక చేసేందుకు వీలౌతుది. రోహిన్‌రెడ్డి కాకుండా ఇంకా ఎవరిని ఎంపిక చేసినా అన్ని నిధులు తేలేరు. ఖైరతాబాద్‌ను నెంబర్‌ వన్‌ నియోజకవర్గం చేయలేరు. అది ఒక్క రోహిన్‌ రెడ్డి వల్లనే సాద్యమౌతుంది. అందుకే ఒక వేళ దానం నాగేందర్‌కే టికెట్‌ ఇస్తే పరిస్దితి ఎలా వుంటుందనేది సర్వేలు చేశారు. మొత్తం నియోకజవర్గంలో కనీసం 13శాతం మంది కూడా దానం బెటర్‌ అన్నట్లు తేలలేదని సమాచారం. దానంకు కాకుండా మరెవరికి ఇచ్చినా, అందులోనూ రోహిన్‌రెడ్డికి ఇస్తే 70శాతం మంది ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించుకుంటామని చెప్పినట్లు ఆంతరంగిక సర్వేలో వెల్లడైంది. అందువల్ల ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక వస్తే మాత్రం టికెట్‌ ముందే రోహిన్‌రెడ్డికి ప్రకటించనున్నారు. ఇక పిజేఆర్‌ కూతరు విజయారెడ్డికి సిఎం. రేవంత్‌ రెడ్డి రాజకీయంగా ఆమె భవిష్యత్తుకు భరోసా ఇచ్చినట్లు కూడా సమాచారం. ఈసారి జిహెచ్‌ఎంసిపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం. మేయర్‌ పదవి నీకే అని సిఎం. రేవంత్‌ రెడ్డి, విజయారెడ్డికి భరోసా కల్పించినట్లు తెలుస్తోంది. దాంతో విజయారెడ్డి ఎలాగూ దానం నాగేందర్‌కు సపోర్టు ఇవ్వరు. దానం నాగేందర్‌ వల్లనే పిజేఆర్‌ తర్వాత ఖైరతాబాద్‌ నియోజకవర్గం ఆ కుటుంబం నుంచి జారిపోయింది. అందువల్ల దానం నాగేందర్‌కు ఎట్టిపరిస్దితుల్లోనూ విజయారెడ్డి సపోర్టు వుండదు. అందవల్ల రోహిన్‌ రెడ్డికి గెలిపించే బాద్యత సిఎం. తర్వాత విజయరెడ్డి తీసుకుంటారు. దానం నాగేందర్‌ ఎప్పుడు ఏ పార్టీలో వుంటారన్నది ఆయనకే స్పష్టత వుండదు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వెంటనే కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2014లో కాంగ్రెస్‌ ఓడిపోయిన తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరిపోయారు. 2023లో తాను గెలిచినా, బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది. దాంతో కాంగ్రెస్‌లో చేరారు. ఒక వేళ బిఆర్‌ఎస్‌ గెలిస్తే ఆయన వచ్చే వారు కాదు. ఇప్పుడు కూడా ఆయన ఆలోచనలు పరిపరి విధాలుగా వుంటాయి. హైడ్రా విషయంలో ఏకంగా సిఎం. రేవంత్‌ రెడ్డిని కూడ ప్రశ్నించారు. ఒక వేళ మళ్లీ టికెట్‌ ఇచ్చి గెలిపించుకుంటే అది తన సొంత బలంతో గెలిచాననే అంటారు. తన వల్లే కాంగ్రెస్‌కు బలమొచ్చిందంటారు. హైదరాబాద్‌ రాజకీయాలు నా గుప్పిట్లో వుండాలని కోరుకుంటారు. ఆయన సొంత వర్గం ఏర్పాటు చేసుకొని రాజకీయ చికాకులు తెచ్చి పెడతాడని చెప్పడంలో సందేహం లేదు. అంతే కాకుండా హైకమాండ్‌ కూడా దానం నాగేందర్‌కు ఏదైనా పదవి ఇచ్చేందుకు మొగ్గు చూపుతోందే కాని టికెట్‌ ఇచ్చేందుకు సుముఖంగా లేదు. పైగా సిఎం. రేవంత్‌ రెడ్డిని కాదని హైకమాండ్‌ టికెట్‌ ఇవ్వదు. సిఎం. రేవంత్‌ రెడ్డి ఈ అవకాశాన్ని వదులుకోరు. మిత్రుడ రోహిన్‌ రెడ్డికి టికెట్‌ ఇవ్వకుండా వుండరు. తనను నమ్మిన, నమ్ముకున్న వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిఎం. రేవంత్‌ రెడ్డి వెనుకాడరు. అందుకే రోహిన్‌ రెడ్డికి టికెట్‌ ప్రకటిస్తారు. గెలిపించుకుంటారు. మిత్రధర్మం మరోసారి ఎంత గొప్పదో చూపిస్తారు. అందరికంటే ముందే అభ్యర్దిని ప్రకటించి, ప్రతిపక్షాలను డైలమాలో పడేసి, కోలుకోకుండా చేయడంతోపాటు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఖైరతాబాద్‌ నియోజకవర్గాన్ని అభివృద్ది పనులు పెద్దఎత్తున మొదలు పెడతారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు చాల వరకు జెట్‌ స్పీడ్‌లో పనులు పూర్తి చేస్తారు. ప్రజల మన్ననలు పొంది ఓట్లకు వెళ్తారు. ప్రతిపక్షాలు నోళ్లు వెల్లబెట్టి చూస్తారు. ఇక ఎన్నికలన్నా, ఉప ఎన్నికలన్నా ప్రతి పక్షాలు జడుసుకునే పరిస్ధితి సిఎం. రేవంత్‌ రెడ్డి తెస్తారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version