కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితం..

కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితం..

ప్యాలెస్‌లో కూర్చొని కలలు కంటూ ఉండటమే జగన్‌కి తెలుసు అని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే వైసీపీకి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెప్పారని గుర్తుచేశారు. జగన్‌కి మానసిక పరిస్థితి బాలేదని మంత్రి సత్య కుమార్ యాదవ్ విమర్శించారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై, వైసీపీ డిజిటల్ బుక్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి ప్రభుత్వానికి భయపడి ప్యాలెస్‌కే జగన్ పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై ఏమాత్రం సంబంధం లేకుండా రాజకీయ లబ్ధి కోసమే దండయాత్ర చేయడం జగన్ నైజమని ఫైర్ అయ్యారు. ఇవాళ(ఆదివారం) అనంతపురంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి సత్య కుమార్.
ప్రజలపై దాడులు చేయడం తలకాయలు నరకడం, తలకాయలు తొక్కించటం, రప్ప రప్ప అనటం.. ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడటమే జగన్ వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు. విష సంస్కృతిని అలవరుచుకున్న పార్టీ వైసీపీ అని ఆక్షేపించారు. వైసీపీ నేతలు బెదిరిస్తే ప్రజలు భయపడే వారు ఎవరూ లేరని హెచ్చరించారు. ప్రజలు ఓట్లు వేయలేదు కాబట్టే అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదని ఎద్దేవా చేశారు మంత్రి సత్య కుమార్.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version