ఇందిరమ్మ ఇండ్ల పనులు పరిశీలన
ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలం ఆరేపల్లె, శాయంపేట మండల పరిధిలోని నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులు శుక్రవారం సిఈఓ జెడ్పి ఇన్చార్జ్ రవి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత పై ఏమాత్రం రాజీపడకుండా ప్రతి దశలో పనులు వేయంగా పూర్తి చేయాలని ఆదేశించారు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అవసరమైన ఇసుక మట్టి లబ్ధిదారులకు అందజే యాలని అవగాహన కల్పించారు. ఇందిరమ్మ ఇళ్ళను ప్రతి ఒక్క లబ్ధిదా రుడు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఫణి చంద్ర, మండల అధికారులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రజలు పాల్గొన్నారు.
