ప్రజలకు ఝరాసంగం ఎస్సై కీలక సూచనలు.
◆:- రాబోయే మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం మండలంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై క్రాంతి కుమార్ పటేల్ సూచించారు. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నందున, ప్రజలు గ్రామాల్లోనే ఉండి, అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని ఆయన తెలిపారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని, విద్యుత్ షాక్ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని, పశువులను కూడా వాటికి దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. కరెంట్ స్తంభాలు, ట్రాన్స్ఫారం వద్దా పశువులను ఉండొద్దని కూడా ఆయన పేర్కొన్నారు.